సామెతలు 29:1-27
29 ఎన్నిసార్లు గద్దించినా తలబిరుసుగా* ప్రవర్తించేవాడు+అకస్మాత్తుగా కూలిపోతాడు, మళ్లీ కోలుకోడు.+
2 నీతిమంతులు ఎక్కువైనప్పుడు ప్రజలు సంతోషిస్తారు,దుష్టుడు పరిపాలించినప్పుడు ప్రజలు నిట్టూరుస్తారు.+
3 తెలివిని ప్రేమించేవాడు తన తండ్రిని సంతోషపెడతాడు,వేశ్యలతో సహవాసం చేసేవాడు ఆస్తిని దుబారా చేస్తాడు.
4 న్యాయంతో రాజు దేశాన్ని సుస్థిరం చేస్తాడు,+లంచాలు తీసుకునేవాడు దాన్ని నాశనం చేస్తాడు.
5 తన పొరుగువాణ్ణి పొగడ్తలతో ముంచెత్తేవాడుఅతని పాదాల కోసం వల పరుస్తున్నాడు.+
6 చెడ్డవాడు తన అపరాధం వల్ల ఉరిలో చిక్కుకుంటాడు,నీతిమంతుడు సంతోషంతో కేకలు వేస్తూ ఆనందిస్తాడు.+
7 నీతిమంతుడు పేదవాళ్ల హక్కుల గురించి ఆలోచిస్తాడు,దుష్టుడికి అలాంటి పట్టింపు ఉండదు.+
8 గొప్పలు చెప్పుకునేవాళ్లు ఊరిని రెచ్చగొడతారు,+తెలివిగలవాళ్లు కోపాన్ని చల్లారుస్తారు.+
9 తెలివిగలవాడు తెలివితక్కువవాడితో వాదన పెట్టుకుంటేతిట్టుకోవడం, ఎగతాళి చేసుకోవడమే ఉంటాయి తప్ప మనశ్శాంతి ఉండదు.
10 రక్తదాహం గలవాళ్లకు నిర్దోషులంటే* అసహ్యం,+వాళ్లు నిజాయితీపరుల ప్రాణాలు తీయాలని చూస్తారు.*
11 మూర్ఖుడు తనకు అనిపించిందంతా* బయటికి కక్కేస్తాడు,+అయితే తెలివిగలవాడు ప్రశాంతంగా ఉంటాడు.+
12 పరిపాలకుడు అబద్ధాల్ని పట్టించుకుంటేఅతని సేవకులంతా చెడ్డవాళ్లుగా ఉంటారు.+
13 పేదవాడికి, అణచివేసేవాడికి మధ్య ఈ పోలిక ఉంది:
ఆ ఇద్దరి కళ్లకూ యెహోవాయే వెలుగు ఇస్తున్నాడు.*
14 రాజు పేదవాళ్లకు న్యాయంగా తీర్పు తీరిస్తే+అతని సింహాసనం ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది.+
15 బెత్తం,* గద్దింపు తెలివిని కలిగిస్తాయి,+అదుపులో పెట్టని పిల్లవాడు తన తల్లికి అవమానం తీసుకొస్తాడు.
16 చెడ్డవాళ్లు ఎక్కువైతే, అపరాధం ఎక్కువౌతుంది,అయితే నీతిమంతులు వాళ్ల పతనాన్ని చూస్తారు.+
17 నీ కుమారుణ్ణి క్రమశిక్షణలో పెడితే, అతను నీకు విశ్రాంతినిస్తాడు;నీ ప్రాణానికి ఎంతో సంతోషం తీసుకొస్తాడు.+
18 దర్శనం* లేని చోట ప్రజలు అదుపులేకుండా ప్రవర్తిస్తారు,+అయితే ధర్మశాస్త్రాన్ని పాటించేవాళ్లు సంతోషంగా ఉంటారు.+
19 సేవకుడు మాటలకు లొంగడు,అతనికి అర్థమైనాసరే లోబడడు.+
20 తొందరపడి మాట్లాడేవాణ్ణి చూశావా?+
అతనికన్నా తెలివితక్కువవాడు త్వరగా బాగుపడతాడు.+
21 సేవకుణ్ణి చిన్నప్పటి నుండి గారాబం చేస్తేచివరికి అతను కృతజ్ఞతలేని వాడిగా తయారౌతాడు.
22 కోపిష్ఠి గొడవలు రేపుతాడు;ముక్కోపి చాలా అపరాధాలు చేస్తాడు.+
23 మనిషి గర్వం అతన్ని అణచివేస్తుంది,+వినయ స్వభావం గలవాడు ఘనతను పొందుతాడు.+
24 దొంగతో చేరేవాడు తన ప్రాణాన్ని ద్వేషిస్తున్నాడు.
సాక్ష్యం చెప్పమనే పిలుపును* విన్నా అతను నోరు తెరవడు.+
25 మనుషులకు భయపడడం ఉరి లాంటిది,+అయితే యెహోవా మీద నమ్మకం పెట్టుకునేవాడు రక్షించబడతాడు.+
26 పరిపాలకుణ్ణి కలిసి మాట్లాడాలని* ప్రయత్నించేవాళ్లు చాలామంది ఉంటారు,అయితే ఒక వ్యక్తికి న్యాయం చేసేది యెహోవాయే.+
27 అన్యాయస్థుడంటే నీతిమంతుడికి అసహ్యం,+నిజాయితీగా నడుచుకునేవాడంటే దుష్టుడికి అసహ్యం.+
అధస్సూచీలు
^ లేదా “మొండిగా.”
^ లేదా “నిందలేని వాళ్లంటే.”
^ లేదా “కానీ నిజాయితీపరులు తమ ప్రాణాలు కాపాడుకోవాలని చూస్తారు” అయ్యుంటుంది.
^ లేదా “తన కోపమంతా.”
^ అంటే, ఆయనే వాళ్లకు జీవాన్ని ఇస్తున్నాడు.
^ లేదా “క్రమశిక్షణ; శిక్ష.”
^ లేదా “ప్రవచనాత్మక సందేశం; దేవుని నిర్దేశం.”
^ లేదా “శాపంతో కూడిన ఒట్టును.”
^ లేదా “అనుగ్రహం పొందాలని” అయ్యుంటుంది.