యోబు 31:1-40

  • యోబు తన యథార్థతను ​సమర్థించుకోవడం (1-40)

    • “నా కళ్లతో ఒప్పందం చేసుకున్నాను” (1)

    • దేవుడు తనను త్రాసులో కొలవాలని ​అడిగాడు (6)

    • వ్యభిచారం చేసేవాడు కాదు (9-12)

    • డబ్బును ప్రేమించేవాడు కాదు (24, 25)

    • విగ్రహాల్ని పూజించేవాడు కాదు (26-28)

31  “నేను నా కళ్లతో ఒప్పందం* చేసుకున్నాను.+ కన్యను నేనెలా తప్పుడు దృష్టితో చూడగలను?   అలా చూస్తే, పైనున్న దేవుని నుండి నేను పొందే ప్రతిఫలం ఏంటి?ఉన్నత స్థలంలో ఉన్న సర్వశక్తిమంతుడు నాకిచ్చే స్వాస్థ్యం ఏంటి?   తప్పుచేసేవాడి మీదికి ఆపద,హానిచేసేవాళ్ల మీదికి విపత్తు వస్తుంది కదా.+   ఆయన నా దారుల్ని చూస్తున్నాడు,+నా అడుగులన్నిటినీ లెక్కపెడుతున్నాడు.   నేనెప్పుడైనా అసత్య మార్గంలో* నడిచానా? నా పాదాలు మోసం చేయడానికి పరుగెత్తాయా?+   దేవుడు నన్ను సరైన త్రాసులో కొలవాలి;+అప్పుడు ఆయన నా యథార్థతను గుర్తిస్తాడు.+   నా అడుగులు సరైన దారి నుండి పక్కకు మళ్లితే,+నా హృదయం నా కళ్లను అనుసరించి ఉంటే,+నా చేతులు అపవిత్రమై ఉంటే,   నేను విత్తిన దాన్ని వేరేవాళ్లు తినాలి,+నేను నాటే మొక్కలు* పెరికేయబడాలి.   నా హృదయం పర స్త్రీని కోరుకొని ఉంటే,+నేను నా పొరుగువాని తలుపు దగ్గర కాచుకొని ఉంటే,+ 10  నా భార్య వేరే అతని తిరుగలి విసరాలి,వేరేవాళ్లు ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోవాలి.+ 11  ఎందుకంటే అది అవమానకరమైన ప్రవర్తన,న్యాయమూర్తుల చేత శిక్ష పొందాల్సిన తప్పు.+ 12  మింగేసి, నాశనం చేసే అగ్నిలా+అది నా పంట అంతటినీ వేర్లతో సహా దహించేస్తుంది. 13  నా సేవకులు, సేవకురాళ్లు నా మీద ఫిర్యాదు చేసినప్పుడునేను వాళ్లకు న్యాయం చేయకపోయుంటే, 14  దేవుడు లేచినప్పుడు* నేను ఏం చేయగలను? ఆయన లెక్క అడిగినప్పుడు ఏం జవాబు చెప్పగలను?+ 15  తల్లి గర్భంలో నన్ను తయారుచేసిన వ్యక్తే వాళ్లను కూడా తయారుచేశాడు కదా?+ పుట్టకముందు* మమ్మల్ని రూపొందించింది ఒక్కడే కదా?+ 16  నేను పేదవాళ్లకు వాళ్లు కోరుకున్నది ఇవ్వకపోయుంటే,+విధవరాలి కళ్లను క్షీణింపజేసివుంటే;+ 17  నా ఆహారాన్ని అనాథలతో పంచుకోకుండా నేనొక్కడినే తినివుంటే;+ 18  (ఎందుకంటే, నా బాల్యం నుండి అనాథ* నాతోపాటే పెరిగాడు, నేనే వాడికి తండ్రిలా ఉన్నాను,నేను నా చిన్నప్పటి* నుండి విధవరాలికి* సహాయం చేస్తూ వచ్చాను.) 19  ఎవరైనా బట్టలు లేక చలిలో నశించిపోవడం గానీ,పేదవాడికి కప్పుకోవడానికి ఏమీ లేకపోవడం గానీ చూసి నేను సహాయం చేయకపోయుంటే;+ 20  అతను నా గొర్రెల ఉన్నితో వెచ్చదనం పొంది నన్ను దీవించకపోయుంటే;+ 21  నగర ద్వారం+ దగ్గర నా సహాయం అవసరమైన* అనాథనునేను బెదిరించివుంటే;+ 22  నా భుజం పడిపోవాలి,నా మోచేయి విరిగిపోవాలి. 