మన క్రైస్తవ జీవితం
యెహోవాతో మీకున్న సంబంధాన్ని విలువైనదిగా ఎంచండి
యెహోవాసాక్షులుగా మనకు ఒక అమూల్యమైన అవకాశం ఉంది. సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకున్న క్రైస్తవులుగా మనం సర్వోన్నత ప్రభువైన యెహోవాతో వ్యక్తిగతంగా, దగ్గరి సంబంధాన్ని కలిగివున్నాం. ఆయన తన కుమారుని ద్వారా మనల్ని తన దగ్గరికి ఆకర్షించుకున్నాడు. (యోహా 6:44) ఆయన మన ప్రార్థనల్ని వింటున్నాడు.—కీర్త 34:15.
యెహోవాతో మనకున్న అమూల్యమైన సంబంధాన్ని ఎలా కాపాడుకోవచ్చు? ముఖ్యంగా ఇశ్రాయేలీయులు చేసినలాంటి తప్పుల్ని మనం చేయకుండా ఉండాలి. వాళ్లు యెహోవాతో ఒప్పందం చేసుకున్న కొన్నిరోజులకే, ఒక బంగారు దూడను తయారుచేసుకుని విగ్రహపూజ చేశారు. (నిర్గ 32:7, 8; 1కొ 10:7, 11, 14) మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవాలి: ‘ప్రలోభానికి గురైనప్పుడు నేనెలా స్పందిస్తున్నాను? యెహోవాతో ఉన్న సంబంధాన్ని నేను విలువైనదిగా ఎంచుతున్నానని నా పనుల్లో చూపిస్తున్నానా?’ మన పరలోక తండ్రి మీద మనకున్న ప్రగాఢమైన ప్రేమ, ఆయన అసహ్యించుకునే వాటికి దూరంగా పారిపోయేలా సహాయం చేస్తుంది.—కీర్త 97:10.
యెహోవాతో మీకున్న సంబంధాన్ని కాపాడుకోండి (కొలొ 3:5) వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:
-
దురాశ అంటే ఏంటి?
-
మనం అత్యాశకు, విగ్రహపూజకు ఎందుకు దూరంగా ఉండాలి?
-
వ్యభిచారానికి, విగ్రహపూజకు ఎలాంటి సంబంధం ఉంది?
-
ముఖ్యంగా దేవుని సంస్థలో బాధ్యతలు ఉన్నవాళ్లు, తమ వివాహజత అవసరాల్ని ఖచ్చితంగా ఎందుకు పట్టించుకోవాలి?