జీవితం, పరిచర్య మీటింగ్ వర్క్‌బుక్ ఆగస్టు 2018
ఇలా మాట్లాడవచ్చు
మన రోజుల్లో బైబిలు ఎలా ఉపయోగపడుతుందో తెలిపే వరుస నమూనా అందింపులు.
దేవుని వాక్యంలో ఉన్న సంపద
కృతజ్ఞత చూపించండి
క్రీస్తును సంతోషపెట్టాలని అనుకునేవాళ్లు జాతి, రంగు, మతం లాంటి తేడా లేకుండా అందరిని ప్రేమించాలి, అందరికి కృతజ్ఞత చూపించాలి.
మన క్రైస్తవ జీవితం
లోతు భార్యను గుర్తుచేసుకోండి
లోతు భార్యలా మనం దేవుని అనుగ్రహం కోల్పోకుండా ఉండాలంటే ఏమి చేయాలి? మన జీవితంలో వస్తుసంపదలు ఆధ్యాత్మిక విషయాలను పక్కకునెట్టేస్తున్నాయని గమనిస్తే అప్పుడు ఏం చేయాలి?
దేవుని వాక్యంలో ఉన్న సంపద
పది మినాల ఉదాహరణ నుండి నేర్చుకోండి
యేసు చెప్పిన పది మినాల ఉదాహరణలో యజమాని, దాసులు ఎవరిని సూచిస్తున్నారు? డబ్బులు దేన్ని సూచిస్తున్నాయి?
మన క్రైస్తవ జీవితం
పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—JW.ORG వెబ్‌సైట్‌ని బాగా తెలుసుకోండి
మనం బోధించడానికి ఉపయోగించే పనిముట్లలో ఉన్న ప్రతి ప్రచురణ jw.org వెబ్‌సైట్ గురించి చెప్తుంది. మనకు వెబ్‌సైట్ గురించి బాగా తెలిసి ఉంటే, పరిచర్యను ఇంకా నైపుణ్యవంతంగా చేయగలం.
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“మీ విడుదల దగ్గరపడుతోంది”
యేసు త్వరలోనే శిక్ష వేయడానికి, విడుదల తీసుకురావడానికి వస్తాడు. మనం ఆధ్యాత్మికంగా సిద్ధంగా ఉండాలి, అప్పుడు మనం విడుదల పొందుతాం.
దేవుని వాక్యంలో ఉన్న సంపద
ఇతరులను క్షమించడానికి సిద్ధంగా ఉండండి
యెహోవా, ఆయన కుమారుడు పాపులైన మనుషుల పట్ల దయ చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ల హృదయాల్లో ఏదైనా మార్పు వస్తుందేమోనని ఎదురు చూస్తారు.
మన క్రైస్తవ జీవితం
యేసు మీ సహోదరుని కోసం కూడా ప్రాణం ఇచ్చాడు
అపరిపూర్ణ మనుషుల కోసం యేసు తన ప్రాణాన్ని అర్పించాడు. మనలాగే అపరిపూర్ణులైన మన సహోదరసహోదరీలపట్ల క్రీస్తులాంటి ప్రేమను మనమెలా చూపించవచ్చు?