సంఖ్యాకాండం 34:1-29
34 యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు:
2 “నువ్వు ఇశ్రాయేలీయులకు ఈ నిర్దేశాలు ఇవ్వు: ‘మీరు కనాను దేశంలోకి వెళ్లినప్పుడు,+ మీరు స్వాస్థ్యంగా పొందే దేశం, అంటే దాని సరిహద్దుల ప్రకారం మీరు సొంతం చేసుకునే కనాను దేశం ఇదే.+
3 “ ‘దక్షిణం వైపు మీ సరిహద్దు ఎదోము పక్కగా సీను ఎడారి దగ్గర నుండి మొదలౌతుంది; తూర్పు వైపున మీ దక్షిణ సరిహద్దు ఉప్పు సముద్రం* కొన నుండి మొదలౌతుంది.+
4 ఆ సరిహద్దు దిశ మారి అక్రబ్బీము పర్వత మార్గం+ దక్షిణం మీదుగా సీను ఎడారిలోకి వెళ్లి, కాదేషు-బర్నేయకు+ దక్షిణాన ముగుస్తుంది. అక్కడి నుండి అది హసరద్దారు+ మీదుగా అస్మోను వరకు వెళ్తుంది.
5 అస్మోను దగ్గర ఆ సరిహద్దు దిశ మారి ఐగుప్తు వాగు* వైపుగా వెళ్లి మహా సముద్రం* దగ్గర ఆగుతుంది.+
6 “ ‘పడమటి వైపు మీ సరిహద్దు మహా సముద్రం,* దాని తీరం. అది మీ పడమటి సరిహద్దుగా ఉంటుంది.+
7 “ ‘ఇది మీ ఉత్తర సరిహద్దు: మహా సముద్రం దగ్గర నుండి హోరు కొండ వరకు మీరు సరిహద్దు ఏర్పర్చుకోవాలి.
8 హోరు కొండ దగ్గర నుండి లెబో-హమాతు*+ వరకు సరిహద్దు ఏర్పర్చుకోవాలి, ఆ సరిహద్దు సెదాదు దగ్గర ఆగుతుంది.+
9 ఆ సరిహద్దు జిప్రోను వరకు వెళ్లి హసరేనాను దగ్గర ముగుస్తుంది.+ ఇది మీ ఉత్తర సరిహద్దుగా ఉంటుంది.
10 “ ‘తర్వాత హసరేనాను నుండి షెపాము వరకు మీ తూర్పు సరిహద్దును ఏర్పర్చుకోవాలి.
11 ఆ సరిహద్దు షెపాము దగ్గర నుండి అయీనుకు తూర్పున ఉన్న రిబ్లా వరకు సాగి, అక్కడి నుండి కిందికి వెళ్లి, కిన్నెరెతు సముద్రం*+ తూర్పున ఉన్న కొండల మీదుగా ముందుకు సాగుతుంది.
12 ఆ సరిహద్దు యొర్దాను వరకు వెళ్లి ఉప్పు సముద్రం దగ్గర ఆగుతుంది.+ మీ దేశం, దాని సరిహద్దులు ఇవి.’ ”
13 కాబట్టి మోషే ఇశ్రాయేలీయులకు ఈ నిర్దేశాలు ఇచ్చాడు: “యెహోవా తొమ్మిదిన్నర గోత్రాలకు ఇవ్వమని ఆజ్ఞాపించినట్టు, మీరు చీట్లు+ వేసి సొత్తుగా పంచుకోవాల్సిన దేశం ఇదే.
14 ఎందుకంటే, వాళ్లవాళ్ల పూర్వీకుల కుటుంబం ప్రకారం రూబేనీయులు, వాళ్లవాళ్ల పూర్వీకుల కుటుంబం ప్రకారం గాదీయులు, అలాగే మనష్షే అర్ధగోత్రం వాళ్లు ఇప్పటికే తమ స్వాస్థ్యాన్ని తీసుకున్నారు.+
15 ఆ రెండున్నర గోత్రాల వాళ్లు యెరికో దగ్గర యొర్దానుకు తూర్పు వైపున ఉన్న ప్రాంతంలో, సూర్యుడు ఉదయించే వైపున ఇప్పటికే తమ స్వాస్థ్యాన్ని తీసుకున్నారు.”+
16 యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు:
17 “మీరు సొత్తుగా పొందబోయే దేశాన్ని మీకు పంచి ఇచ్చే వాళ్ల పేర్లు ఇవి: యాజకుడైన ఎలియాజరు, నూను కుమారుడు యెహోషువ.+
18 అలాగే ఆ దేశాన్ని మీకు స్వాస్థ్యంగా పంచి ఇవ్వడానికి మీరు ఒక్కో గోత్రం నుండి ఒక్కో ప్రధానుడిని తీసుకోవాలి.+
19 వాళ్ల పేర్లు ఇవి: యూదా గోత్రం+ నుండి యెఫున్నె కుమారుడు కాలేబు;+
20 షిమ్యోను వంశస్థుల గోత్రం+ నుండి అమీహూదు కుమారుడు షెమూయేలు;
21 బెన్యామీను గోత్రం+ నుండి కిస్లోను కుమారుడు ఎలీదాదు;
22 దాను వంశస్థుల గోత్రం+ నుండి ప్రధానుడూ, యొగ్లి కుమారుడూ అయిన బుక్కీ;
23 యోసేపు కుమారుడైన+ మనష్షే వంశస్థుల గోత్రం+ నుండి ప్రధానుడూ, ఏఫోదు కుమారుడూ అయిన హన్నీయేలు;
24 యోసేపు కుమారుడైన ఎఫ్రాయిము వంశస్థుల గోత్రం+ నుండి ప్రధానుడూ, షిప్తాను కుమారుడూ అయిన కెమూయేలు;
25 జెబూలూను వంశస్థుల గోత్రం+ నుండి ప్రధానుడూ, పర్నాకు కుమారుడూ అయిన ఎలీషాపాను;
26 ఇశ్శాఖారు వంశస్థుల గోత్రం+ నుండి ప్రధానుడూ, అజాను కుమారుడూ అయిన పల్తీయేలు;
27 ఆషేరు వంశస్థుల గోత్రం+ నుండి ప్రధానుడూ, షెలోమి కుమారుడూ అయిన అహీహూదు;
28 నఫ్తాలి వంశస్థుల గోత్రం+ నుండి ప్రధానుడూ, అమీహూదు కుమారుడూ అయిన పెదహేలు.”
29 కనాను దేశంలో ఇశ్రాయేలీయులకు భూమిని పంచి ఇవ్వమని యెహోవా ఆజ్ఞాపించింది వీళ్లకే.+
అధస్సూచీలు
^ అంటే, మృత సముద్రం.
^ అంటే, మధ్యధరా సముద్రం.
^ అంటే, మధ్యధరా సముద్రం.
^ లేదా “హమాతు ప్రవేశ ద్వారం.”
^ అంటే, గెన్నేసరెతు సరస్సు, లేదా గలిలయ సముద్రం.