సామెతలు 24:1-34

  • చెడ్డవాళ్లను చూసి ఈర్ష్యపడకు (1)

  • తెలివి వల్ల ఇల్లు కట్టబడుతుంది (3)

  • నీతిమంతుడు పడినా లేస్తాడు (16)

  • ప్రతీకారం తీర్చుకోకు (29)

  • కునికిపాట్ల వల్ల పేదరికం వస్తుంది (33, 34)

24  చెడ్డవాళ్లను చూసి ఈర్ష్యపడకు,వాళ్లతో సహవాసం చేయాలని కోరుకోకు.+   వాళ్ల హృదయం దౌర్జన్యం చేయడం గురించే ఆలోచిస్తుంది,వాళ్ల పెదాలు సమస్యలు సృష్టించడం గురించి మాట్లాడతాయి.   తెలివి వల్ల ఇల్లు* కట్టబడుతుంది,+వివేచన వల్ల అది సుస్థిరం* చేయబడుతుంది.   జ్ఞానం వల్ల దాని గదులుఅన్నిరకాల విలువైన, ఆహ్లాదకరమైన సంపదలతో నింపబడతాయి.+   తెలివిగలవాడు శక్తిమంతుడు,+జ్ఞానంతో ఒక వ్యక్తి తన శక్తిని పెంచుకుంటాడు.   తెలివిగల* నిర్దేశంతో యుద్ధం చేయి,+సలహాదారులు ఎక్కువమంది ఉంటే విజయం* లభిస్తుంది.+   మూర్ఖుడికి నిజమైన తెలివి దొరకదు;+నగర ద్వారం దగ్గర అతను ఏమీ మాట్లాడలేడు.   దుష్ట పన్నాగాలు పన్నేవాణ్ణికుట్రలు పన్నడంలో ఆరితేరినవాడు అని పిలుస్తారు.+   తెలివితక్కువ* పథకాలు పాపానికి నడిపిస్తాయి,ఎగతాళి చేసేవాణ్ణి ప్రజలు అసహ్యించుకుంటారు.+ 10  కష్టం వచ్చిన రోజున నిరుత్సాహపడితేనీ శక్తి తగ్గిపోతుంది. 11  చంపడానికి తీసుకెళ్తున్న వాళ్లను రక్షించు,వధకు వెళ్తున్న వాళ్లను కాపాడు.+ 12  ఒకవేళ నువ్వు “ఆ విషయం మాకు తెలీదే” అని అంటే, హృదయాల్ని* పరిశీలించే దేవుడు దాన్ని గ్రహించలేడా?+ అవును నిన్ను గమనించే ఆయనకు తెలుస్తుంది,ఆయన ప్రతీ మనిషికి అతని పనుల ప్రకారం ప్రతిఫలం ఇస్తాడు.+ 13  నా కుమారుడా, తేనెను తిను, అది మంచిది;తేనెపట్టు నుండి కారే తేనె తియ్యగా ఉంటుంది. 14  అలాగే తెలివి నీకు మంచిదని* తెలుసుకో.+ నువ్వు దాన్ని సంపాదిస్తే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది,నీ ఆశ భంగం కాదు.+ 15  దుష్టుడిలా నీతిమంతుని ఇంటి దగ్గర కాపుకాయకు;అతని విశ్రాంతి స్థలాన్ని పాడుచేయకు. 16  ఎందుకంటే నీతిమంతుడు ఏడుసార్లు పడిపోవచ్చు, కానీ అతను మళ్లీ లేస్తాడు,+అయితే విపత్తు వచ్చినప్పుడు దుష్టుడు పూర్తిగా పడిపోతాడు.+ 17  నీ శత్రువు పడిపోయినప్పుడు ఆనందపడకు,అతను తడబడినప్పుడు నీ హృదయాన్ని సంతోషపడనివ్వకు;+ 18  లేదంటే యెహోవా దాన్ని చూస్తాడు, అది ఆయనకు నచ్చదు,అప్పుడాయన అతని* మీద నుండి తన కోపం పక్కకు తిప్పుకుంటాడు.+ 19  చెడ్డవాళ్లను చూసి నిరాశపడకు;*దుష్టుల్ని చూసి ఈర్ష్యపడకు. 20  చెడ్డవాళ్లెవ్వరికీ మంచి భవిష్యత్తు ఉండదు;+దుష్టుల దీపం ఆరిపోతుంది.+ 21  నా కుమారుడా, యెహోవాకూ రాజుకూ భయపడు.+ తిరుగుబాటు చేసేవాళ్లతో సహవసించకు;+ 22  ఎందుకంటే అకస్మాత్తుగా వాళ్లమీదికి విపత్తు వస్తుంది.+ ఆ ఇద్దరు* వాళ్లమీదికి ఏ నాశనం తీసుకొస్తారో ఎవరికి తెలుసు?+ 23  ఇవి కూడా జ్ఞానుల వాక్కులే: తీర్పుతీర్చేటప్పుడు పక్షపాతం చూపించడం మంచిదికాదు.+ 24  దుష్టుడితో “నువ్వు నీతిమంతుడివి” అనేవాణ్ణి+ ప్రజలు శపిస్తారు, దేశదేశాల వాళ్లు అతన్ని చెడ్డవాడు అంటారు. 25  అయితే అతన్ని* గద్దించేవాళ్లకు మంచి జరుగుతుంది;+వాళ్ల మీదికి మంచిమంచి దీవెనలు వస్తాయి.+ 26  నిజాయితీగా జవాబిచ్చే వ్యక్తిని ప్రజలు ముద్దుపెట్టుకుంటారు.*+ 27  ముందుగా బయట పనులు చక్కబెట్టుకో, పొలంలో పనులు సిద్ధం చేసుకో,ఆ తర్వాత ఇల్లు కట్టుకో.* 28  ఆధారాలు లేకుండా నీ పొరుగువాడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పకు.+ నీ పెదాలతో ఇతరుల్ని మోసం చేయకు.+ 29  “అతను నాకు చేసినట్టే అతనికి చేస్తాను;అతను చేసినదానికి ప్రతీకారం తీర్చుకుంటాను” అని అనకు.+ 30  సోమరి పొలం మీదుగా,+వివేచన లేనివాడి ద్రాక్షతోట మీదుగా నేను వెళ్లాను. 31  అందులో కలుపు మొక్కలు ఏపుగా పెరిగాయి;దురదగొండి మొక్కలు నేలనంతా కప్పేశాయి,దాని రాతిగోడ పడిపోయింది.+ 32  నేనది గమనించాను, జాగ్రత్తగా ఆలోచించాను;దాన్ని చూసి ఈ పాఠం నేర్చుకున్నాను:* 33  కాసేపు నిద్రపోవడం, కాసేపు కునికిపాట్లు పడడం,కాసేపు చేతులు ముడుచుకొని పడుకోవడం 34  వాటివల్ల, దోపిడీ దొంగలా పేదరికం,ఆయుధాలు ధరించిన మనిషిలా లేమి నీ మీదికి వస్తాయి.+

అధస్సూచీలు

లేదా “కుటుంబం.”
లేదా “సురక్షితం.”
లేదా “నేర్పుగల.”
లేదా “రక్షణ.”
లేదా “తెలివితక్కువవాడి.”
లేదా “ఉద్దేశాల్ని.”
లేదా “నీ ప్రాణానికి తియ్యగా ఉంటుందని.”
అంటే, శత్రువు.
లేదా “కోపం తెచ్చుకోకు.”
అంటే, యెహోవా, రాజు.
అంటే, దుష్టుణ్ణి.
లేదా “సూటిగా జవాబివ్వడం ముద్దుపెట్టడం లాంటిది” అయ్యుంటుంది.
లేదా “కుటుంబాన్ని ఏర్పాటు చేసుకో.”
లేదా “క్రమశిక్షణ పొందాను.”