విలాపవాక్యాలు 4:1-22
א [ఆలెఫ్]
4 అయ్యో! మెరిసే బంగారం, మేలిమి బంగారం+ వెలవెలబోయిందే!
పవిత్రమైన రాళ్లు+ ప్రతీ వీధి మూలన చెల్లాచెదురుగా పడివున్నాయే!+
ב [బేత్]
2 మేలిమి బంగారమంత ప్రశస్తమైన* సీయోను కుమారులుమట్టి కుండల్లా, కుమ్మరివాడి చేతి పనిలా ఎంచబడుతున్నారే!
ג [గీమెల్]
3 నక్కలు కూడా తమ పిల్లలకు పాలిస్తాయి,కానీ నా ప్రజల కూతురు ఎడారిలోని* నిప్పుకోళ్లలా+ క్రూరంగా తయారైంది.+
ד [దాలెత్]
4 పాలు తాగే పసిపిల్లల నాలుక దాహంతో అంగిలికి అంటుకుపోతోంది.
పిల్లలు రొట్టె కోసం అడుక్కుంటున్నారు+ కానీ ఎవ్వరూ ఏమీ ఇవ్వట్లేదు.+
ה [హే]
5 రుచికరమైన భోజనం తినేవాళ్లు ఇప్పుడు ఆకలితో* వీధుల్లో పడివున్నారు.+
ఖరీదైన* వస్త్రాలు వేసుకుని పెరిగినవాళ్లు+ బూడిద కుప్పల్లో పడివున్నారు.
ו [వావ్]
6 నా ప్రజల కూతురి శిక్ష* సొదొమ శిక్ష* కన్నా గొప్పది,+
ఆ నగరం ఒక్క క్షణంలో నాశనమైపోయింది, ఎవ్వరూ దానికి సహాయం చేయలేదు.+
ז [జాయిన్]
7 ఆమె నాజీరులు+ మంచుకన్నా స్వచ్ఛంగా, పాలకన్నా తెల్లగా ఉండేవాళ్లు.
వాళ్లు పగడం కన్నా ఎర్రగా ఉండేవాళ్లు, వాళ్ల చర్మం నీలం రాయిలా మెరిసిపోయేది.
ח [హేత్]
8 అయితే ఇప్పుడు వాళ్లు మసిబొగ్గు* కన్నా నల్లగా తయారయ్యారు;వీధుల్లో ఎవ్వరూ వాళ్లను గుర్తుపట్టట్లేదు.
వాళ్ల చర్మం ముడతలు పడి ఎముకలకు అంటుకుపోయింది;+ అది ఎండు కర్రలా తయారైంది.
ט [తేత్]
9 కరువువల్ల చనిపోయినవాళ్ల కన్నా ఖడ్గంవల్ల చనిపోయినవాళ్ల పరిస్థితి నయం;+పొలం పంట లేనందువల్ల కరువు బారినపడి వాళ్లు నశించిపోతున్నారు.
י [యోద్]
10 కనికరంగల స్త్రీలు తమ సొంత చేతులతో తమ కన్న బిడ్డల్ని ఉడకబెట్టారు.+
నా ప్రజల కూతురి మీదికి నాశనం వచ్చినప్పుడు వాళ్లే ఆ స్త్రీలకు ఆహారమయ్యారు.+
כ [కఫ్]
11 యెహోవా తన కోపాన్ని చూపించాడు;తన కోపాగ్నిని కుమ్మరించాడు.+
ఆయన సీయోనులో అగ్ని రాజేశాడు, అది ఆమె పునాదుల్ని దహించేస్తుంది.+
ל [లామెద్]
12 యెరూషలేము ద్వారాల్లోకి శత్రువు, విరోధి ప్రవేశిస్తాడంటేభూరాజులు, దాని నివాసులు ఎవ్వరూ నమ్మలేదు.+
מ [మేమ్]
13 ఆమె ప్రవక్తల పాపాలవల్ల, ఆమె యాజకుల తప్పులవల్ల అలా జరిగింది.+వాళ్లు ఆమె మధ్య నీతిమంతుల రక్తం చిందించారు.+
נ [నూన్]
14 వాళ్లు వీధుల్లో గుడ్డివాళ్లలా తిరిగారు.+
రక్తం వల్ల అపవిత్రులయ్యారు,+దానివల్ల ఎవ్వరూ వాళ్ల బట్టల్ని ముట్టుకోలేకపోతున్నారు.
ס [సామెఖ్]
15 ప్రజలు వాళ్లతో “అపవిత్రులారా, వెళ్లిపోండి! మమ్మల్ని ముట్టుకోకండి! దూరంగా వెళ్లండి! వెళ్లిపోండి!” అని అంటున్నారు.
ఎందుకంటే వాళ్లు ఇల్లు లేక అటూఇటూ తిరుగుతున్నారు.
దేశాల ప్రజలు ఇలా చెప్పుకున్నారు: “వాళ్లు మనతో పాటు ఇక్కడ ఉండడానికి* వీల్లేదు.+
פ [పే]
16 యెహోవాయే* వాళ్లను చెదరగొట్టాడు;+ఆయన ఇక వాళ్ల మీద దయ చూపించడు.
ప్రజలు యాజకుల్ని ఏమాత్రం గౌరవించరు,+ పెద్దల మీద దయ చూపించరు.”+
ע [అయిన్]
17 రాని సహాయం కోసం చూసీచూసీ మా కళ్లు క్షీణించాయి.+
మమ్మల్ని రక్షించలేని దేశం చేసే సహాయం కోసం మేము ఎంతగానో ఎదురుచూశాం.+
צ [సాదె]
18 మేము సంతవీధుల్లో నడవలేకుండా వాళ్లు అడుగడుగునా మమ్మల్ని వేటాడారు.+
మా అంతం దగ్గరపడింది; మా రోజులు ముగిశాయి, మా అంతం వచ్చేసింది.
ק [ఖొఫ్]
19 మమ్మల్ని వేటాడేవాళ్లు ఆకాశంలో ఎగిరే గద్దల కంటే వేగంగా వచ్చారు.+
వాళ్లు పర్వతాల మీద మమ్మల్ని తరిమారు; ఎడారిలో మా కోసం పొంచివున్నారు.
ר [రేష్]
20 మా ఊపిరి, యెహోవా అభిషేకించిన వ్యక్తి,+“దేశాల మధ్య మేము అతని నీడలో బ్రతుకుతాం” అని మేము చెప్పుకున్న వ్యక్తి
వాళ్లు తవ్విన పెద్ద గోతిలో చిక్కుకుపోయాడు.+
ש [సీన్]
21 ఎదోము కూతురా, నువ్వు ఊజు దేశంలో నివసిస్తున్నట్టే సంతోషించు, ఉల్లసించు.+
అయితే ఆ గిన్నె నీ దగ్గరికి కూడా వస్తుంది,+ నువ్వు మత్తుగా తాగి నీ మానాన్ని వెల్లడిచేసుకుంటావు.+
ת [తౌ]
22 సీయోను కూతురా, నీ దోషశిక్ష పూర్తయింది.
ఆయన నిన్ను మళ్లీ చెరలోకి తీసుకెళ్లడు.+
అయితే ఎదోము కూతురా, ఇప్పుడాయన నీ తప్పు మీద దృష్టిపెడతాడు.
నీ పాపాల్ని బయటపెడతాడు.+
అధస్సూచీలు
^ లేదా “మేలిమి బంగారంతో తూచబడిన.”
^ అక్ష., “దిక్కులేకుండా.”
^ అక్ష., “ముదురు ఎరుపు.”
^ అక్ష., “పాపం.”
^ అక్ష., “దోషం.”
^ అక్ష., “నలుపు.”
^ లేదా “పరదేశుల్లా నివసించడానికి.”
^ అక్ష., “యెహోవా ముఖం.”