హోషేయ 3:1-5

  • వ్యభిచారం చేసిన భార్యను హోషేయ తిరిగి కొనడం (1-3)

  • ఇశ్రాయేలు తిరిగి యెహోవా దగ్గరికి వస్తుంది (4, 5)

3  తర్వాత యెహోవా నాతో ఇలా అన్నాడు: “నువ్వు ఇంకొకసారి వెళ్లి పరాయి పురుషుడు ప్రేమించిన ఆ స్త్రీని, వ్యభిచారం చేస్తున్న ఆ స్త్రీని ప్రేమించు.+ ఎందుకంటే, ఇశ్రాయేలు ప్రజలు వేరే దేవుళ్ల వైపు తిరిగి,+ ఎండుద్రాక్ష రొట్టెల్ని* ప్రేమిస్తున్నా యెహోవా వాళ్లను ప్రేమిస్తున్నాడు.”+  దాంతో నేను 15 వెండి రూకలు, ఒకటిన్నర హోమర్‌ కొలతల* బార్లీ గింజలు ఇచ్చి ఆమెను కొనుక్కున్నాను.  తర్వాత నేను ఆమెతో ఇలా అన్నాను: “నువ్వు చాలారోజుల పాటు నా దానివిగా ఉంటావు. నువ్వు వ్యభిచారం* చేయకూడదు, పరాయి పురుషునితో సంబంధాలు పెట్టుకోకూడదు, నేను కూడా నీ విషయంలో అలానే ఉంటాను.”*  ఎందుకంటే, ఇశ్రాయేలు ప్రజలు చాలాకాలం* పాటు రాజు లేకుండా,+ అధిపతి లేకుండా, బలులు అర్పించకుండా, పూజా స్తంభం లేకుండా, ఏఫోదు గానీ+ గృహదేవతల విగ్రహాలు+ గానీ లేకుండా ఉంటారు.  ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలు వెనక్కి తిరిగొచ్చి తమ దేవుడైన యెహోవా కోసం, తమ రాజైన దావీదు+ కోసం చూస్తారు.+ ఆ రోజుల చివర్లో వాళ్లు యెహోవా మంచితనం రుచి చూడడానికి వణుకుతూ ఆయన దగ్గరికి వస్తారు.+

అధస్సూచీలు

అంటే, అబద్ధ ఆరాధనలో వాడేవి.
అప్పట్లో ఒక హోమర్‌ 220 లీటర్లతో (దాదాపు 130 కిలోలతో) సమానం. అనుబంధం B14 చూడండి.
లేదా “అనైతికత; విచ్చలవిడి అక్రమ సంబంధాలు.”
లేదా “నేను కూడా నీతో లైంగిక సంబంధం పెట్టుకోను.”
అక్ష., “చాలా రోజుల.”