కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన క్రైస్తవ జీవితం

యేసు మీ సహోదరుని కోసం కూడా ప్రాణం ఇచ్చాడు

యేసు మీ సహోదరుని కోసం కూడా ప్రాణం ఇచ్చాడు

అపరిపూర్ణ మనుషుల కోసం యేసు తన ప్రాణాన్ని అర్పించాడు. (రోమా 5:8) యేసు మనకోసం ప్రాణం ఇవ్వడం ద్వారా తన ప్రేమను చూపించినందుకు ఖచ్చితంగా మనకు ఆయనపట్ల కృతజ్ఞత ఉంది. అయితే, యేసు మన సహోదరుని కోసం కూడా చనిపోయాడని మనకు మనం కొన్నిసార్లు గుర్తు చేసుకోవాల్సి రావచ్చు. మనలాగే అపరిపూర్ణులైన మన సహోదరసహోదరీలపట్ల క్రీస్తులాంటి ప్రేమను మనమెలా చూపించవచ్చు? మూడు విధానాలను చూద్దాం. మొదటిగా, ఇతర నేపథ్యాల నుండి వచ్చినవాళ్లను కూడా మన స్నేహితులుగా చేసుకోవచ్చు. (రోమా 15:7; 2 కొరిం 6:12, 13) రెండవదిగా, ఇతరుల్ని బాధపెట్టేలా మాట్లాడకుండా లేదా వాళ్ల మనసు నొప్పించే పనులు చేయకుండా జాగ్రత్తపడవచ్చు. (రోమా 14:13-15) చివరిగా, ఎవరైనా మనపట్ల తప్పు చేస్తే మనం త్వరగా వాళ్లను క్షమించడానికి ప్రయత్నించాలి. (లూకా 17:3, 4; 23:34) ఈ మూడు విధాలుగా మనం యేసును అనుకరించడానికి కృషి చేస్తే సంఘాన్ని శాంతి, ఐక్యతలతో యెహోవా ఆశీర్వదిస్తూ ఉంటాడు.

మీ అందాన్ని పెంచుకోండి! అనే వీడియో చూసి, కిందున్న ప్రశ్నలకు జవాబులు రాయండి:

  • మొదట్లో మిక్కీ తన సంఘం గురించి ఎలా భావించింది?

  • ఆమె అభిప్రాయాలు ఎందుకు మారాయి?

  • తన అభిప్రాయాన్ని సరిచేసుకోవడానికి యేసు ఉదాహరణ మిక్కీకి ఎలా సహాయం చేసింది? (మార్కు 14:38)

  • తోటి క్రైస్తవులను అనుకూల దృక్పథంతో చూడడానికి సామెతలు 19:11 మనకెలా సహాయం చేయగలదు?