కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన క్రైస్తవ జీవితం

ప్రేమను బట్టి నిజ క్రైస్తవులు గుర్తించబడతారు​​—⁠సత్యమందు సంతోషించండి

ప్రేమను బట్టి నిజ క్రైస్తవులు గుర్తించబడతారు​​—⁠సత్యమందు సంతోషించండి

ఎందుకు ముఖ్యం: యేసును అనుకరిస్తూ, మనం దేవుని సంకల్పాల గురించిన సత్యానికి సాక్ష్యం ఇవ్వాలి. (యోహా 18:37) అబద్ధాలతో, అవినీతితో నిండిపోయిన లోకంలో జీవిస్తున్నప్పటికీ మనం సత్యాన్ని బట్టి సంతోషించాలి, సత్యమే మాట్లాడాలి, ఏవి సత్యమో వాటిపైనే దృష్టి పెట్టాలి.—1 కొరిం 13:6; ఫిలి 4:8.

ఎలా చేయాలి:

  • వేరేవాళ్లకు హానిచేసే పుకార్లు, అబద్ధాలు వ్యాప్తి చేయకుండా ఉండాలని నిర్ణయించుకోవాలి.—1 థెస్స 4:11

  • వేరేవాళ్లకు చెడు జరగడం చూసి సంతోషించకూడదు

  • మంచి విషయాలను, ప్రోత్సాహకరమైన విషయాలను ఇష్టపడాలి

‘ఒకనియెడల ఒకరు ప్రేమగలవారై ఉండండి’—దుర్నీతియందు కాక సత్యమందు సంతోషించండి అనే వీడియో చూసి ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:

  • దీపిక ఏ విధంగా అవినీతి విషయంలో సంతోషించింది?

  • దీపికతో మాట్లాడుతున్నప్పుడు ఆశ ఆ సంభాషణను ఎలా మంచి విషయాల వైపుకు నడిపించింది?

  • మనం మాట్లాడుకోగలిగిన మంచి విషయాలు కొన్ని ఏంటి?

అవినీతిని బట్టి కాక, సత్యాన్ని బట్టి సంతోషించండి