కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన క్రైస్తవ జీవితం

జ్ఞాపకార్థ ఆచరణకు మీరెలా సిద్ధపడతారు?

జ్ఞాపకార్థ ఆచరణకు మీరెలా సిద్ధపడతారు?

ఈ సంవత్సరం నుండి, జ్ఞాపకార్థ ఆచరణకు సిద్ధపడడానికి మనకు ఎక్కువ సమయం ఉంటుంది. జ్ఞాపకార్థ ఆచరణ సోమవారం నుండి శుక్రవారం మధ్య వస్తే ఆ వారం క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్‌ ఉండదు. జ్ఞాపకార్థ ఆచరణ శనివారం లేదా ఆదివారం వస్తే ఆ వారం బహిరంగ ప్రసంగం, కావలికోట అధ్యయనం ఉండవు. ఈ అదనపు సమయాన్ని మీరు చక్కగా ఉపయోగించుకుంటారా? మొదటి శతాబ్దంలోలాగే, ఈ ప్రత్యేక సందర్భం కోసం కొన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. (లూకా 22:7-13; km 3/15 1వ పేజీ) అయితే మనమంతా మన హృదయాల్ని కూడా సిద్ధం చేసుకోవాలి. అదెలా చేయవచ్చు?

  • హాజరవ్వడం ఎందుకు ప్రాముఖ్యమో ఆలోచించండి.—1 కొరిం 11:23-26

  • యెహోవాతో మీకున్న సంబంధం గురించి ప్రార్థనాపూర్వకంగా ఆలోచించండి. —1 కొరిం 11:27-29; 2 కొరిం 13:5

  • జ్ఞాపకార్థ ఆచరణ ప్రాముఖ్యతను తెలియజేసే లేఖనాధారిత సమాచారాన్ని చదవండి, ధ్యానించండి.—యోహా 3:16; 15:13

కొందరు ప్రచారకులు ప్రతీరోజు లేఖనాలను పరిశోధిద్దాంలో ఉండే జ్ఞాపకార్థ ఆచరణ బైబిలు పఠనంలోని వచనాల్ని చదివి, ధ్యానిస్తారు. ఇంకొందరు ఇక్కడున్న చార్టులోని వచనాల్ని చదువుతారు. మరికొందరు కావలికోట పత్రికల్లో జ్ఞాపకార్థ ఆచరణ గురించి; యెహోవా, యేసు మనమీద చూపించిన ప్రేమ గురించి వచ్చిన సమాచారాన్ని పరిశీలిస్తారు. మీరు దేన్ని ఉపయోగించి అధ్యయనం చేసినా, అది మిమ్మల్ని యెహోవాకు, ఆయన కుమారునికి మరింత దగ్గర చేయాలని కోరుకుంటున్నాం.