మీరు దీవెన కోసం కుస్తీ పడుతున్నారా?
యెహోవా దీవెన పొందాలంటే, మన జీవితంలో రాజ్యానికి మొదటి స్థానం ఇవ్వడానికి తీవ్రంగా కృషి చేయాలి. (1కొ 9:26, 27) వృద్ధుడైన యాకోబు దేవదూతతో కుస్తీ పడ్డాడు. మనం యెహోవా సేవలో అతనిలాంటి స్ఫూర్తే చూపించాలి. మనం యెహోవా దీవెనను ఎంతగానో కోరుకుంటున్నామని ఇలా చూపించవచ్చు:
-
సంఘ కూటాలకు బాగా సిద్ధపడడం ద్వారా
-
పరిచర్యలో క్రమంగా పాల్గొనడం ద్వారా
-
సంఘంలో ఇతరులకు సహాయం చేయడానికి కృషి చేయడం ద్వారా
మీరు ఎలాంటి కష్టమైన పరిస్థితుల్లో ఉన్నా సహాయం కోసం యెహోవాకు ప్రార్థిస్తూ ఉండండి, ఆయన్ని సేవించడానికి మీరు పట్టుదలగా చేస్తున్న కృషిని దీవించమని అడగండి.
ఇలా ప్రశ్నించుకోండి, ‘నా జీవితంలో ఏయే విషయాల్లో నేను యెహోవా దీవెన కోసం ఇంకా ఎక్కువ కృషి చేయగలను?’