హోషేయ 9:1-17

  • ఎఫ్రాయిము పాపాల వల్ల దేవుడు అతన్ని తిరస్కరించాడు (1-17)

    • అవమానకరమైన దేవునికి సమర్పించుకోవడం (10)

9  “ఇశ్రాయేలూ, సంతోషించకు,జనాల్లా ఆనందించకు. వ్యభిచారం* వల్ల నువ్వు నీ దేవునికి దూరంగా వెళ్లావు.+ ప్రతీ ధాన్యపు కళ్లం* దగ్గర నువ్వు పడుపుసొమ్మును ప్రేమించావు.+   కానీ కళ్లం, ద్రాక్షతొట్టి వాళ్లను పోషించవు,కొత్త ద్రాక్షారసం వాళ్లకు* ఉండదు.+   వాళ్లు ఇక యెహోవా దేశంలో నివసించరు;+బదులుగా ఎఫ్రాయిము ఐగుప్తుకు తిరిగెళ్లిపోతాడు,వాళ్లు అష్షూరులో అపవిత్రమైన వాటిని తింటారు.+   వాళ్లు ఇక ద్రాక్షారసంతో యెహోవాకు పానీయార్పణలు అర్పించరు;+వాళ్ల బలుల్ని ఆయన ఇష్టపడడు.+ అవి దుఃఖపు రొట్టెల్లాంటివి.వాటిని తినే వాళ్లందరూ అపవిత్రులౌతారు. వాళ్ల రొట్టె వాళ్ల కోసమే;అది యెహోవా మందిరంలోకి రాదు.   సమావేశ* రోజున మీరేం చేస్తారు?యెహోవా పండుగ రోజున మీరేం చేస్తారు?   ఎందుకంటే ఇదిగో! నాశనం వల్ల వాళ్లు పారిపోవాల్సి వస్తుంది. ఐగుప్తు వాళ్లను సమకూరుస్తుంది,+ మెంఫిస్‌ వాళ్లను పాతిపెడుతుంది.+ వాళ్ల ప్రశస్తమైన వెండి వస్తువుల్ని దురదగొండి మొక్కలు ఆక్రమిస్తాయి,వాళ్ల డేరాల్లో ముళ్లపొదలు పెరుగుతాయి.   లెక్క అడిగే రోజులు వస్తాయి,+ప్రతీకారం తీర్చుకునే రోజులు వస్తాయి,ఇశ్రాయేలు దాన్ని తెలుసుకుంటుంది. వాళ్ల ప్రవక్త బుద్ధిలేని వాడని, దేవుని సందేశం చెప్తున్నాను అనే వ్యక్తి పిచ్చివాడని తేలిపోతుంది;నీ తప్పులు విస్తారంగా ఉన్నాయి కాబట్టి నీ పట్ల విరోధం కూడా ఎక్కువగా ఉంది.”   ఎఫ్రాయిము కావలివాడు+ నా దేవునితో+ ఉండేవాడు. కానీ ఇప్పుడు అతని ప్రవక్తల+ మార్గాలన్నీ వేటగాడి ఉచ్చుల్లా ఉన్నాయి;అతని దేవుని మందిరంలో విరోధం ఉంది.   గిబియా రోజుల్లోలా,+ వాళ్లు నాశనంలో లోతుగా కూరుకుపోయారు. ఆయన వాళ్ల తప్పుల్ని గుర్తు చేసుకుంటాడు, వాళ్ల పాపాల్ని బట్టి వాళ్లను శిక్షిస్తాడు. 10  “ఎడారిలో ద్రాక్షపండ్లు దొరికినట్టు ఇశ్రాయేలు నాకు దొరికాడు.+ అంజూర చెట్టుకు కాసిన తొలి అంజూర పండ్లలా నేను మీ పూర్వీకుల్ని కనుగొన్నాను. కానీ వాళ్లు పెయోరులోని బయలు దగ్గరికి వెళ్లారు;+అవమానకరమైన దానికి* తమను తాము సమర్పించుకున్నారు,+తాము ప్రేమించిన వస్తువులా అసహ్యంగా తయారయ్యారు. 11  ఎఫ్రాయిము మహిమ పక్షిలా ఎగిరిపోతుంది;వాళ్లు గర్భం ధరించరు, పిల్లల్ని కనరు.+ 12  ఒకవేళ వాళ్లు పిల్లల్ని పెంచినా,వాళ్లలో ఒక్కరు కూడా మిగలకుండా పోయేవరకు వాళ్లను నిర్మూలిస్తాను;+అవును, నేను వాళ్లకు దూరంగా వెళ్లినప్పుడు వాళ్లకు శ్రమ!+ 13  పచ్చిక మైదానంలో నాటబడిన ఎఫ్రాయిము, నాకు తూరులా కనిపించాడు;+ఇప్పుడు ఎఫ్రాయిము వధ కోసం తన కుమారుల్ని బయటికి తీసుకురావాలి.” 14  యెహోవా, నువ్వు వాళ్లకు ఇవ్వాల్సింది వాళ్లకు ఇవ్వు;వాళ్ల స్త్రీలకు గర్భస్రావం కలిగించు, వాళ్లను చనుపాలు లేనివాళ్లుగా చేయి. 15  “వాళ్ల దుష్టత్వమంతా గిల్గాలులో ఉంది;+ అందుకే, అక్కడ నేను వాళ్లను ద్వేషించడం మొదలుపెట్టాను. వాళ్ల చెడ్డపనుల్ని బట్టి నేను వాళ్లను నా మందిరంలో నుండి వెళ్లగొడతాను.+ నేను ఇక వాళ్లను ప్రేమించను;+వాళ్ల అధిపతులందరూ మొండివాళ్లు. 16  ఎఫ్రాయిము చెట్టులా నరికేయబడుతుంది.+ వాళ్ల వేరు ఎండిపోతుంది, వాళ్లు ఏమాత్రం ఫలించరు. వాళ్లు ఒకవేళ పిల్లల్ని కన్నా, వాళ్లు ఎంతో ప్రేమించే వాళ్ల సంతానాన్ని నేను చంపేస్తాను.” 17  నా దేవుడు వాళ్లను తిరస్కరిస్తాడు,ఎందుకంటే, వాళ్లు ఆయన మాట వినలేదు,+వాళ్లు దేశాల మధ్య దేశదిమ్మరులుగా తిరుగుతారు.+

అధస్సూచీలు

పదకోశం చూడండి.
లేదా “అనైతికత; విచ్చలవిడి అక్రమ సంబంధాల.”
అక్ష., “ఆమెకు.”
లేదా “మీ నియామక విందు.”
లేదా “అవమానకరమైన దేవునికి.”