యోబు 37:1-24
37 “ఇప్పుడు నా గుండె దడదడలాడుతోంది,అది వేగంగా కొట్టుకుంటోంది.
2 ఆయన స్వర గర్జనను,ఆయన నోటి నుండి వచ్చే ఉరుము శబ్దాన్ని శ్రద్ధగా వినండి.
3 ఆయన దాన్ని ఆకాశమంతటి కింద వినిపించేలా చేస్తాడు,తన మెరుపుల్ని భూమి అంచుల వరకు పంపిస్తాడు.+
4 తర్వాత గర్జించినట్టు శబ్దం వినిపిస్తుంది;ఆయన గంభీరమైన స్వరంతో గర్జిస్తాడు,+ఆయన స్వరం వినిపిస్తుండగా మెరుపులు మెరుస్తూనే ఉంటాయి.
5 దేవుడు అద్భుతమైన రీతిలో తన స్వరంతో గర్జిస్తాడు;+మన అవగాహనకు అంతుచిక్కని గొప్పగొప్ప పనులు చేస్తాడు.+
6 ఆయన, ‘నేలమీద పడు’ అని మంచుతో,+
‘జోరుగా కురువు’ అని కుండపోత వర్షంతో అంటాడు.+
7 దేవుడు వాళ్ల పనులన్నీ ఆగిపోయేలా చేస్తాడు.*మనుషులందరూ తన పనిని తెలుసుకోవాలని ఆయన అలా చేస్తాడు.
8 అడవి జంతువులు తమ గుహల్లోకి వెళ్లిపోతాయి,తమ విశ్రాంతి స్థలాల్లో ఉండిపోతాయి.
9 తుఫాను గాలి దానిచోటు నుండి బయల్దేరుతుంది,+ఉత్తర గాలులు+ చలిని తీసుకొస్తాయి.
10 దేవుని శ్వాస వల్ల మంచు తయారౌతుంది,+విస్తారమైన జలాలు గడ్డకడతాయి.+
11 ఆయన, తేమతో మేఘాలు బరువెక్కేలా చేస్తాడు;మేఘాల్లో తన మెరుపుల్ని వ్యాపింపజేస్తాడు;+
12 ఆయన నిర్దేశించిన చోటికి అవి గిరగిరా తిరుగుతూ వెళ్తాయి;భూమంతటి పైన ఆయన ఆజ్ఞాపించిన ప్రతీదాన్ని నెరవేరుస్తాయి.+
13 శిక్షించడానికి,+ నేలను తడపడానికి లేదా తన విశ్వసనీయ ప్రేమ చూపించడానికిఆయన వాటిని ఉపయోగిస్తాడు.+
14 యోబూ, ఇది విను;మనసుపెట్టి దేవుని అద్భుతమైన పనుల గురించి జాగ్రత్తగా ఆలోచించు.+
15 దేవుడు మేఘాల్ని ఎలా నియంత్రిస్తాడో,*తన మేఘంలో నుండి మెరుపుల్ని ఎలా పుట్టిస్తాడో నీకు తెలుసా?
16 మేఘాలు ఎలా తేలుతాయో నీకు తెలుసా?+
ఇవి పరిపూర్ణ జ్ఞానంగల దేవుని అద్భుతమైన పనులు.+
17 దక్షిణ గాలి+ వల్ల భూమి ప్రశాంతంగా ఉన్నప్పుడు,నీ బట్టలు ఎందుకు వేడెక్కుతాయో నీకు తెలుసా?
18 లోహపు అద్దమంత గట్టిగా ఉన్న ఆకాశాన్నినువ్వు ఆయనతో కలిసి పరచగలవా?*+
19 మేము ఆయనకు ఏమని చెప్పాలో మాకు చెప్పు;మేము చీకట్లో ఉన్నాం, కాబట్టి జవాబు ఇవ్వలేకపోతున్నాం.
20 నేను ఆయనతో మాట్లాడాలని అనుకుంటున్నాను అని ఎవరైనా దేవునితో చెప్పగలరా?
దేవుడు తెలుసుకోవాల్సినంత ముఖ్యమైన విషయం ఎవరైనా చెప్పారా?+
21 ఆకాశం ప్రకాశవంతంగా ఉన్నాసరేగాలి వీచి, మేఘాలు పక్కకు తొలగిపోయేవరకువాళ్లు వెలుగును* కూడా చూడలేరు.
22 ఉత్తరం నుండి బంగారు కిరణాలు ప్రకాశిస్తాయి;దేవుని గొప్ప తేజస్సు+ భక్తిపూర్వక భయం పుట్టిస్తుంది.
23 సర్వశక్తిమంతుణ్ణి అర్థంచేసుకోవడం మన శక్తికి మించింది;+ఆయన ఎంతో శక్తిమంతుడు,+ఆయన అపారమైన నీతిని,+ న్యాయాన్ని ఎన్నడూ మీరడు.+
24 కాబట్టి ప్రజలు ఆయనకు భయపడాలి.+
ఎందుకంటే, తాము తెలివిగలవాళ్లమని అనుకునేవాళ్లను ఆయన ఇష్టపడడు.”+
అధస్సూచీలు
^ అక్ష., “ప్రతీ మనిషి చేతిమీద ముద్రవేస్తాడు.”
^ లేదా “ఆజ్ఞాపిస్తాడో.”
^ లేదా “సాగగొట్టగలవా?”
^ అంటే, సూర్యుని వెలుగు.