కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన క్రైస్తవ జీవితం

యౌవనులారా—యెహోవా మీకు బెస్ట్‌ ఫ్రెండ్‌గా ఉన్నాడా?

యౌవనులారా—యెహోవా మీకు బెస్ట్‌ ఫ్రెండ్‌గా ఉన్నాడా?

ఒక స్నేహితునిలో మీరు ఎలాంటి లక్షణాల కోసం చూస్తారు? బహుశా నమ్మకంగా, దయగా, ఉదారంగా ఉండేవాళ్లను మీరు ఇష్టపడుతుండవచ్చు. యెహోవా ఆ లక్షణాలన్నిటిని చూపిస్తాడు. (నిర్గ 34:6; అపొ 14:17) మీరు ప్రార్థన చేస్తే ఆయన వింటాడు. మీకు అవసరమైనప్పుడు సహాయం చేస్తాడు. (కీర్త 18:19, 35) మీ తప్పుల్ని క్షమిస్తాడు. (1యో 1:9) యెహోవా ఎంత మంచి స్నేహితుడో కదా!

యెహోవాకు స్నేహితులవ్వాలంటే మీరేం చేయాలి? ఆయన వాక్యాన్ని చదివి ఆయన గురించి తెలుసుకోండి. ప్రతీది ఆయనతో పంచుకోండి. (కీర్త 62:8; 142:2) యెహోవాకు ప్రాముఖ్యమైనవి, అంటే ఆయన కుమారుణ్ణి, ఆయన రాజ్యాన్ని, ఆయన చేసిన భవిష్యత్తు వాగ్దానాల్ని విలువైనవిగా ఎంచుతున్నారని చూపించండి. ఆయన గురించి ఇతరులకు చెప్పండి. (ద్వితీ 32:3) యెహోవాతో దగ్గరి స్నేహాన్ని పెంచుకుంటే, ఆయన ఎప్పటికీ మీకు స్నేహితునిగా ఉంటాడు.—కీర్త 73:25, 26, 28.

యౌవనులారా“యెహోవా మంచివాడని రుచిచూసి తెలుసుకోండి,” వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:

  • సమర్పణ, బాప్తిస్మానికి మీరు ఎలా సిద్ధపడవచ్చు?

  • యెహోవా సేవ చేయడానికి సంఘంలోని వాళ్లు మీకు ఎలా సహాయం చేయగలరు?

  • పరిచర్య యెహోవాతో మీకున్న సంబంధాన్ని ఎలా బలపరుస్తుంది?

  • యెహోవాతో స్నేహం ఎప్పటికీ ఉంటుంది!

    యెహోవా సేవలో మీరు ఎలాంటి నియామకాలు చేపట్టగలరు?

  • యెహోవాలో మీకు బాగా నచ్చేది ఏంటి?