ఏప్రిల్ 1-7
1 కొరింథీయులు 7-9
పాట 136, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“పెళ్లి చేసుకోకుండా ఉండడం—ఒక బహుమానం”: (10 నిమి.)
1 కొరిం 7:32—పెళ్లికాని క్రైస్తవులు వివాహ జీవితానికి సంబంధించిన ఆందోళనలు ఏవీ లేకుండా యెహోవాను సేవించవచ్చు (w11 1/15 17-18 పేజీలు, 3వ పేరా)
1 కొరిం 7:33, 34—పెళ్లయిన క్రైస్తవులు ‘లోక సంబంధమైన విషయాల గురించి ఆలోచిస్తారు’ (w08 7/15 27వ పేజీ, 1వ పేరా)
1 కొరిం 7:37, 38—ఆధ్యాత్మిక లక్ష్యాల కోసం పెళ్లి చేసుకోకుండా ఉండిపోయే క్రైస్తవులు, పెళ్లయిన క్రైస్తవుల కన్నా “ఎక్కువ ప్రయోజనం పొందుతారు” (w96 10/15 12-13 పేజీలు, 14వ పేరా)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
1 కొరిం 7:11—ఎలాంటి పరిస్థితుల్లో ఒక క్రైస్తవుడు/క్రైస్తవురాలు తన వివాహజత నుండి విడిపోవచ్చు? (lvs-E 251వ పేజీ)
1 కొరిం 7:36—క్రైస్తవులు ‘యౌవనప్రాయం దాటిపోయాకే’ ఎందుకు పెళ్లి చేసుకోవాలి? (w00 7/15 31వ పేజీ, 3వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) 1 కొరిం 8:1-13 (5)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
చక్కగా చదువుదాం, బోధిద్దాం: (10 నిమి.) చర్చ. లేఖనాల్ని సరిగ్గా పరిచయం చేయడం వీడియో చూపించి, బోధిద్దాం బ్రోషురులో 4వ అధ్యాయాన్ని చర్చించండి.
ప్రసంగం: (5 నిమి. లేదా తక్కువ) w12 11/15 20వ పేజీ—అంశం: అవివాహితులుగా ఉండాలనుకునే వాళ్లు ఒంటరి జీవితమనే బహుమానాన్ని ఏదో అంతుచిక్కని రీతిలో పొందుతారా? (12)
మన క్రైస్తవ జీవితం
మీ ఒంటరి జీవితాన్ని చక్కగా ఉపయోగించుకోండి: (15 నిమి.) వీడియో చూపించండి. తర్వాత ఈ ప్రశ్నలు అడగండి: పెళ్లికాని చాలామంది క్రైస్తవులు ఎలాంటి సవాలును ఎదుర్కొంటున్నారు? (1 కొరిం 7:39) యెఫ్తా కూతురు ఎలా చక్కని ఆదర్శంగా ఉంది? యథార్థంగా ఉండేవాళ్లకు యెహోవా ఏం ఇస్తాడు? (కీర్త 84:11) సంఘంలోని వాళ్లు పెళ్లికాని వాళ్లను ఎలా ప్రోత్సహించవచ్చు? పెళ్లికాని క్రైస్తవులకు అందుబాటులో ఉన్న కొన్ని సేవావకాశాలు ఏంటి?
ముఖ్యమైన విషయాలు గుర్తుచేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 148, ప్రార్థన