కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన క్రైస్తవ జీవితం

“అన్యదేవతల విగ్రహాల్ని తీసిపారేయండి”

“అన్యదేవతల విగ్రహాల్ని తీసిపారేయండి”

విగ్రహపూజ చేయకూడదనే ఆజ్ఞ అప్పటికింకా యెహోవా ఇవ్వకపోయినా, ఆయన సంపూర్ణ భక్తిని కోరే దేవుడని యాకోబు అర్థం చేసుకున్నాడు. (నిర్గ 20:3-5) అందుకే, యెహోవా అతన్ని బేతేలుకు తిరిగి వెళ్లమని చెప్పిన తర్వాత, యాకోబు తనతో ఉన్న వాళ్లందరితో విగ్రహాలు తీసిపారేయమని చెప్పాడు. అప్పుడు యాకోబు ఆ విగ్రహాల్ని, బహుశా తాయెత్తుల్లా ధరించిన చెవిపోగుల్ని పారేశాడు. (ఆది 35:1-4) యాకోబు చేసిన పనికి యెహోవా ఖచ్చితంగా సంతోషించివుంటాడు.

నేడు మనమెలా యెహోవాకు సంపూర్ణ భక్తిని ఇవ్వవచ్చు? మనం చేయాల్సిన ఒక ముఖ్యమైన పని, విగ్రహపూజకు లేదా మంత్రతంత్రాలకు సంబంధించిన ప్రతీదానికి దూరంగా ఉండడం. అంటే, మంత్రతంత్రాలకు సంబంధించిన వస్తువులన్నిటినీ పారేయాలి, అలాగే మన వినోదాన్ని జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఉదాహరణకు, ఇలా ప్రశ్నించుకోండి: ‘పిశాచాలు, భూతాలు, మానవాతీత శక్తులు వంటివి ఉన్న పుస్తకాల్ని లేదా సినిమాల్ని నేను ఆనందిస్తున్నానా? నేను చూసే వినోదంలో ఇంద్రజాలం, మంత్రం వేయడం, శాపం పెట్టడం వంటివాటిని కేవలం సరదా కోసం అన్నట్లు, వాటిలో ఏ హానీ లేదన్నట్లు చూపిస్తున్నారా?’ యెహోవా అసహ్యించుకునే ప్రతీదానికి మనం చాలా దూరంగా ఉండాలి.—కీర్త 97:10.

“అపవాదిని ఎదిరించండి” వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:

  • పలేస అనే బైబిలు విద్యార్థికి ఎలాంటి సమస్య వచ్చింది?

  • మంత్రతంత్రాల వల్ల సమస్య వస్తే, పెద్దల సహాయం తీసుకోవడం ఎందుకు తెలివైన పని?

  • అపవాదిని ఎదిరించండి, దేవునికి దగ్గరవ్వండి.—యాకో 4:7, 8

    మనకు యెహోవా కాపుదల కావాలంటే వేటిని వదిలించుకోవాలి?

  • పలేస ఎలాంటి చర్య తీసుకుంది?

  • మీరు ఉంటున్న ప్రాంతంలో, చెడ్డదూతల ప్రభావానికి దూరంగా ఉండడానికి ఏమేం చేయవచ్చు?