కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యంలో ఉన్న సంపద | లూకా 19-20

పది మినాల ఉదాహరణ నుండి నేర్చుకోండి

పది మినాల ఉదాహరణ నుండి నేర్చుకోండి

19:12-24

ఈ ఉదాహరణలో ఉన్న విషయాలన్నీ ఎవర్ని సూచిస్తున్నాయి? వేటిని సూచిస్తున్నాయి?

  1. యజమాని, యేసును సూచిస్తున్నాడు

  2. దాసులు, యేసు అభిషిక్త అనుచరులను సూచిస్తున్నారు

  3. దాసులకు యజమాని ఇచ్చిన డబ్బు, శిష్యులను చేసే విలువైన బాధ్యతను చూపిస్తుంది

క్రీస్తు అభిషిక్త శిష్యులు చెడ్డ దాసుని లక్షణాలను పెంచుకుంటే ఏమి జరుగుతుందో తెలియజేసే హెచ్చరిక ఈ ఉదాహరణలో ఉంది. ఎక్కువమంది శిష్యులను తయారు చేయడానికి యేసు శిష్యులు తమ శక్తిని, సమయాన్ని, వనరులను ఉపయోగించాలని ఆయన కోరుకుంటున్నాడు.

శిష్యులను చేసే పనిలో నేను నమ్మకమైన అభిషిక్త క్రైస్తవులను ఎలా అనుకరించగలను?