మన క్రైస్తవ జీవితం
ప్రకటించడం, బోధించడం—శిష్యులు చేయడానికి ఎంతో అవసరం
వెళ్లి శిష్యులను చేయమని యేసు తన అనుచరులకు ఆజ్ఞ ఇచ్చాడు. (మత్త 28:19) అందుకు ప్రకటించాలి మరియు బోధించాలి. ఎప్పటికప్పుడు మనం ఇలా ప్రశ్నించుకోవాలి, ‘శిష్యులను చేసే పనిలో ఉన్న ఈ ముఖ్యమైన అంశాల్లో నేను ఎలా మెరుగు అవ్వవచ్చు?’
ప్రకటించడం
ప్రజలు మన దగ్గరికి రావాలని ఎదురుచూసే బదులు మనమే చురుకుగా అర్హులైన వాళ్లకోసం వెదకడం మంచిది. (మత్త 10:11) మనం పరిచర్య చేస్తున్నప్పుడు మనం కలిసే వాళ్లతో మాట్లాడడానికి దొరికే అవకాశాల కోసం కనిపెట్టుకుని ఉంటున్నామా? (అపొ 17:17) అపొస్తలుడైన పౌలు శ్రద్ధగా పరిచర్య చేయడం వల్ల లూదియ అనే ఆమె శిష్యురాలు అయింది.—అపొ 16:13-15.
“మానకుండా” ప్రకటిస్తూ ఉండండి—అనియత సాక్ష్యంలో, ఇంటింటి పరిచర్యలో అనే వీడియో చూసి ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:
-
రోజూ చేసుకునే పనుల్లో శామ్యూల్ సత్యపు విత్తనాలు నాటడానికి చురుకుగా ప్రయత్నాలు చేస్తున్నాడని ఎలా చూపించాడు?
-
పరిచర్య చేసే అన్ని పద్ధతుల్ని మనం ఎందుకు మానకుండా చేస్తూ ఉండాలి?
-
మీరు రోజూ చేసుకునే పనుల్లో ఎవరికి రాజ్య సందేశాన్ని ప్రకటించవచ్చు?
బోధించడం
శిష్యుల్ని చేయడానికి మనం ప్రజలకు కేవలం ప్రచురణలు ఇచ్చి వచ్చేస్తే సరిపోదు. వాళ్లు ఆధ్యాత్మికంగా ప్రగతి సాధిస్తూ ఉండాలంటే మనం పునర్దర్శనాలు చేయాలి, బైబిలు స్టడీలు చేయాలి. (1 కొరిం 3:6-9) మనం ఎవరికైనా రాజ్య సత్యాలను నేర్పించడానికి చేసే ప్రయత్నాల వల్ల ఫలితాలు తక్కువగా ఉంటే ఏమి చేయాలి? (మత్త 13:19-22) “మంచినేల” లాంటి హృదయం ఉన్నవాళ్ల కోసం మనం మానకుండా వెదుకుతూనే ఉండాలి.—మత్త 13:23; అపొ 13:48.
“మానకుండా” ప్రకటిస్తూ ఉండండి—బహిరంగ సాక్ష్యంలో, శిష్యుల్ని చేయడంలో అనే వీడియోలు చూసి తర్వాత ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:
-
సొలమన్, మేరీ ఎలా ఆనంద్, అనిత హృదయాల్లో ఉన్న సత్యపు విత్తనాలకు నీళ్లు పోశారు?
-
బహిరంగ సాక్ష్యంతో పాటు పరిచర్య చేసే అన్ని రకాల పద్ధతుల్లో మన లక్ష్యం ఏమై ఉండాలి?
-
వేరేవాళ్లకు సత్యం నేర్పించడానికి మనం ఎక్కువ విలువ ఎలా ఇవ్వవచ్చు?