కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఏప్రిల్‌ 27–మే 3

ఆదికాండం 34-35

ఏప్రిల్‌ 27–మే 3
  • పాట 28, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • చెడు స్నేహం వల్ల వచ్చే చేదు పర్యవసానాలు”: (10 నిమి.)

    • ఆది 34:1—దీనా కనాను అమ్మాయిలతో సమయం గడపడానికి వెళ్తూ ఉండేది (w97 2/1 30వ పేజీ, 4వ పేరా)

    • ఆది 34:2—షెకెము దీనాను చెరిచాడు (lvs 124వ పేజీ, 14వ పేరా)

    • ఆది 34:7, 25—షెకెమును అలాగే అతని నగరంలో ఉన్న ప్రతీ పురుషుణ్ణి షిమ్యోను, లేవి చంపేశారు (w10 1/1 11వ పేజీ, 1-2 పేరాలు)

  • దేవుని వాక్యంలోని రత్నాలను త్రవ్వితీద్దాం: (10 నిమి.)

    • ఆది 35:8—దెబోరా ఎవరు? ఆమె నుండి మనమేం నేర్చుకోవచ్చు? (it-1-E 600వ పేజీ, 4వ పేరా)

    • ఆది 35:22-26—మెస్సీయకు పూర్వీకులు అయ్యే అవకాశం కేవలం జ్యేష్ఠ కుమారులకే దక్కలేదని ఎలా చెప్పవచ్చు? (w17.12 14)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) ఆది 34:1-19 (5)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • రెండవ రిటన్‌ విజిట్‌ వీడియో: (5 నిమి.) చర్చ. వీడియో చూపించండి. తర్వాత ప్రేక్షకుల్ని ఈ ప్రశ్నలు అడగండి: ఎల్సా ఇంటివ్యక్తి హృదయాన్ని చేరుకోవడానికి ఎలా కృషి చేసింది? మనం నేర్చుకోవచ్చు పుస్తకాన్ని ఉపయోగించి బైబిలు స్టడీ ఎలా మొదలుపెట్టవచ్చు?

  • రెండవ రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (13)

  • బైబిలు స్టడీ: (5 నిమి. లేదా తక్కువ) fg 4వ పాఠం, 6-7 పేరాలు (14)

మన క్రైస్తవ జీవితం