సామెతలు 15:1-33
15 సౌమ్యంగా ఇచ్చే* జవాబు కోపాన్ని చల్లారుస్తుంది,+నొప్పించే* మాట కోపాన్ని రేపుతుంది.+
2 తెలివిగలవాళ్ల నాలుక జ్ఞానంతో మంచి చేస్తుంది,+మూర్ఖుల నోరు తెలివితక్కువతనాన్ని వెళ్లగక్కుతుంది.
3 యెహోవా కళ్లు ప్రతీ చోట ఉన్నాయి,చెడ్డవాళ్లను, మంచివాళ్లను అవి చూస్తున్నాయి.+
4 ప్రశాంతమైన* నాలుక జీవవృక్షం,+వంకర మాటలు కృంగదీస్తాయి.
5 తెలివితక్కువవాడు తన తండ్రి ఇచ్చే క్రమశిక్షణను హీనంగా చూస్తాడు,+వివేకం* గలవాడు దిద్దుబాటును* స్వీకరిస్తాడు.+
6 నీతిమంతుడి ఇంట్లో గొప్ప సంపద ఉంటుంది,అయితే దుష్టుని ఆదాయం అతనికి సమస్యలు తీసుకొస్తుంది.+
7 తెలివిగలవాళ్ల పెదాలు జ్ఞానాన్ని వ్యాప్తిచేస్తాయి,+కానీ మూర్ఖుల హృదయం అలా కాదు.+
8 దుష్టులు అర్పించే బలి యెహోవాకు అసహ్యం,+నిజాయితీపరుల ప్రార్థనలు ఆయనకు సంతోషాన్నిస్తాయి.+
9 దుష్టుల మార్గం యెహోవాకు అసహ్యం,నీతిని అనుసరించే వాళ్లంటే ఆయనకు చాలా ఇష్టం.+
10 మంచి మార్గాన్ని వదిలేసేవాడికి క్రమశిక్షణ చెడ్డదిగా* కనిపిస్తుంది,+గద్దింపును అసహ్యించుకునేవాడు చనిపోతాడు.+
11 సమాధి,* నాశనస్థలం* యెహోవాకు పూర్తిగా కనిపిస్తున్నాయి.+
అలాంటిది మనుషుల హృదయాలు ఇంకెంత బాగా కనిపిస్తాయో కదా!+
12 ఎగతాళి చేసేవాళ్లు తమను సరిదిద్దే* వాళ్లను ఇష్టపడరు.
వాళ్లు తెలివిగలవాళ్లను సంప్రదించరు.+
13 హృదయం సంతోషంగా ఉంటే ముఖం మీద చిరునవ్వు ఉంటుంది,హృదయంలో ఉన్న బాధ మనిషిని కృంగదీస్తుంది.+
14 అవగాహనగల హృదయం జ్ఞానాన్ని వెదుకుతుంది,+మూర్ఖుల నోటికి తెలివితక్కువతనమే ఆహారం.*+
15 కష్టాల్లో ఉన్నవాడికి ప్రతీరోజు చెడ్డదే,+అయితే సంతోష* హృదయం గలవాడికి ప్రతీరోజు విందే.+
16 ఆందోళనపడుతూ* గొప్ప సంపద కలిగివుండడం కన్నాయెహోవాకు భయపడుతూ కొంచెం కలిగివుండడం మేలు.+
17 ద్వేషం ఉన్న చోట కొవ్విన* ఎద్దు మాంసం తినడం కన్నా+ప్రేమ ఉన్న చోట కూరగాయల భోజనం తినడం మంచిది.
18 ముక్కోపి గొడవలు రేపుతాడు,+కోప్పడే విషయంలో నిదానించేవాడు గొడవ సద్దుమణిగేలా చేస్తాడు.+
19 సోమరి దారి ముళ్లకంచె,+నిజాయితీపరుల మార్గం చదునైన రహదారి.+
20 తెలివిగలవాడు తన తండ్రిని సంతోషపెడతాడు,మూర్ఖుడు తన తల్లిని హీనంగా చూస్తాడు.+
21 వివేచన లేనివాడికి తెలివితక్కువతనమే సంతోషం,+వివేచన ఉన్నవాడు సరైన మార్గంలో వెళ్తూ ఉంటాడు.+
22 ఒకరితో ఒకరు సంప్రదించుకోకపోతే* ప్రణాళికలు విఫలమౌతాయి,సలహాదారులు ఎక్కువమంది ఉంటే పనులు జరుగుతాయి.
23 సరైన జవాబు చెప్పేవాడు సంతోషంగా ఉంటాడు,+సరైన సమయంలో మాట్లాడిన మాట ఎంత మంచిది!+
24 లోతైన అవగాహన గలవాణ్ణి జీవమార్గం పైకి తీసుకెళ్తుంది,కిందున్న సమాధి* నుండి అది అతన్ని కాపాడుతుంది.+
25 గర్విష్ఠుల ఇంటిని యెహోవా కూలగొడతాడు,+అయితే విధవరాలి సరిహద్దును ఆయన కాపాడతాడు.+
26 దుష్టుల పన్నాగాలు యెహోవాకు అసహ్యం,+మనోహరమైన మాటలు ఆయనకు ఇష్టం.*
27 అక్రమ లాభం సంపాదించేవాడు తన ఇంట్లోవాళ్లకు సమస్యలు* తెచ్చిపెడతాడు,+లంచాన్ని అసహ్యించుకునేవాడు జీవిస్తూ ఉంటాడు.+
28 నీతిమంతుడి హృదయం జవాబిచ్చే ముందు ధ్యానిస్తుంది,*+దుష్టుల నోరు చెడ్డవాటిని కుమ్మరిస్తుంది.
29 దుష్టులకు యెహోవా దూరంగా ఉంటాడు,నీతిమంతుల ప్రార్థన ఆయన వింటాడు.+
30 మెరిసే కళ్లు హృదయానికి సంతోషాన్నిస్తాయి;మంచి కబురు ఎముకలకు బలాన్నిస్తుంది.+
31 జీవాన్నిచ్చే గద్దింపును పట్టించుకునేవాడుతెలివిగలవాళ్ల మధ్య నివసిస్తాడు.+
32 క్రమశిక్షణను తిరస్కరించేవాడు తన ప్రాణాన్ని నీచంగా చూస్తున్నాడు,+గద్దింపును వినేవాడు అవగాహనను* సంపాదించుకుంటున్నాడు.+
33 యెహోవా మీదుండే భయం తెలివిని నేర్పిస్తుంది,ఘనతకు ముందు వినయం ఉంటుంది.+
అధస్సూచీలు
^ లేదా “కఠినమైన.”
^ లేదా “మృదువైన.”
^ లేదా “బాగుచేసే.”
^ లేదా “యుక్తి.”
^ లేదా “గద్దింపును.”
^ లేదా “కఠినంగా.”
^ లేదా “అబద్దోను.”
^ లేదా “గద్దించే.”
^ లేదా “నోరు తెలివితక్కువతనాన్ని వెంబడిస్తుంది.”
^ లేదా “మంచి.”
^ లేదా “అయోమయంతో.”
^ అక్ష., “మేతతొట్టిలో మేసిన.”
^ లేదా “నిర్మొహమాటంగా మాట్లాడుకోకపోతే.”
^ లేదా “స్వచ్ఛమైనవి.”
^ లేదా “అవమానం.”
^ లేదా “ఎలా జవాబివ్వాలో జాగ్రత్తగా పరిశీలిస్తుంది; మాట్లాడే ముందు ఆలోచిస్తుంది.”
^ అక్ష., “హృదయాన్ని.”