హోషేయ 12:1-14

  • ఎఫ్రాయిము యెహోవా దగ్గరికి తిరిగిరావాలి (1-14)

    • యాకోబు దేవునితో పోరాడాడు (3)

    • యాకోబు దేవుని అనుగ్రహం కోసం ఏడ్చాడు (4)

12  “ఎఫ్రాయిము గాలిని తింటున్నాడు. రోజంతా తూర్పు గాలి వెంట పరుగులు తీస్తున్నాడు. అతని అబద్ధాలు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. వాళ్లు అష్షూరుతో ఒప్పందం చేసుకున్నారు,+ ఐగుప్తుకు తైలం తీసుకెళ్లారు.+   యెహోవాకు యూదా మీద ఒక వ్యాజ్యం ఉంది;+యాకోబు మార్గాల్ని బట్టి ఆయన అతన్ని లెక్క అడుగుతాడు,అతని పనుల్ని బట్టి అతనికి ప్రతిఫలం ఇస్తాడు.+   గర్భంలో అతను తన సహోదరుని మడిమెను పట్టుకున్నాడు;+తన బలమంతా ఉపయోగించి దేవునితో పోరాడాడు.+   అతను దేవదూతతో పోరాడి, చివరికి గెలిచాడు. అనుగ్రహం కోసం అతను ఏడుస్తూ బ్రతిమాలాడు.”+ ఆయన అతన్ని బేతేలు దగ్గర కనుగొన్నాడు, అక్కడ ఆయన మన గురించి* మాట్లాడాడు,+   ఆయనే సైన్యాలకు దేవుడైన యెహోవా,+యెహోవా అనేది ఆయన జ్ఞాపకార్థ పేరు.*+   “కాబట్టి మీ దేవుని దగ్గరికి తిరిగిరండి,+విశ్వసనీయ ప్రేమ చూపిస్తూ ఉండండి, న్యాయంగా ప్రవర్తిస్తూ ఉండండి,+ఎల్లప్పుడూ మీ దేవుని మీద ఆశపెట్టుకోండి.   కానీ వర్తకుని* చేతిలో దొంగత్రాసు ఉంది;మోసం చేయడం అతనికి చాలా ఇష్టం.+   ఎఫ్రాయిము ఇలా అంటూ ఉన్నాడు: ‘నిజంగా నేను ధనవంతుణ్ణి అయ్యాను;+నాకు చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి.+ నా చేతుల కష్టమంతట్లో వాళ్లు ఏ తప్పునూ, పాపాన్నీ కనుక్కోలేరు.’   కానీ నేను యెహోవాను, ఐగుప్తు దేశంలో ఉన్నప్పటి నుండి* నీ దేవుణ్ణి.+ నియమిత కాలంలోని* రోజుల్లోలానిన్ను మళ్లీ డేరాల్లో నివసించేలా చేస్తాను. 10  నేను ప్రవక్తలతో మాట్లాడాను,+వాళ్లకు ఎన్నో దర్శనాలు ఇచ్చాను,ప్రవక్తల ద్వారా ఉదాహరణలు* చెప్పాను. 11  గిలాదులో మోసం,* అబద్ధం ఉన్నాయి. వాళ్లు గిల్గాలులో ఎద్దుల్ని బలి అర్పించారు,+వాళ్ల బలిపీఠాలు, పొలం చాళ్లల్లో ఉన్న రాళ్లకుప్పల్లా ఉన్నాయి.+ 12  యాకోబు అరాము* ప్రాంతానికి పారిపోయాడు;+భార్య కోసం ఇశ్రాయేలు+ అక్కడ సేవచేశాడు,+భార్య కోసం గొర్రెలు కాశాడు.+ 13  ఒక ప్రవక్త ద్వారా యెహోవా ఇశ్రాయేలును ఐగుప్తు నుండి తీసుకొచ్చాడు,+ఒక ప్రవక్త ద్వారా అతన్ని సంరక్షించాడు.+ 14  ఎఫ్రాయిము ఘోరమైన తప్పు చేశాడు;+అతని రక్తాపరాధం అతని మీద నిలిచివుంది;అతను తన ప్రభువు మీదికి తెచ్చిన అవమానాన్ని బట్టి ఆయన అతనికి ప్రతీకారం చేస్తాడు.”+

అధస్సూచీలు

అక్ష., “మనతో.”
లేదా “అనే పేరుతో ఆయన గుర్తుచేసుకోబడతాడు.”
లేదా “వ్యాపారి.”
అక్ష., “దేశం నుండి.”
లేదా “పండుగ” అయ్యుంటుంది.
లేదా “ఉపమానాలు.”
లేదా “దుష్టశక్తుల నుండి వచ్చినవి; అంతుచిక్కనివి.”
లేదా “సిరియా.”