హోషేయ 2:1-23

  • విశ్వాసఘాతకురాలైన ఇశ్రాయేలుకు శిక్ష (1-13)

  • “నా భర్త” అంటూ యెహోవా దగ్గరికి తిరిగిరావడం (14-23)

    • “నువ్వు నన్ను ‘నా భర్త’ అని అంటావు” (16)

2  “మీ సహోదరులతో, ‘మీరు నా ప్రజలు’* అని,+ మీ సహోదరీలతో, ‘మీరు కరుణించబడిన స్త్రీలు’* అని అనండి.+   మీ తల్లిని నిందించండి; ఆమెను నిందించండి,ఎందుకంటే ఆమె నా భార్య కాదు!+ నేను ఆమె భర్తను కాదు! ఆమె తన వ్యభిచారాన్ని* విడిచిపెట్టాలి,తన రొమ్ముల మధ్య నుండి వ్యభిచారాన్ని తొలగించాలి.   లేదంటే నేను ఆమె బట్టలు తీసేసి, ఆమె పుట్టినప్పుడు ఎలా ఉందో అలా చేస్తాను,ఆమెను ఎడారిలా* చేస్తాను,నీళ్లు లేని ప్రదేశంగా మారుస్తాను,దాహంతో ఆమె చనిపోయేలా చేస్తాను.   నేను ఆమె కుమారుల్ని కరుణించను,ఎందుకంటే వాళ్లు వ్యభిచారం* వల్ల పుట్టిన కుమారులు.   వాళ్ల అమ్మ వ్యభిచారం* చేసింది.+ వాళ్లను కడుపున మోసిన ఆమె అవమానకరంగా ప్రవర్తించింది.+ ఆమె ఇలా అనుకుంది:‘నేను నా ప్రియుల వెంట వెళ్తాను,+వాళ్లు నాకు ఆహారాన్ని, నీళ్లను,ఉన్నివస్త్రాన్ని, నారవస్త్రాన్ని, నూనెను, ద్రాక్షారసాన్ని ఇస్తారు.’   కాబట్టి నేను నీ దారికి అడ్డంగా ముళ్లకంచె వేస్తాను;ఆమె తన దారుల్ని కనుక్కోకుండాఆమెకు అడ్డంగా ఒక రాతి గోడ కడతాను.   ఆమె తన ప్రియుల వెనక పరుగులు తీస్తుంది, కానీ వాళ్లను కలుసుకోలేదు;+ఆమె వాళ్ల కోసం చూస్తుంది, కానీ వాళ్లను కనుక్కోలేదు. అప్పుడు ఆమె ఇలా అనుకుంటుంది, ‘నేను నా మొదటి భర్త దగ్గరికి తిరిగెళ్తాను,+ఇప్పటికన్నా అప్పుడే నా పరిస్థితి బాగుండేది.’+   ఆమెకు ధాన్యాన్ని, కొత్త ద్రాక్షారసాన్ని, నూనెను,విస్తారమైన వెండిని, బంగారాన్ని ఇచ్చింది నేనే అని ఆమె గుర్తించలేదు,+వాటిని ఆమె* బయలు కోసం ఉపయోగించింది.+   ‘కాబట్టి, ఇప్పుడు నేను తిరిగొచ్చికోత సమయంలో నా ధాన్యాన్ని, సమకూర్చే కాలంలో నా కొత్త ద్రాక్షారసాన్ని తీసేసుకుంటాను.+అలాగే ఆమె మానాన్ని కప్పే నా ఉన్నివస్త్రాన్ని, నా నారవస్త్రాన్ని లాగేసుకుంటాను. 10  నేను ఆమె ప్రియుల కళ్లముందు ఆమెను దిగంబరిని చేస్తాను,*నా చేతిలో నుండి ఎవ్వరూ ఆమెను కాపాడలేరు.+ 11  నేను ఆమె సంతోషమంతటికీ,ఆమె పండుగలకు,+ ఆమె అమావాస్య రోజులకు, ఆమె విశ్రాంతి రోజులకు,* ఆమె ఉత్సవ కాలాలన్నిటికీ ముగింపు పలుకుతాను. 12  ఆమె ద్రాక్షచెట్లను, అంజూర చెట్లను నాశనం చేస్తాను; వాటి గురించి ఆమె, “ఇవి నా ప్రియులు నాకు ఇచ్చిన జీతం” అని అనుకుంది;నేను వాటిని అడవిగా మారుస్తాను,అడవి జంతువులు వాటిని మింగేస్తాయి. 