మన క్రైస్తవ జీవితం
దేవుడు మర్చిపోని మంచి పనులు
యెహోవా ప్రజలు అందరూ దేవుని పవిత్ర సేవలో మంచి పనులు చేయగలరు. పిల్లల్ని ఎంతో ప్రేమించే తల్లిదండ్రులు వాళ్లు చేసే మంచి పనుల్ని ఎప్పటికీ మర్చిపోరు, అలానే యెహోవా కూడా మనం చేసే పనుల్ని, ఆయన పేరు కోసం మనం చూపించే ప్రేమను మర్చిపోడు. (మత్త 6:20; హెబ్రీ 6:10) నిజమే, మనందరి సామర్థ్యాలు, పరిస్థితులు వేరు, కానీ యెహోవా కోసం మనం మన శ్రేష్ఠమైనది ఇచ్చినప్పుడు సంతోషంగా ఉండవచ్చు. (గల 6:4; కొలొ 3:23) ఎన్నో సంవత్సరాలుగా, వేలమంది సహోదరసహోదరీలు బెతెల్లో సేవ చేశారు. మీరు బెతెల్ సేవ చేయగలరా? మీరు చేయలేకపోతే, వేరే ఎవరైనా బెతెల్ సేవ మొదలుపెట్టేలా మీరు ప్రోత్సహించగలరా, లేదా ఆ ప్రత్యేక సేవలో కొనసాగేలా మీరు ఎవరికైనా సహాయం చేయగలరా?
బెతెల్ సేవ చేయడానికి ముందుకు రండి వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:
-
మనం బెతెల్లో సేవ చేయడానికి ముఖ్యమైన కారణం ఏమై ఉండాలి?
-
బెతెల్లో సేవ చేయడం వల్ల వచ్చిన ఆశీర్వాదాల గురించి కొంతమంది ఏమన్నారు?
-
బెతెల్ సేవ చేయడానికి ఎలాంటి అర్హతలు ఉండాలి?
-
మీరు బెతెల్ సేవ కోసం అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి?