మన క్రైస్తవ జీవితం
పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—JW.ORG వెబ్‌సైట్‌ని బాగా తెలుసుకోండి
ఎందుకు ప్రాముఖ్యం: మనం బోధించడానికి ఉపయోగించే పనిముట్లలో ఉన్న ప్రతి ప్రచురణ jw.org వెబ్‌సైట్ గురించి చెప్తుంది. నిజం చెప్పాలంటే, ప్రజలను వెబ్‌సైట్ వైపుకు తీసుకువెళ్లడమే మన కాంటాక్ట్ కార్డుకి, అలాగే జీవితంలోని ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు ఎక్కడ దొరుకుతాయి? అనే కరపత్రానికి ఉన్న ముఖ్య ఉద్దేశం. మీరు jw.org వెబ్‌సైట్ ద్వారా మనం బోధించడానికి ఉపయోగించే పనిముట్లలో ఉన్న ప్రచురణల ఎలక్ట్రానిక్ కాపీలను ఈ-మెయిల్ ద్వారా ఎవరికైనా పంపించవచ్చు లేదా లింక్ షేర్ చేయవచ్చు. ముఖ్యంగా వేరే భాష మాట్లాడే వాళ్లకు సాక్ష్యం ఇస్తున్నప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇంకా, కొన్నిసార్లు ప్రజలు అడిగే ప్రశ్నలు మనం బోధించడానికి ఉపయోగించే పనిముట్లుగా వాడే ప్రచురణల్లో లేకపోవచ్చు. ఆ ప్రశ్నలకు జవాబులు వేరే ప్రచురణల్లో ఉండవచ్చు. మనకు వెబ్‌సైట్ గురించి బాగా తెలిసి ఉంటే, పరిచర్యను ఇంకా నైపుణ్యవంతంగా చేయగలం.
ఎలా చేయాలి:
-
“బైబిలు బోధలు” టాబ్ ఉపయోగించండి. పిల్లలను పెంచే విషయంలో ఎక్కువ సమాచారం తెలుసుకోవాలని అనుకున్న తల్లికి గానీ తండ్రికి గానీ మీరు సాక్ష్యం ఇస్తున్నారని అనుకోండి. అప్పుడు బైబిలు బోధలు > వివాహం, కుటుంబం చూడండి.
-
“ప్రచురణలు” టాబ్ ఉపయోగించండి. మీరు స్కూల్లో అనుకోకుండా సాక్ష్యం ఇస్తూ, మీ క్లాస్మేట్కి యువత అడిగే 10 ప్రశ్నలకు జవాబులు అనే బ్రోషుర్ షేర్ చేయాలని అనుకుంటున్నారు. అప్పుడు ప్రచురణలు > పుస్తకాలు & బ్రోషుర్లు చూడండి.
-
“మా గురించి” టాబ్ ఉపయోగించండి. మీరు మీ తోటి ఉద్యోగికి సాక్ష్యం ఇస్తున్నారు అనుకోండి, ఆయన మీ నమ్మకాల గురించి చదవాలని అనుకుంటున్నాడు. అప్పుడు మా గురించి > తరచూ అడిగే ప్రశ్నలు చూడండి.
JW.ORG వెబ్‌సైట్ గురించి బాగా తెలుసుకోండి అనే వీడియో చూసి, తర్వాత సహాయం కోసం వెబ్‌సైట్‌లో ఇంకా వేటిని ఉపయోగించాలో పరిశీలించండి:
-
దేవుడు ఉన్నాడని నమ్మని వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు
-
ఈ మధ్యనే విషాద సంఘటన జరిగి బాధలో ఉన్నవాళ్లతో మాట్లాడుతున్నప్పుడు
-
నిష్క్రియులుగా ఉన్న సహోదరునితో లేదా సహోదరితో మాట్లాడుతున్నప్పుడు
-
మన పనికి ఆర్థిక సహాయం ఎలా దొరుకుతుందని ప్రశ్నించిన ఆసక్తిగల వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు
-
వేరే దేశానికి చెందిన అతను తన స్వదేశంలో మీటింగ్స్‌కు వెళ్లాలని కోరుకుంటే