సమూయేలు రెండో గ్రంథం 8:1-18

  • దావీదు విజయాలు (1-14)

  • దావీదు ప్రభుత్వ నిర్వహణ (15-18)

8  కొంతకాలం తర్వాత దావీదు ఫిలిష్తీయుల్ని ఓడించి,+ వాళ్లను లోబర్చుకున్నాడు; అతను ఫిలిష్తీయుల చేతుల్లో నుండి మెతెగమ్మాను స్వాధీనం చేసుకున్నాడు.  అతను మోయాబీయుల్ని ఓడించాడు,+ వాళ్లను నేలమీద పడుకోబెట్టి తాడుతో కొలిచాడు. వాళ్లలో రెండు వంతుల మందిని చంపడానికి, ఒక వంతు మందిని బ్రతకనివ్వడానికి అతను అలా చేశాడు.+ ఆ విధంగా మోయాబీయులు దావీదుకు సేవకులై, అతనికి కప్పం కట్టారు.+  దావీదు సోబా రాజూ రెహోబు కుమారుడూ అయిన హదదెజరును ఓడించాడు.+ హదదెజరు యూఫ్రటీసు నది ప్రాంతాన్ని తిరిగి తన అధీనంలోకి తెచ్చుకోవడానికి వెళ్తున్నప్పుడు దావీదు అతన్ని ఓడించాడు.+  దావీదు అతని దగ్గర నుండి 1,700 గుర్రపురౌతుల్ని, 20,000 మంది సైనికుల్ని పట్టుకున్నాడు. తర్వాత, రథాల్ని లాగే 100 గుర్రాల్ని తప్ప మిగతా వాటన్నిటినీ దావీదు కుంటివాటిగా చేశాడు.+  దమస్కుకు చెందిన సిరియన్లు సోబా రాజైన హదదెజరుకు సహాయం చేయడానికి వచ్చినప్పుడు, దావీదు 22,000 మంది సిరియన్లను చంపాడు.  తర్వాత దావీదు దమస్కుకు చెందిన సిరియాలో సైనిక స్థావరాల్ని ఏర్పాటు చేశాడు, సిరియన్లు దావీదుకు సేవకులై అతనికి కప్పం కట్టారు. దావీదు వెళ్లిన చోటల్లా యెహోవా అతనికి విజయాన్ని* ఇచ్చాడు.+  అంతేకాదు, దావీదు హదదెజరు సేవకుల దగ్గర నుండి బంగారంతో చేసిన గుండ్రటి డాళ్లను తీసుకొని వాటిని యెరూషలేముకు తెచ్చాడు.  హదదెజరు నగరాలైన బెతహు నుండి, బేరోతై నుండి దావీదు రాజు పెద్ద మొత్తంలో రాగిని తీసుకొచ్చాడు.  దావీదు హదదెజరు సైన్యాన్నంతటినీ ఓడించాడని హమాతు రాజైన తోయి విన్నాడు. 10  అతను దావీదు బాగోగుల గురించి అడగడానికి, శుభాకాంక్షలు చెప్పడానికి తన కుమారుడైన యోరామును దావీదు రాజు దగ్గరికి పంపించాడు; దావీదు హదదెజరుతో పోరాడి, అతన్ని ఓడించాడు కాబట్టి తోయి అలా చేశాడు (ఎందుకంటే హదదెజరుకు, తోయికి మధ్య చాలా యుద్ధాలు జరిగాయి); యోరాము వెండి, బంగారు, రాగి వస్తువుల్ని తీసుకొని దావీదు దగ్గరికి వచ్చాడు. 11  దావీదు తాను ఓడించిన దేశాలన్నిటిలో నుండి తీసుకొచ్చిన వెండిబంగారాలతో పాటు వాటిని కూడా యెహోవాకు ప్రతిష్ఠించాడు.*+ 12  దావీదు వాటిని సిరియా నుండి, మోయాబు నుండి, అలాగే అమ్మోనీయుల నుండి, ఫిలిష్తీయుల నుండి, అమాలేకీయుల+ నుండి, సోబా రాజూ రెహోబు కుమారుడూ అయిన హదదెజరు నుండి కొల్లగొట్టాడు. 13  అంతేకాదు, ఉప్పులోయలో 18,000 మంది ఎదోమీయుల్ని చంపి తిరిగొచ్చినప్పుడు దావీదుకు గొప్ప పేరు వచ్చింది.+ 14  అతను ఎదోములో సైనిక స్థావరాల్ని స్థాపించాడు. ఎదోము అంతటా అలా స్థాపించాడు, ఎదోమీయులందరూ అతనికి సేవకులయ్యారు.+ దావీదు వెళ్లిన చోటల్లా యెహోవా అతనికి విజయాన్ని* ఇచ్చాడు.+ 15  దావీదు ఇశ్రాయేలు అంతటిమీద పరిపాలిస్తూ+ తన ప్రజలందరికీ నీతిన్యాయాలు+ జరిగిస్తూ ఉన్నాడు.+ 16  సెరూయా కుమారుడైన యోవాబు+ సైన్యాధిపతిగా, అహీలూదు కుమారుడైన యెహోషాపాతు+ వివరాలు నమోదు చేసేవాడిగా ఉన్నాడు. 17  అహీటూబు కుమారుడైన సాదోకు,+ అబ్యాతారు కుమారుడైన అహీమెలెకు యాజకులుగా, శెరాయా కార్యదర్శిగా ఉన్నారు. 18  యెహోయాదా కుమారుడైన బెనాయా+ కెరేతీయుల మీద, పెలేతీయుల+ మీద అధికారిగా ఉన్నాడు. దావీదు కుమారులు ముఖ్య అధికారులు* అయ్యారు.

అధస్సూచీలు

లేదా “రక్షణను.”
లేదా “పవిత్రపర్చాడు.”
లేదా “రక్షణను.”
అక్ష., “యాజకులు.”