హోషేయ 8:1-14
8 “నీ నోటి దగ్గర బూర* పెట్టుకో!+
శత్రువు గద్దలా యెహోవా మందిరం మీదికి వస్తున్నాడు,+ఎందుకంటే వాళ్లు నా ఒప్పందాన్ని మీరారు,+ నా ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా పాపం చేశారు.+
2 వాళ్లు, ‘మా దేవా, ఇశ్రాయేలీయులమైన మాకు నువ్వు తెలుసు!’ అంటూ నాకు మొరపెడతారు.+
3 ఇశ్రాయేలు మంచిని తిరస్కరించాడు.+
శత్రువు అతన్ని వెంటాడాలి.
4 వాళ్లు రాజుల్ని నియమించుకున్నారు, కానీ నా ద్వారా కాదు.
అధిపతుల్ని నియమించుకున్నారు, కానీ నా అనుమతితో కాదు.
తమ వెండిబంగారాలతో విగ్రహాలు చేసుకున్నారు,+దానివల్ల వాళ్లు నాశనమౌతారు.+
5 సమరయా, నీ దూడ తిరస్కరించబడింది.
నా కోపం వాళ్ల మీద రగులుకుంటుంది.+
ఈ దోషం నుండి శుద్ధులవ్వడానికి వాళ్లకు ఇంకా ఎంతకాలం పడుతుంది?
6 అది ఇశ్రాయేలు నుండి వచ్చింది.
ఒక చేతిపనివాడు దాన్ని చేశాడు, అది దేవుడు కాదు;సమరయలోని దూడ ముక్కలుముక్కలు చేయబడుతుంది.
7 ఎందుకంటే వాళ్లు గాలిని విత్తుతున్నారు,సుడిగాలిని కోస్తారు.+
ఏ దంటుకూ కంకులు రావు;+మొలకెత్తినవి పిండిని ఇవ్వవు.
ఒకవేళ ఇచ్చినా, పరదేశులు* దాన్ని మింగేస్తారు.+
8 ఇశ్రాయేలు మింగేయబడుతుంది.+
వాళ్లు ఎవరికీ ఇష్టంలేని పాత్రలాదేశాల మధ్య ఉంటారు.+
9 ఒంటరిగా తిరిగే అడవి గాడిదలా వాళ్లు అష్షూరు దగ్గరికి వెళ్లారు.+
ఎఫ్రాయిము డబ్బిచ్చి వేశ్యల్ని పిలిపించుకున్నాడు.+
10 వాళ్లను దేశాల మధ్య నుండి పిలిపించుకున్నా,ఇప్పుడు నేను వాళ్లను సమకూరుస్తాను;రాజు, అధిపతులు విధించిన భారాల వల్ల వాళ్లకు కష్టాలు మొదలౌతాయి.+
11 ఎందుకంటే, ఎఫ్రాయిము ఎన్నో బలిపీఠాల్ని కట్టి పాపం చేశాడు.+
ఆ బలిపీఠాల వల్ల అతని పాపం ఎక్కువైంది.+
12 నేను అతని కోసం నా ధర్మశాస్త్రంలోని* చాలా విషయాల్ని రాశాను,కానీ అవి వాళ్లకు వింతగా అనిపించాయి.+
13 వాళ్లు బలుల్ని నాకు కానుకగా అర్పిస్తారు, వాటి మాంసం తింటారు,కానీ యెహోవా వాటిని ఏమాత్రం ఇష్టపడడు.+
ఇప్పుడు ఆయన వాళ్ల తప్పును గుర్తుచేసుకుంటాడు, వాళ్ల పాపాల్ని బట్టి వాళ్లను శిక్షిస్తాడు.+
వాళ్లు ఐగుప్తు వైపుకు తిరిగారు.*+
14 ఇశ్రాయేలు తనను చేసిన వ్యక్తిని మర్చిపోయి,+ గుళ్లను కట్టించాడు;+యూదా, ప్రాకారాలుగల ఎన్నో నగరాల్ని కట్టించాడు.+
కానీ నేను అతని నగరాల్లోకి అగ్నిని పంపిస్తాను,అది ప్రతీ బురుజును దహించేస్తుంది.”+
అధస్సూచీలు
^ అక్ష., “కొమ్ము.”
^ లేదా “అపరిచితులు.”
^ లేదా “ఉపదేశంలోని.”
^ లేదా “తిరిగెళ్తారు” అయ్యుంటుంది.