సామెతలు 21:1-31
21 రాజు హృదయం యెహోవా చేతిలో నీటి కాలువ లాంటిది.+
ఆయన తనకు నచ్చినవైపు దాన్ని తిప్పుతాడు.+
2 మనిషికి తన మార్గాలన్నీ సరైనవిగా కనిపిస్తాయి,+అయితే యెహోవా హృదయాల్ని* పరిశీలిస్తాడు.+
3 బలి అర్పించడం కన్నాసరైనది, న్యాయమైనది చేయడమే యెహోవాకు ఇష్టం.+
4 గర్వంతో నిండిన కళ్లు, అహంకార హృదయందుష్టులకు దారి చూపే దీపం లాంటివి; కానీ అవి పాపం.+
5 శ్రద్ధ గలవాళ్ల ప్రణాళికలు ఖచ్చితంగా విజయానికి నడిపిస్తాయి,*+తొందరపాటుగా పనిచేసే వాళ్లంతా ఖచ్చితంగా పేదవాళ్లౌతారు.
6 అబద్ధాలాడి సంపదలు కూడబెట్టుకోవడంప్రాణాంతకమైన ఉరి లాంటిది,* మాయమైపోయే మంచు లాంటిది.+
7 దుష్టుల దౌర్జన్యమే వాళ్లను నాశనం చేస్తుంది,+న్యాయంగా ప్రవర్తించడం వాళ్లకు ఇష్టముండదు.
8 అపరాధి దారి వంకరగా ఉంటుంది,నిర్దోషి పనులు నిజాయితీగా ఉంటాయి.+
9 గయ్యాళి* భార్యతో కలిసి ఒకే ఇంట్లో ఉండడం కన్నాఇంటి పైకప్పు మీద ఒక మూలన నివసించడం మంచిది.+
10 దుష్టుడు చెడు చేయాలని తపిస్తాడు;+అతను తన పొరుగువాడి మీద ఏమాత్రం దయ చూపించడు.+
11 ఎగతాళి చేసేవాణ్ణి శిక్షించినప్పుడు, అనుభవం లేనివాడు తెలివి సంపాదిస్తాడు,తెలివిగలవాడు లోతైన అవగాహనను పొందినప్పుడు, ఏంచేయాలో అతనికి తెలుస్తుంది.*+
12 నీతిమంతుడైన దేవుడు దుష్టుడి ఇంటిని గమనిస్తాడు;ఆయన దుష్టుల్ని నాశనం చేస్తాడు.+
13 ఎవరైనా దీనుల మొర వినకుండా చెవులు మూసుకుంటే,అతను మొరపెట్టినప్పుడు కూడా జవాబు రాదు.+
14 రహస్యంగా ఇచ్చిన బహుమతి కోపాన్ని చల్లారుస్తుంది,చాటుగా ఇచ్చిన* లంచం తీవ్రమైన కోపాన్ని శాంతపరుస్తుంది.
15 నీతిమంతుడు న్యాయం చేయడంలో సంతోషిస్తాడు,+అయితే అలవాటుగా కీడు చేసేవాళ్లకు అది భయంకరమైన విషయం.
16 లోతైన అవగాహనా మార్గం నుండి పక్కకు తొలిగేవాడుచనిపోయినవాళ్ల గుంపుతో పాటు విశ్రమిస్తాడు.+
17 సుఖాల్ని ప్రేమించేవాళ్లు పేదవాళ్లౌతారు;+ద్రాక్షారసాన్ని, నూనెను ప్రేమించేవాళ్లు ధనవంతులు అవ్వరు.
18 దుష్టుడు నీతిమంతుడికి విమోచన క్రయధనం* అవుతాడు,నిజాయితీపరుడికి బదులుగా మోసగాడు తీసుకోబడతాడు.+
19 విసిగించే గయ్యాళి* భార్యతో కలిసి బ్రతకడం కన్నాఎడారిలో* నివసించడం మంచిది.+
20 తెలివిగలవాళ్ల ఇంట్లో అమూల్యమైన సంపదలు, నూనె ఉంటాయి;అయితే మూర్ఖుడు తన దగ్గర ఉన్నదంతా దుబారా చేస్తాడు.*+
21 నీతిని, విశ్వసనీయ ప్రేమను వెంబడించేవాళ్లుజీవాన్ని, నీతిని, ఘనతను పొందుతారు.+
22 తెలివిగలవాడు బలవంతుల నగరాన్ని ఎక్కి*వాళ్లు నమ్ముకున్న బలమైన దుర్గాన్ని పడగొట్టగలడు.+
23 తన నోటిని, నాలుకను అదుపులో పెట్టుకునేవాడుకష్టాల నుండి తనను తాను కాపాడుకుంటాడు.+
24 కోపంతో అహంకారంగా ప్రవర్తించేవాడినిగర్విష్ఠి, అహంకారి, గొప్పలు చెప్పుకునేవాడు అంటారు.+
25 సోమరి కోరిక అతన్ని చంపుతుంది,ఎందుకంటే అతని చేతులు పనిచేయడానికి ఇష్టపడవు.+
26 అతను రోజంతా అత్యాశతో అవీఇవీ కోరుకుంటూ ఉంటాడు,అయితే నీతిమంతుడు ఏదీ దాచుకోకుండా అన్నీ ఇచ్చేస్తాడు.+
27 దుష్టుడు అర్పించే బలి అసహ్యమైనది.+
ఇక అతను దుర్బుద్ధితో* అర్పిస్తే అది ఇంకెంత అసహ్యంగా ఉంటుందో కదా!
28 అబద్ధ సాక్షి నాశనమౌతాడు,+జాగ్రత్తగా వినే వ్యక్తి సాక్ష్యం నిలుస్తుంది.*
29 దుష్టుడు సిగ్గుమాలిన ముఖం పెట్టుకుంటాడు,+నిజాయితీపరుడు తన మార్గాన్ని సుస్థిరం చేసుకుంటాడు.+
30 యెహోవాకు వ్యతిరేకంగా నిలిచే తెలివి గానీ, వివేచన గానీ, సలహా గానీ లేదు.+
31 యుద్ధం జరిగే రోజు కోసం గుర్రాల్ని సిద్ధం చేస్తారు,+అయితే రక్షణ యెహోవా నుండే వస్తుంది.+
అధస్సూచీలు
^ లేదా “ఉద్దేశాల్ని.”
^ లేదా “ప్రయోజనకరం.”
^ లేదా “మరణాన్ని వెతికేవాళ్లకు” అయ్యుంటుంది.
^ లేదా “సతాయించే.”
^ లేదా “జ్ఞానం సంపాదిస్తాడు.”
^ అక్ష., “ఒడిలోని.”
^ లేదా “సతాయించే.”
^ అక్ష., “మింగేస్తాడు.”
^ లేదా “గెలిచి.”
^ లేదా “అవమానకరమైన ప్రవర్తనతో.”
^ లేదా “గెలుస్తుంది.”