సంఖ్యాకాండం 10:1-36

  • వెండి బాకాలు (1-10)

  • సీనాయి నుండి బయల్దేరడం (11-13)

  • బయల్దేరాల్సిన క్రమం (14-28)

  • ఇశ్రాయేలీయులకు దారి చూపించమని హోబాబును అడగడం (29-34)

  • డేరాలు తీసి బయల్దేరేటప్పుడు మోషే ప్రార్థన (35, 36)

10  తర్వాత యెహోవా మోషేకు ఇలా చెప్పాడు:  “నీ కోసం రెండు బాకాలు తయారుచేసుకో; వెండిని సుత్తితో మలుస్తూ* వాటిని తయారుచేయి; ఇశ్రాయేలు సమాజాన్ని పిలవడానికి, డేరాలు ఎప్పుడు తీసేయాలో సూచించడానికి వాటిని ఉపయోగించు.  రెండిటినీ ఊదినప్పుడు, ఇశ్రాయేలు సమాజమంతా ప్రత్యక్ష గుడారపు ప్రవేశ ద్వారం ఎదుట నీ ముందు సమావేశమవ్వాలి.+  ఒకవేళ ఒక్కదాన్నే ఊదితే, ఇశ్రాయేలులో వేలమందికి పెద్దలుగా ఉన్న ప్రధానులు మాత్రమే నీ దగ్గరికి రావాలి.+  “పెరుగుతూ-తగ్గుతూ ఉండే శబ్దంతో బాకాల్ని ఊదినప్పుడు, తూర్పు వైపున ఉన్న గుంపులు+ బయల్దేరాలి.  పెరుగుతూ-తగ్గుతూ ఉండే శబ్దంతో బాకాల్ని రెండోసారి ఊదినప్పుడు, దక్షిణం వైపున ఉన్న గుంపులు+ బయల్దేరాలి. ఒక్కో విభాగం బయల్దేరే ప్రతీసారి వాళ్లు ఇలా బాకాల్ని ఊదాలి.  “ఇశ్రాయేలు సమాజాన్ని సమావేశపరుస్తున్నప్పుడు మీరు బాకాలు ఊదాలి+ కానీ పెరుగుతూ-తగ్గుతూ ఉండే శబ్దంతో కాదు.  యాజకులైన అహరోను కుమారులు ఆ బాకాల్ని ఊదాలి;+ వాటిని ఊదడం అనేది తరతరాలు మీకు శాశ్వత శాసనం.  “ఒకవేళ మిమ్మల్ని వేధిస్తున్న మీ శత్రువుల మీద మీరు యుద్ధం చేయడానికి వెళ్లాల్సి వస్తే, ఆ బాకాలతో యుద్ధ ధ్వని చేయాలి;+ అప్పుడు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని గుర్తుచేసుకొని, మీ శత్రువుల నుండి మిమ్మల్ని కాపాడతాడు. 10  “అంతేకాదు మీరు సంతోషించే సందర్భాల్లో,+ అంటే మీ పండుగల్లో,+ అలాగే ప్రతీనెల ఆరంభంలో మీ దహనబలుల ముందు, మీ సమాధాన బలుల ముందు బాకాలు ఊదాలి; అప్పుడు మీ దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. నేను మీ దేవుడైన యెహోవాను.”+ 11  రెండో సంవత్సరం, రెండో నెల, 20వ రోజున+ మేఘం సాక్ష్యపు గుడారం మీద నుండి పైకి లేచింది.+ 12  కాబట్టి ఇశ్రాయేలీయులు తాము ఏ క్రమంలో బయల్దేరాలని నిర్ణయించబడిందో ఆ క్రమంలో సీనాయి ఎడారి నుండి బయల్దేరడం మొదలుపెట్టారు;+ చివరికి మేఘం పారాను ఎడారిలో+ ఆగింది. 13  యెహోవా మోషే ద్వారా ఇచ్చిన ఆదేశం మేరకు వాళ్లు బయల్దేరడం ఇదే మొదటిసారి.+ 14  మొదట యూదా వంశస్థుల మూడు-గోత్రాల విభాగం తమతమ గుంపుల* వారీగా బయల్దేరింది; అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను+ ఆ గుంపుకు నాయకుడిగా ఉన్నాడు. 15  ఇశ్శాఖారు వంశస్థుల గోత్రానికి సూయారు కుమారుడైన నెతనేలు+ నాయకుడిగా ఉన్నాడు. 16  జెబూలూను వంశస్థుల గోత్రానికి హేలోను కుమారుడైన ఏలీయాబు+ నాయకుడిగా ఉన్నాడు. 17  గుడారాన్ని ఊడదీసినప్పుడు,+ గుడారాన్ని మోసే గెర్షోనీయులు,+ మెరారీయులు+ బయల్దేరారు. 18  తర్వాత రూబేను మూడు-గోత్రాల విభాగం తమతమ గుంపుల* వారీగా బయల్దేరింది; షెదేయూరు కుమారుడైన ఏలీసూరు+ ఆ గుంపుకు నాయకుడిగా ఉన్నాడు. 