13  ఆమె బయలు విగ్రహాలకు బలులు అర్పించిన రోజుల్ని బట్టి,+ఉంగరాల్ని, ఆభరణాల్ని పెట్టుకుని తన ప్రియుల వెంట పరుగులు తీసిన రోజుల్ని బట్టి నేను ఆమెను లెక్క అడుగుతాను,ఆమె నన్ను మర్చిపోయింది’+ అని యెహోవా అంటున్నాడు. 14  ‘కాబట్టి, నేను ఆమెను ఒప్పించిఎడారిలోకి నడిపిస్తాను,ఆమె హృదయాన్ని గెల్చుకునేలా మాట్లాడతాను. 15  అప్పటినుండి నేను ఆమె ద్రాక్షతోటల్ని ఆమెకు తిరిగిస్తాను,+ఆకోరు లోయను+ నిరీక్షణకు ద్వారంగా చేస్తాను;ఆమె యువతిగా ఉన్నప్పటిలా అక్కడ నాకు జవాబిస్తుంది,ఐగుప్తు* నుండి వచ్చిన రోజున మాట్లాడినట్టు మాట్లాడుతుంది.+ 16  ఆ రోజు నువ్వు నన్ను “నా భర్త” అని అంటావు,ఇకమీదట నువ్వు నన్ను “నా యజమాని”* అని అనవు’ అని యెహోవా అంటున్నాడు. 17  ‘నేను ఆమె నోటి నుండి బయలు విగ్రహాల పేర్లు రాకుండా చేస్తాను,+వాటి పేర్లను ఇక ఎవ్వరూ గుర్తు చేసుకోరు.+ 18  ఆ రోజు నేను వాళ్ల కోసం అడవి జంతువులతో,ఆకాశపక్షులతో, నేలమీద పాకే ప్రాణులతో+ ఒక ఒప్పందం* చేస్తాను;+విల్లు, ఖడ్గం, యుద్ధం అనేవి దేశంలో లేకుండా చేస్తాను,+వాళ్లు సురక్షితంగా పడుకునేలా* చేస్తాను.+ 19  నువ్వు ఎప్పటికీ నా దానివి అయ్యేలా నేను నిన్ను ప్రధానం చేసుకుంటాను;నీతితో, న్యాయంతో, విశ్వసనీయ ప్రేమతో, కరుణతో+నేను నిన్ను ప్రధానం చేసుకుంటాను. 20  నమ్మకత్వంతో నేను నిన్ను ప్రధానం చేసుకుంటాను.నువ్వు తప్పకుండా యెహోవాను తెలుసుకుంటావు.’+ 21  యెహోవా ఇలా అంటున్నాడు: ‘ఆ రోజు నేను జవాబిస్తాను;నేను ఆకాశానికి జవాబిస్తాను,అది భూమికి జవాబిస్తుంది,+ 22  భూమి ధాన్యానికి, కొత్త ద్రాక్షారసానికి, నూనెకు జవాబిస్తుంది;అవి యెజ్రెయేలుకు* జవాబిస్తాయి. 23  నేను నా కోసం ఆమెను భూమిలో విత్తనంలా విత్తుతాను,+కరుణించబడని* ఆమెను కరుణిస్తాను;నా ప్రజలుకాని* వాళ్లతో, “మీరు నా ప్రజలు” అని అంటాను,+ వాళ్లేమో, “నువ్వు మా దేవుడివి” అని అంటారు.’ ”+

అధస్సూచీలు

హోషేయ 1:6 అధస్సూచి చూడండి.
హోషేయ 1:9 అధస్సూచి చూడండి.
లేదా “అనైతికతను; విచ్చలవిడి అక్రమ సంబంధాల్ని.”
పదకోశం చూడండి.
లేదా “అనైతికత; విచ్చలవిడి అక్రమ సంబంధాల.”
లేదా “అనైతికత; విచ్చలవిడి అక్రమ సంబంధాలు.”
అక్ష., “వాళ్లు.”
అక్ష., “ఆమె మర్మాంగాలు కనబడేలా చేస్తాను.”
లేదా “సబ్బాతు రోజులకు.”
లేదా “ఈజిప్టు.”
లేదా “నా బయలు.”
లేదా “జీవించేలా.”
లేదా “నిబంధన.”
“దేవుడు విత్తనం విత్తుతాడు” అని అర్థం.
హోషేయ 1:6 అధస్సూచి చూడండి.
హోషేయ 1:9 అధస్సూచి చూడండి.