మన క్రైస్తవ జీవితం
మనం బోధించడానికి ఉపయోగించే పనిముట్లను నైపుణ్యంగా ఎలా ఉపయోగించాలి
శిష్యుల్ని చేయడం ఒక ఇల్లు కట్టడం లాంటిది. చక్కగా కట్టాలంటే మనం మన పరికరాలను చక్కగా ఉపయోగించడం నేర్చుకోవాలి. ముఖ్యంగా మన ముఖ్య పరికరమైన దేవుని వాక్యాన్ని నైపుణ్యవంతంగా ఉపయోగించడం నేర్చుకోవాలి. (2 తిమో 2:15) శిష్యులను చేయాలనే లక్ష్యంతో మనం బోధించడానికి ఉపయోగించే పనిముట్లలో ఉన్న ఇతర ప్రచురణలను, వీడియోలను కూడా చక్కగా ఉపయోగించుకోవాలి. *
మనం బోధించడానికి ఉపయోగించే పనిముట్లను చక్కగా వాడడానికి మనం ఇంకా ఏమి చేయవచ్చు? (1) మీ ఫీల్డ్ సర్వీస్ గ్రూప్ ఓవర్‌సీర్ సహాయం తీసుకోండి, (2) మంచి అనుభవం ఉన్న ప్రచారకునితో గానీ పయినీర్‌తో గానీ కలిసి పనిచేయండి, (3) ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఈ ప్రచురణలను మీరు చక్కగా ఉపయోగించడం నేర్చుకుంటే మీరు ఇప్పుడు జరుగుతున్న ఆధ్యాత్మిక నిర్మాణ పనిలో ఉన్న ఆనందాన్ని రుచి చూస్తారు.
పత్రికలు
బ్రోషుర్లు
పుస్తకాలు
కరపత్రాలు
వీడియోలు
ఆహ్వాన ప్రతులు
కాంటాక్ట్ కార్డులు
^ పేరా 3 మనం బోధించడానికి ఉపయోగించే పనిముట్లలో లేని కొన్ని ప్రచురణలు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నవాళ్లను దృష్టిలో ఉంచుకుని తయారుచేసినవి. వీటిని అవసరమైనప్పుడు వాడవచ్చు.