19  షిమ్యోను వంశస్థుల గోత్రానికి సూరీషద్దాయి కుమారుడైన షెలుమీయేలు+ నాయకుడిగా ఉన్నాడు. 20  గాదు వంశస్థుల గోత్రానికి దెయూవేలు కుమారుడైన ఎలీయాసాపు+ నాయకుడిగా ఉన్నాడు. 21  తర్వాత పవిత్రమైన స్థలానికి సంబంధించిన వస్తువుల్ని మోసే కహాతీయులు+ బయల్దేరారు. వాళ్లు చేరుకునేసరికి గుడారాన్ని నిలబెట్టాలి. 22  ఆ తర్వాత ఎఫ్రాయిమీయుల మూడు-గోత్రాల విభాగం తమతమ గుంపుల* వారీగా బయల్దేరింది; అమీహూదు కుమారుడైన ఎలీషామా+ ఆ గుంపుకు నాయకుడిగా ఉన్నాడు. 23  మనష్షే వంశస్థుల గోత్రానికి పెదాసూరు కుమారుడైన గమలీయేలు+ నాయకుడిగా ఉన్నాడు. 24  బెన్యామీనీయుల గోత్రానికి గిద్యోనీ కుమారుడైన అబీదాను+ నాయకుడిగా ఉన్నాడు. 25  చివరిగా, దాను వంశస్థుల మూడు-గోత్రాల విభాగం తమతమ గుంపుల* వారీగా బయల్దేరింది; వాళ్లు మిగతా గుంపులన్నిటికీ రక్షణగా వాటి వెనక వెళ్లారు; అమీషదాయి కుమారుడైన అహీయెజెరు+ ఆ గుంపుకు నాయకుడిగా ఉన్నాడు. 26  ఆషేరు వంశస్థుల గోత్రానికి ఒక్రాను కుమారుడైన పగీయేలు+ నాయకుడిగా ఉన్నాడు. 27  నఫ్తాలీయుల గోత్రానికి ఏనాను కుమారుడైన అహీర+ నాయకుడిగా ఉన్నాడు. 28  ఇశ్రాయేలీయులు, వాళ్ల గుంపులు* బయల్దేరుతున్నప్పుడు వాళ్లు ఈ క్రమాన్ని పాటించేవాళ్లు.+ 29  తర్వాత మోషే మిద్యానీయుడైన తన మామ రగూయేలు*+ కుమారుడు హోబాబుతో ఇలా అన్నాడు: “ ‘నేను దాన్ని మీకు ఇస్తాను’+ అని యెహోవా చెప్పిన దేశానికి మేము ప్రయాణమౌతున్నాం, కాబట్టి నువ్వు మాతోపాటు రా,+ మేము నిన్ను బాగా చూసుకుంటాం. ఎందుకంటే యెహోవా ఇశ్రాయేలు కోసం మంచివాటిని వాగ్దానం చేశాడు.”+ 30  కానీ అతను మోషేతో, “నేను రాను. నేను నా దేశానికి, నా బంధువుల దగ్గరికి వెళ్తాను” అన్నాడు. 31  దానికి మోషే ఇలా అన్నాడు: “దయచేసి మమ్మల్ని విడిచివెళ్లకు; ఎందుకంటే ఈ ఎడారిలో మేము ఎక్కడ డేరాలు వేసుకొని బస చేయాలో నీకు బాగా తెలుసు, నువ్వు మాకు మార్గదర్శకుడిగా* ఉండొచ్చు. 32  నువ్వు గనుక మాతోపాటు వస్తే,+ యెహోవా మా పట్ల చూపించే మంచితనమంతా మేము కూడా తప్పకుండా నీ పట్ల చూపిస్తాం.” 33  కాబట్టి వాళ్లు యెహోవా పర్వతం+ దగ్గర నుండి మూడు రోజుల ప్రయాణమంత దూరం నడక మొదలుపెట్టారు; వాళ్ల కోసం విశ్రాంతి స్థలం వెతకడానికి యెహోవా ఒప్పంద* మందసం+ ఆ మూడు రోజుల ప్రయాణంలో వాళ్ల ముందు వెళ్లింది.+ 34  వాళ్లు డేరాలు తీసి బయల్దేరినప్పుడు పగటిపూట యెహోవా మేఘం+ వాళ్ల పైన ఉంది. 35  మందసాన్ని పైకెత్తి తీసుకెళ్లే ప్రతీసారి మోషే ఇలా అనేవాడు: “యెహోవా, లే;+ నీ శత్రువుల్ని చెదరగొట్టు, నిన్ను ద్వేషించేవాళ్లను నీ ముందు నుండి పారిపోయేలా చేయి.” 36  మందసాన్ని కిందికి దించినప్పుడల్లా అతను ఇలా అనేవాడు: “యెహోవా, వేవేల ఇశ్రాయేలీయుల+ దగ్గరికి తిరిగిరా.”

అధస్సూచీలు

లేదా “నకిషీ పనిగా.”
అక్ష., “సైన్యాల.”
అక్ష., “సైన్యాల.”
అక్ష., “సైన్యాల.”
అక్ష., “సైన్యాల.”
అక్ష., “సైన్యాలు.”
అంటే, యిత్రో.
లేదా “కళ్లుగా.”
లేదా “నిబంధన.”