సామెతలు 26:1-28
26 ఎండాకాలంలో మంచులా, కోతకాలంలో వర్షంలామూర్ఖుడికి ఘనత తగదు.+
2 పక్షి పారిపోవడానికి, వానకోకిల ఎగరడానికి కారణం ఉన్నట్టే,ప్రతీ శాపానికి ఏదోక కారణం ఉంటుంది.*
3 గుర్రం కోసం కొరడా, గాడిద కోసం కళ్లెం,+మూర్ఖుల వీపు కోసం బెత్తం ఉన్నాయి.+
4 మూర్ఖుడికి అతని తెలివితక్కువతనాన్ని బట్టి జవాబు ఇవ్వకు,లేకపోతే నువ్వు కూడా అతనితో సమానం అవుతావు.*
5 మూర్ఖుడికి అతని తెలివితక్కువతనాన్ని బట్టి జవాబు ఇవ్వు,లేదంటే అతను తాను తెలివిగలవాణ్ణని అనుకుంటాడు.+
6 మూర్ఖుడికి పనులు అప్పగించేవాడుతన కాళ్లు తానే విరగ్గొట్టుకొని తనకు తానే హాని చేసుకునేవాడితో* సమానం.
7 మూర్ఖుల నోట సామెత,కుంటివాడి కుంటి* కాళ్ల లాంటిది.+
8 మూర్ఖుడికి ఘనత ఇవ్వడంవడిసెలకు రాయి కట్టడం లాంటిది.+
9 తాగుబోతు చేతిలో ముళ్లచెట్టు ఎలా ఉంటుందోమూర్ఖుల నోట సామెత అలా ఉంటుంది.
10 మూర్ఖుల్ని, దారినపోయే వాళ్లను పనిలో పెట్టుకునేవాడుఎటుపడితే అటు బాణాలు వేసి* గాయపర్చే విలుకాడి లాంటివాడు.
11 కుక్క తన వాంతి దగ్గరికి తిరిగెళ్లినట్టుమూర్ఖుడు మళ్లీమళ్లీ తన తెలివితక్కువతనాన్ని చూపిస్తాడు.+
12 తాను తెలివిగలవాణ్ణి అనుకునే మనిషిని చూశావా?+
అతని కన్నా మూర్ఖుణ్ణి బాగుచేయడం తేలిక.
13 సోమరి, “దారిలో కొదమ సింహం ఉంది,సంతవీధిలో సింహం ఉంది!” అని అంటాడు.+
14 బందుల మీద తలుపు తిరుగుతూ ఉంటుంది,అలాగే సోమరి తన పరుపు మీద దొర్లుతూ ఉంటాడు.+
15 సోమరి విందుపాత్రలో చెయ్యి ఉంచుతాడుకానీ దాన్ని నోటి దాకా తెచ్చుకోవడం అతనికి కష్టమనిపిస్తుంది.+
16 వివేచనతో జవాబిచ్చే ఏడుగురి కన్నాసోమరి తానే తెలివిగలవాణ్ణి అనుకుంటాడు.
17 దారిన వెళ్తూ తనకు సంబంధంలేని గొడవను బట్టి కోపం తెచ్చుకునేవాడు*కుక్క చెవులు పట్టుకునే వాడితో సమానం.+
18 అగ్ని బాణాల్ని, బాణాల్ని, ప్రాణాంతకమైన బాణాల్ని* విసిరే పిచ్చోడు
19 తన పొరుగువాణ్ణి ఆటపట్టించి, “ఊరికే, సరదాకి చేశాను!” అనేవాడితో సమానం.+
20 కట్టెలు లేకపోతే నిప్పు ఆరిపోతుంది,లేనిపోనివి కల్పించి చెప్పేవాడు లేకపోతే గొడవ ఆగిపోతుంది.+
21 ఆరిపోయే కట్టెల్ని బొగ్గులు, అగ్నిని కట్టెలు మండించినట్టేకలహప్రియుడు గొడవను రగిలిస్తాడు.+
22 లేనిపోనివి కల్పించి చెప్పేవాడి మాటలు రుచికరమైన ఆహారం ముద్దల* లాంటివి;అవి నేరుగా కడుపు లోపలికి వెళ్లిపోతాయి.+
23 దుష్ట హృదయం నుండి వచ్చే ఆప్యాయమైన మాటలుమట్టి పెంకు మీది వెండి పూత లాంటివి.+
24 ఇతరుల్ని ద్వేషించేవాడు తన పెదాల చాటున దాన్ని దాచేస్తాడు,అయితే అతని హృదయంలో మోసం ఉంటుంది.
25 అతను దయగా మాట్లాడినా అతన్ని నమ్మొద్దు,అతని హృదయంలో ఏడు అసహ్యమైన విషయాలు ఉన్నాయి.*
26 అతను తన ద్వేషాన్ని మోసంతో దాచిపెట్టినాసమాజంలో అతని చెడుతనం బట్టబయలౌతుంది.
27 గుంట తవ్వేవాడు అందులో పడిపోతాడు,ఎవరైనా రాయిని దొర్లిస్తే, అది వాళ్ల మీదికే వచ్చి పడుతుంది.+
28 అబద్ధాలాడే నాలుక, అది నలగ్గొట్టిన వాళ్లను ద్వేషిస్తుంది,పొగిడే నోరు నాశనం చేస్తుంది.+
అధస్సూచీలు
^ లేదా “కారణంలేని శాపం తగలదు” అయ్యుంటుంది.
^ లేదా “అతని స్థాయికి వస్తావు.”
^ అక్ష., “దౌర్జన్యాన్ని తాగేవాడితో.”
^ లేదా “ఊగిసలాడే.”
^ లేదా “అందర్నీ.”
^ లేదా “గొడవలో తలదూర్చేవాడు” అయ్యుంటుంది.
^ అక్ష., “మరణాన్ని.”
^ లేదా “ఆత్రంగా మింగేసే ఆహారపదార్థాల.”
^ లేదా “అతని హృదయం పూర్తిగా అసహ్యంగా ఉంటుంది.”