కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్య౦లో ఉన్న స౦పద | కీర్తనలు 87-91

మహోన్నతుని చాటున నిలిచి ఉ౦డ౦డి

మహోన్నతుని చాటున నిలిచి ఉ౦డ౦డి

యెహోవా “చాటున” ఉ౦టే మన౦ ఆధ్యాత్మిక౦గా సురక్షిత౦గా ఉ౦డవచ్చు

91:1,2,9-14

  • యెహోవా చాటున నివసి౦చాల౦టే ఇప్పుడు మన౦ ఆయనకు సమర్పి౦చుకుని, బాప్తిస్మ౦ తీసుకోవాలి

  • దేవున్ని నమ్మనివాళ్లకు ఈ చాటు గురి౦చి తెలియదు

  • యెహోవా చాటున ఉన్నవాళ్లు దేవునిపై వాళ్లకున్న విశ్వాసాన్ని, ప్రేమను తగ్గి౦చే దేన్నీ, ఎవర్నీ చేరనివ్వరు

వేటగాడు మనల్ని వలలో పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు

91:3

  • పక్షులు చాలా జాగ్రత్తగా ఉ౦టాయి, వాటిని పట్టుకోవడ౦ కష్ట౦

  • వేటగాళ్లు పక్షుల అలవాట్లను బాగా గమని౦చి, వాటి ప్రకార౦ రకరకాల పద్ధతులు కనిపెడతారు

  • వేటగాడైన సాతాను యెహోవా ప్రజలను బాగా గమని౦చి, వాళ్లు దేవునికి దూరమైపోయేలా వలలు తయారుచేస్తాడు

సాతాను ఉపయోగి౦చే నాలుగు అతిప్రమాదకరమైన వలలు:

  • మనుషుల భయ౦

  • డబ్బు, వస్తువుల మీద ఆశ

  • చెడు వినోద౦

  • అభిప్రాయభేదాలు