సామెతలు 16:1-33
16 మనిషి తన హృదయంలోని ఆలోచనల్ని సిద్ధం చేసుకుంటాడు,అయితే అతనిచ్చే* జవాబు యెహోవా నుండి వస్తుంది.+
2 మనిషికి తన మార్గాలన్నీ సరైనవిగా* కనిపిస్తాయి,+అయితే యెహోవా ఉద్దేశాల్ని* పరిశీలిస్తాడు.+
3 నీ పనులన్నీ యెహోవాకు అప్పగించు,+అప్పుడు నీ ఆలోచనలు సఫలమౌతాయి.
4 యెహోవా ప్రతీది తన సంకల్పం కోసం తయారుచేశాడు,చివరికి దుష్టుణ్ణి కూడా విపత్తు రోజు కోసం చేశాడు.+
5 గర్వహృదయులు యెహోవాకు అసహ్యం.+
వాళ్లు తప్పకుండా శిక్షించబడతారనే నమ్మకంతో ఉండు.
6 విశ్వసనీయ ప్రేమ వల్ల, నమ్మకత్వం వల్ల దోషం క్షమించబడుతుంది,*+యెహోవాకు భయపడడం వల్ల ఒక వ్యక్తి చెడు నుండి దూరంగా వెళ్తాడు.+
7 ఒక వ్యక్తి మార్గాలు యెహోవాకు సంతోషం కలిగిస్తే,అతని శత్రువులు కూడా అతనితో శాంతిగా ఉండేలా చేస్తాడు.+
8 అన్యాయంగా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించడం కన్నా+నీతిగా ఉంటూ కొంచెం సంపాదించడం మంచిది.+
9 మనిషి తాను వెళ్లాల్సిన దారి గురించి హృదయంలో ఆలోచించుకుంటాడు,అయితే యెహోవా అతని అడుగుల్ని నిర్దేశిస్తాడు.+
10 రాజు పెదాల మీద దేవుని* నిర్ణయం ఉండాలి,+అతను ఎన్నడూ న్యాయం తప్పకూడదు.+
11 న్యాయమైన తక్కెడ, న్యాయమైన త్రాసు యెహోవావే;సంచిలోని తూకం రాళ్లన్నీ ఆయన చేసినవే.+
12 చెడ్డపనులు చేయడం రాజులకు అసహ్యం,+నీతి వల్ల సింహాసనం స్థిరపడుతుంది.+
13 నీతిగల మాటలు రాజులకు సంతోషం కలిగిస్తాయి.
నిజాయితీగా మాట్లాడేవాళ్లంటే వాళ్లకు చాలా ఇష్టం.+
14 రాజు కోపం మరణదూత లాంటిది,+తెలివిగలవాడు ఆ కోపాన్ని చల్లారుస్తాడు.*+
15 రాజు ముఖకాంతిలో జీవం ఉంటుంది;అతని అనుగ్రహం వసంత కాలంలోని వానమబ్బు లాంటిది.+
16 బంగారం సంపాదించడం కన్నా తెలివిని సంపాదించడం ఎంత మంచిది!+
వెండిని సంపాదించడం కన్నా అవగాహనను ఎంచుకోవడం మేలు.+
17 నిజాయితీపరుల రహదారి చెడుకు దూరంగా ఉంటుంది.
తన మార్గాన్ని జాగ్రత్తగా కాపాడుకునేవాడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు.+
18 నాశనానికి ముందు గర్వం ఉంటుంది,పడిపోవడానికి ముందు అహంకార స్వభావం ఉంటుంది.+
19 అహంకారుల దోపుడుసొమ్ము పంచుకోవడం కన్నాసాత్వికుల మధ్య వినయంగా ఉండడం మంచిది.+
20 ఒక విషయం మీద లోతైన అవగాహన ఉన్నవాడు విజయం సాధిస్తాడు,*యెహోవాను నమ్ముకున్న వ్యక్తి సంతోషంగా ఉంటాడు.
21 తెలివిగల హృదయం ఉన్నవాళ్లు అవగాహన గలవాళ్లని పిలవబడతారు,+దయగా* మాట్లాడేవాళ్ల దగ్గర ఒప్పించే సామర్థ్యం ఉంటుంది.+
22 లోతైన అవగాహన ఉన్నవాళ్లకు ఆ అవగాహనే జీవపు ఊట,అయితే తెలివితక్కువవాళ్లు తమ తెలివితక్కువతనంతోనే క్రమశిక్షణ పొందుతారు.
23 తెలివిగలవాళ్ల హృదయం వాళ్ల నోటికి లోతైన అవగాహనను,+వాళ్ల మాటలకు ఒప్పించే సామర్థ్యాన్ని ఇస్తుంది.
24 మనోహరమైన మాటలు తేనెపట్టు లాంటివి,అవి ప్రాణానికి* తియ్యగా ఉంటాయి, ఎముకలకు ఆరోగ్యాన్నిస్తాయి.+
25 ఒక మార్గం మనిషికి సరైనదిగా కనిపిస్తుంది,కానీ చివరికి అది మరణానికి దారితీస్తుంది.+
26 శ్రమించేవాడి ఆకలి అతను కష్టపడి పనిచేసేలా చేస్తుంది,అతని నోరు అతన్ని తొందరపెడుతూ ఉంటుంది.+
27 పనికిమాలినవాడు చెడును తవ్వి పైకితీస్తాడు;+అతని మాటలు మండే అగ్ని లాంటివి.+
28 సమస్యలు సృష్టించేవాడు* విభేదాలు పుట్టిస్తాడు,+లేనిపోనివి కల్పించి చెప్పేవాడు ప్రాణ స్నేహితుల్ని విడదీస్తాడు.+
29 దౌర్జన్యం చేసేవాడు తన పొరుగువాణ్ణి ప్రలోభపెట్టిఅతన్ని తప్పుదారిలో నడిపిస్తాడు.
30 అతను కన్ను గీటుతూ హానిచేయడానికి కుట్ర పన్నుతాడు.
తన పెదాలు బిగబట్టి కీడు చేస్తాడు.
31 నీతి మార్గంలో నడిచేవాళ్లకు వచ్చే తలనెరపు+వాళ్లకు అందమైన* కిరీటం.+
32 కోప్పడే విషయంలో నిదానించేవాడు+ బలశాలి కన్నా బలవంతుడు,తన కోపాన్ని* అదుపు చేసుకునేవాడు నగరాన్ని జయించేవాడి కన్నా శక్తిమంతుడు.+
33 చీటి* ఒడిలో వేయబడుతుంది,+అయితే దానితో తీసుకునే ప్రతీ నిర్ణయం యెహోవా నుండే వస్తుంది.+
అధస్సూచీలు
^ లేదా “సరైన.” అక్ష., “నాలుక ఇచ్చే.”
^ అక్ష., “స్వచ్ఛమైనవిగా.”
^ పదకోశంలో “రూ-ఆహ్; న్యూమా” చూడండి.
^ లేదా “పరిహరించబడుతుంది.”
^ లేదా “ప్రేరేపిత.”
^ లేదా “ఆ కోపానికి దూరంగా ఉంటాడు.”
^ అక్ష., “మేలు పొందుతాడు.”
^ లేదా “ఆకట్టుకునేలా.”
^ లేదా “పన్నాగాలు పన్నేవాడు.”
^ లేదా “మహిమగల.”
^ లేదా “మనసును.”