హోషేయ 7:1-16

  • ఎఫ్రాయిము దుష్టత్వం వర్ణన (1-16)

    • దేవుని వల నుండి తప్పించుకోలేరు (12)

7  “నేను ఇశ్రాయేలును బాగుచేసినప్పుడు,ఎఫ్రాయిము దోషం,సమరయ దుష్టత్వం+ కూడా వెల్లడౌతాయి.+ ఎందుకంటే, వాళ్లు మోసపూరితంగా ప్రవర్తిస్తున్నారు;+దొంగలు లోపలికి చొరబడుతున్నారు, బయట దోపిడీ ముఠాలు దోచుకుంటున్నాయి.+   కానీ నేను వాళ్ల దుష్టత్వమంతటినీ గుర్తు చేసుకుంటానని వాళ్లు తమ హృదయాల్లో అనుకోవడం లేదు.+ వాళ్ల చెడ్డపనులు వాళ్లను చుట్టుముట్టాయి;అవి సరిగ్గా నా కళ్ల ముందే ఉన్నాయి.   వాళ్లు తమ దుష్టత్వంతో రాజును,మోసంతో అధిపతుల్ని సంతోషపెడుతున్నారు.   వాళ్లంతా వ్యభిచారులు,వంటవాడు అంటించిన పొయ్యిలా మండుతున్నారు;పిండి పిసికి, ముద్ద పులిసే వరకు అతను ఆ మంటను రేపడు.   మన రాజు ఉత్సవ రోజున అధిపతులు జబ్బుపడ్డారు,ద్రాక్షారసం వల్ల వాళ్లు కోపంగా ఉన్నారు.+ రాజు అపహాసకులతో చేతులు కలిపాడు.   పొయ్యిలా మండుతున్న హృదయాలతో వాళ్లు దగ్గరికి వస్తారు.* వంటవాడు రాత్రంతా నిద్రపోతాడు;ఉదయం పెద్దపెద్ద మంటలతో పొయ్యి మండుతుంది.   వాళ్లంతా పొయ్యిలా వేడిగా ఉన్నారు,వాళ్లు తమ పరిపాలకుల్ని* మింగేస్తారు. వాళ్ల రాజులంతా పడిపోయారు;+వాళ్లలో ఒక్కరు కూడా నాకు మొరపెట్టడం లేదు.+   ఎఫ్రాయిము దేశాలతో కలిసిపోయాడు.+ ఎఫ్రాయిము ఒకవైపే కాలిన గుండ్రటి రొట్టెలా ఉన్నాడు.   అపరిచితులు అతని శక్తిని దోచుకున్నారు,+ కానీ ఆ విషయం అతనికి తెలియడం లేదు. అతని వెంట్రుకలు తెల్లబడ్డాయి, కానీ అతను దాన్ని గమనించుకోవడం లేదు. 10  ఇశ్రాయేలు గర్వం అతని మీద సాక్ష్యం చెప్పింది,+ఇంత జరిగినా, వాళ్లు తమ దేవుడైన యెహోవా దగ్గరికి తిరిగి రాలేదు,+ఆయన కోసం వెదకలేదు. 11  ఎఫ్రాయిము తెలివి గానీ, వివేచన* గానీ లేని+ పావురంలా ఉన్నాడు. వాళ్లు ఐగుప్తును పిలిచారు;+ అష్షూరు దగ్గరికి వెళ్లారు.+ 12  వాళ్లు ఎక్కడికి వెళ్లినా, నేను నా వలను వాళ్లమీద పరుస్తాను. ఆకాశపక్షుల్లా వాళ్లను కిందికి పడేస్తాను. వాళ్ల సమాజానికి ఇచ్చిన హెచ్చరిక ప్రకారం వాళ్లకు క్రమశిక్షణ ఇస్తాను.+ 13  వాళ్లకు శ్రమ! ఎందుకంటే, వాళ్లు నా నుండి పారిపోయారు. వాళ్లకు నాశనం తప్పదు! ఎందుకంటే, వాళ్లు నాకు వ్యతిరేకంగా పాపం చేశారు. వాళ్లను విడిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ వాళ్లు నామీద అబద్ధాలు చెప్పారు.+ 14  వాళ్లు తమ పరుపుల మీద పడుకుని ఏడుస్తూ ఉంటారు,కానీ తమ హృదయాల్లో నాకు మొరపెట్టరు.+ వాళ్లు ధాన్యం కోసం, కొత్త ద్రాక్షారసం కోసం తమ శరీరాల్ని కోసుకుంటారు;వాళ్లు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. 15  నేను వాళ్లకు క్రమశిక్షణ ఇచ్చినా, వాళ్ల బాహువుల్ని బలపర్చినా,వాళ్లు చెడు చేయడానికి కుట్ర పన్నుతూ నాకు విరోధులుగా ఉన్నారు. 16  వాళ్లు తమ ప్రవర్తన మార్చుకున్నారు, కానీ ఉన్నతమైనదాని* వైపు తిరగలేదు;వదులుగా ఉన్న విల్లులా వాళ్లు నమ్మదగినవాళ్లు కాదు.+ వాళ్ల అధిపతులు తమ తిరుగుబాటు మాటల వల్ల ఖడ్గంతో చంపబడతారు. అందుకే వాళ్లు ఐగుప్తు దేశంలో ఎగతాళికి గురౌతారు.”+

అధస్సూచీలు

లేదా “వాళ్లు తమ కుతంత్రాలతో దగ్గరికి వస్తున్నప్పుడు, వాళ్ల హృదయాలు పొయ్యిలా ఉన్నాయి” అయ్యుంటుంది.
అక్ష., “న్యాయమూర్తుల్ని.”
అక్ష., “హృదయం.”
అంటే, ఉన్నతమైన ఆరాధన.