కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన క్రైస్తవ జీవితం

నాకు అన్నిటికన్నా ముఖ్యమైంది ఏంటి?

నాకు అన్నిటికన్నా ముఖ్యమైంది ఏంటి?

యాకోబు చాలా ముఖ్యమైన దాని కోసం, అంటే యెహోవా దీవెన కోసం దేవదూతతో కుస్తీ పడ్డాడు. (ఆది 32:24-31; హోషే 12:3, 4) మరి మన సంగతేంటి? యెహోవాకు లోబడే విషయంలో, ఆయన దీవెన పొందే విషయంలో తీవ్రంగా కృషి చేయడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఉదాహరణకు, సంఘ కూటానికి వెళ్లాలా లేక ఉద్యోగంలో ఎక్కువ గంటలు పని చేయాలా అని నిర్ణయించుకోవాల్సి వస్తే, మనం ఏ నిర్ణయం తీసుకుంటాం? మన సమయం, శక్తి, వనరుల్లో శ్రేష్ఠమైనవి యెహోవాకు ఇస్తే “కొరత అనేదే లేకుండాపోయే వరకు” ఆయన మనపై దీవెనలు కుమ్మరిస్తాడు. (మలా 3:10) ఆయన మనల్ని నడిపిస్తాడు, కాపాడతాడు, మన అవసరాలు చూసుకుంటాడు.—మత్త 6:33; హెబ్రీ 13:5.

ఆధ్యాత్మిక లక్ష్యాల మీదే మనసుపెట్టండి వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:

  • తనకు బాగా ఇష్టమైన దాని నుండి ఒక సహోదరికి ఎలాంటి పరీక్ష ఎదురైంది?

  • ఉద్యోగం వల్ల మనకెలాంటి పరీక్ష ఎదురవ్వవచ్చు?

  • ఆధ్యాత్మిక పరిణతి సాధించిన తర్వాత కూడా తిమోతి ఎందుకు లక్ష్యాలు పెట్టుకుంటూ ఉండాలని పౌలు చెప్పాడు?—1తి 4:16

  • మీ జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైంది ఏంటి?

    మనకు అన్నిటికన్నా ముఖ్యమైన పని ఏదో ఎలా చూపిస్తాం?