మన క్రైస్తవ జీవితం
ప్రేమను బట్టి నిజ క్రైస్తవులు గుర్తించబడతారు—స్వార్థాన్ని, కోపాన్ని విడిచిపెట్టండి
ఎందుకు ముఖ్యం: ప్రేమను బట్టి తన శిష్యులు గుర్తించబడతారని యేసు చెప్పాడు. (యోహా 13:34, 35) క్రీస్తులాంటి ప్రేమ చూపించాలంటే మనం వేరేవాళ్ల మేలు గురించి ఆలోచించాలి, కోప్పడకుండా జాగ్రత్తపడాలి.—1 కొరిం 13:5.
ఎలా చేయాలి:
-
వేరేవాళ్లు ఏదైనా బాధ కలిగించే మాట అన్నా లేదా అలాంటి పని చేసినా, ఒక్క నిమిషం ఆగి ఆ సమస్యకు కారణాన్ని ఆలోచించాలి, మీరు ఏదైనా చేసేముందు దానివల్ల వచ్చే పర్యవసానాల గురించి ఆలోచించాలి.—సామె 19:11
-
మనమందరం అపరిపూర్ణులం అని గుర్తు పెట్టుకోవాలి, కొన్నిసార్లు ఏదో ఒకటి అనేస్తాం లేదా చేసేస్తాం కానీ తర్వాత బాధపడతాం
-
మనస్పర్థల్ని వెంటనే పరిష్కరించుకోండి
‘ఒకనియెడల ఒకరు ప్రేమగలవారై ఉండండి’—స్వార్థాన్ని, కోపాన్ని విడిచిపెట్టండి అనే వీడియో చూసి తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:
-
హర్ష చెప్పిన సలహాకు రవి ఎలా తప్పుగా స్పందించాడు?
-
ఆలోచించడానికి ఆగడం వల్ల హర్ష కోపం చూపించకుండా ఎలా జాగ్రత్త పడగలిగాడు?
-
హర్ష నెమ్మదిగా ఇచ్చిన జవాబు పరిస్థితిని ఎలా సద్దుమణిగేలా చేసింది?