23  ఎందుకంటే, నేను దేవుడు విపత్తు తెస్తాడని భయపడ్డాను,నేను ఆయన ఘనత ముందు నిలబడలేకపోయాను. 24  నేను బంగారాన్ని నమ్ముకొనివుంటే,‘నన్ను కాపాడేది నువ్వే!’ అని మేలిమి బంగారంతో అనివుంటే;+ 25  నా గొప్ప సంపదల్ని బట్టి,నేను సంపాదించిన విస్తారమైన ఆస్తుల్ని బట్టి గొప్పలు చెప్పుకొనివుంటే;+ 26  సూర్యుడు* ప్రకాశించడం గానీచంద్రుడు తన వైభవంతో కదలడం గానీ చూసి+ 27  నా హృదయం లోలోపల ప్రలోభానికి గురై,వాటిని పూజిస్తూ నేను నా చేతిని ముద్దుపెట్టుకొని ఉంటే;+ 28  అది న్యాయమూర్తుల చేత శిక్ష పొందాల్సిన తప్పు,ఎందుకంటే, నేను పైనున్న సత్యదేవుణ్ణి తిరస్కరించినట్టే. 29  నా శత్రువు నాశనాన్ని చూసి నేనెప్పుడైనా సంతోషించానా?+అతనికి కీడు జరిగిందని సంబరపడ్డానా? 30  అతను చనిపోవాలని శపిస్తూ నా నోటితో నేనెప్పుడూ పాపం చేయలేదు.+ 31  నా డేరాలోని వాళ్లు నా గురించి,‘అతని ఆహారంతో* తృప్తి చెందని వాళ్లెవరు’ అని అనలేదా?+ 32  పరదేశులెవ్వరూ రాత్రి బయట గడపాల్సిన అవసరం రాలేదు;+నేను ప్రయాణికుల కోసం నా ఇంటి తలుపులు తెరిచే ఉంచాను. 33  నా వస్త్రపు జేబులో నా తప్పును దాచిపెట్టి,వేరేవాళ్లలా నా అపరాధాల్ని కప్పిపుచ్చడానికి ఎప్పుడైనా ప్రయత్నించానా?+ 34  పెద్ద గుంపుకు భయపడిపోయి,లేక వేరే కుటుంబాలు నీచంగా చూస్తాయేమోనని బెదిరిపోయి,ఏమీ మాట్లాడకుండా ఇంట్లోనే ఉండిపోయానా? 35  ఎవరైనా నా మాటలు వింటే బావుండు!+ నేను అన్న మాటలన్నీ నిజమని సంతకం పెడతాను. సర్వశక్తిమంతుడు నాకు జవాబివ్వాలి!+ నన్ను నిందించే వ్యక్తి నా మీది ఆరోపణల్ని దస్తావేజులో రాస్తే బావుండు! 36  నేను దాన్ని నా భుజం మీద మోస్తాను,నా తల మీద కిరీటంలా పెట్టుకుంటాను. 37  నేను వేసిన ప్రతీ అడుగుకు ఆయనకు లెక్క చెప్తాను;అధిపతిలా ధైర్యంగా ఆయన ముందుకు వెళ్తాను. 38  నా భూమే నాకు వ్యతిరేకంగా మొరపెడితే,దాని చాళ్లన్నీ కలిసి ఏడిస్తే; 39  నేను ఏమీ చెల్లించకుండానే దాని ఫలాన్ని తినివుంటే,+లేదా దాని యజమానుల్ని బాధపెట్టి ఉంటే;+ 40  గోధుమలకు బదులు ముళ్ల చెట్లు,బార్లీకి బదులు దుర్వాసన వచ్చే కలుపు మొక్కలు మొలవాలి.” ఇక్కడితో యోబు మాటలు పూర్తయ్యాయి.

అధస్సూచీలు

లేదా “నిబంధన.”
లేదా “నిజాయితీలేని వాళ్లతో” అయ్యుంటుంది.
లేదా “నా వంశస్థులు.”
లేదా “నాకు ఎదురైనప్పుడు.”
అక్ష., “తల్లి గర్భంలో.”
అక్ష., “అతను.”
అక్ష., “నా తల్లి గర్భంలో.”
అక్ష., “ఆమెకు.”
లేదా “నాకున్న మద్దతును చూసుకుని” అయ్యుంటుంది.
అక్ష., “వెలుగు.”
అక్ష., “మాంసంతో.”