సామెతలు 17:1-28
17 విందులతో* నిండిన ఇంట్లో గొడవల మధ్య భోజనం చేయడం కన్నా+ప్రశాంతంగా* ఉన్న చోట ఎండిన రొట్టె ముక్క తినడం మంచిది.+
2 లోతైన అవగాహనగల సేవకుడు అవమానకరంగా ప్రవర్తించే కుమారుడి మీద పరిపాలిస్తాడు,సహోదరుల్లో ఒకడిలా అతను వారసత్వ ఆస్తిని పంచుకుంటాడు.
3 మూసతో వెండిని, కొలిమిలో బంగారాన్ని పరీక్షిస్తారు,+అయితే హృదయాల్ని పరిశీలించేది యెహోవాయే.+
4 దుష్టుడు నొప్పించే మాటల మీద మనసు పెడతాడు,మోసగాడు హానికరమైన* మాటలు వింటాడు.+
5 పేదవాళ్లను అవమానించేవాడు వాళ్ల సృష్టికర్తను అవమానిస్తున్నాడు,+ఎదుటివాడి కష్టాన్ని చూసి సంతోషించేవాడు తప్పకుండా శిక్షించబడతాడు.+
6 మనవళ్లూ మనవరాళ్లే వృద్ధులకు కిరీటం,తల్లిదండ్రులే* పిల్లలకు* ఘనత.
7 తెలివితక్కువవాడు నిజాయితీగా* మాట్లాడితే వింతగా ఉంటుంది.+
అలాంటిది పరిపాలకుడు* అబద్ధాలు మాట్లాడితే ఇంకెంత విడ్డూరంగా ఉంటుంది!+
8 బహుమతి దాని యజమానికి అమూల్యమైన* రాయి లాంటిది;+అతను ఎక్కడికి వెళ్లినా అది అతనికి విజయం చేకూరుస్తుంది.+
9 దోషాన్ని క్షమించేవాడు* ప్రేమను వెతుకుతున్నాడు,+జరిగినదాన్ని మళ్లీమళ్లీ ఎత్తేవాడు ప్రాణ స్నేహితుల్ని విడదీస్తాడు.+
10 మూర్ఖుణ్ణి వంద దెబ్బలు కొట్టినా ప్రయోజనం ఉండదు,+అవగాహన ఉన్నవాణ్ణి ఒక్కసారి గద్దించినా ఎంతో ప్రయోజనం ఉంటుంది.+
11 చెడ్డవాడు తిరుగుబాటునే కోరుకుంటాడు,అతన్ని శిక్షించడానికి క్రూరదూత పంపించబడతాడు.+
12 తన తెలివితక్కువతనాన్ని నమ్ముకునే మూర్ఖుణ్ణి ఎదుర్కోవడం కన్నాపిల్లల్ని పోగొట్టుకున్న ఎలుగుబంటిని ఎదుర్కోవడం మంచిది.+
13 మేలుకు ప్రతిగా కీడు చేసేవాడి ఇంటినుండి కీడు తొలగిపోదు.+
14 గొడవ మొదలైతే ప్రవాహ* ద్వారాన్ని తెరిచినట్టే;*గొడవ మొదలవ్వకముందే అక్కడి నుండి వెళ్లిపో.+
15 దుష్టుణ్ణి నిర్దోషి అని తీర్పుతీర్చేవాడు, నీతిమంతుణ్ణి దోషి అని తీర్పుతీర్చేవాడు+ఇద్దరూ యెహోవాకు అసహ్యం.
16 మూర్ఖుడి దగ్గర తెలివిని సంపాదించడానికి కావల్సిన డబ్బు ఉండి ఏంలాభం,అతనికి వివేకం* లేదు కదా!+
17 నిజమైన స్నేహితుడు ఎల్లప్పుడూ ప్రేమిస్తాడు,+కష్టకాలంలో అతను సహోదరుడిలా ఉంటాడు.+
18 వివేకం లేనివాడు ఇతరుల అప్పుకు హామీగా* ఉంటాననితన పొరుగువాళ్ల ముందు చేతులు కలిపి ఒప్పందం చేసుకుంటాడు.+
19 గొడవను ప్రేమించేవాడు అపరాధాన్ని ప్రేమిస్తున్నాడు.+
తన గుమ్మాన్ని ఎత్తుగా చేసేవాడు నాశనాన్ని ఆహ్వానిస్తున్నాడు.+
20 కపట హృదయం గలవాడు విజయం సాధించడు,*+మోసపూరితంగా మాట్లాడేవాడు కష్టాల్లో పడతాడు.
21 మూర్ఖుణ్ణి కన్నవాడికి దుఃఖం కలుగుతుంది;వివేకం లేనివాడి తండ్రికి సంతోషం ఉండదు.+
22 సంతోష హృదయం మంచి ఔషధం,+నలిగిన మనస్సు ఒంట్లో శక్తినంతా లాగేస్తుంది.*+
23 న్యాయాన్ని తప్పుదారి పట్టించడానికిదుష్టుడు రహస్యంగా* లంచం తీసుకుంటాడు.+
24 వివేచన గలవాడి కళ్లముందే తెలివి ఉంటుంది,అయితే మూర్ఖుల కళ్లు భూమి అంచుల వరకు సంచరిస్తాయి.+
25 మూర్ఖుడు తన తండ్రిని దుఃఖపెడతాడు,తనను కన్న తల్లికి వేదన కలిగిస్తాడు.+
26 నీతిమంతులకు శిక్ష* విధించడం మంచిదికాదు,గౌరవనీయుల్ని కొట్టడం సరికాదు.
27 జ్ఞానం గలవాడు తన మాటల్ని అదుపులో ఉంచుకుంటాడు,+వివేచన గలవాడు ప్రశాంతంగా ఉంటాడు.+
28 మౌనంగా ఉంటే తెలివితక్కువవాడు కూడా తెలివిగలవాడిగా ఎంచబడతాడు,తన పెదాలు మూసుకునేవాడు వివేచన గలవాడిగా ఎంచబడతాడు.
అధస్సూచీలు
^ లేదా “నెమ్మదిగా.”
^ అక్ష., “బలులతో.”
^ లేదా “పేరు పాడుచేసే.”
^ అక్ష., “తండ్రులే.”
^ అక్ష., “కుమారులకు.”
^ లేదా “చక్కగా.”
^ లేదా “ప్రముఖుడు.”
^ లేదా “అనుగ్రహం తెచ్చిపెట్టే.”
^ అక్ష., “కప్పేవాడు.”
^ లేదా “ఆనకట్ట.”
^ అక్ష., “నీళ్లను బయటికి వదిలినట్టే.”
^ అక్ష., “హృదయం.”
^ లేదా “జామీను.”
^ అక్ష., “మేలు పొందడు.”
^ లేదా “ఎముకల్ని ఎండిపోజేస్తుంది.”
^ అక్ష., “ఒడిలో నుండి.”
^ లేదా “జరిమానా.”