కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన క్రైస్తవ జీవితం

మీ వివాహబంధాన్ని కాపాడుకోండి

మీ వివాహబంధాన్ని కాపాడుకోండి

యెహోవా పెళ్లి ప్రమాణాల్ని చాలా ప్రాముఖ్యంగా ఎంచుతున్నాడు. భార్యాభర్తలు ఒకరినొకరు అంటిపెట్టుకొని ఉండాలని ఆయన చెప్పాడు. (మత్త 19:5, 6) దేవుని ప్రజల్లో సంతోషంగా ఉండే దంపతులు ఎంతోమంది ఉన్నారు. అయితే, భార్యాభర్తలు పరిపూర్ణులు కారు. కాబట్టి వాళ్లమధ్య అభిప్రాయభేదాలు వస్తాయి. అలాంటప్పుడు వేరైపోవడం, విడాకులు తీసుకోవడం మాత్రమే ఏకైక పరిష్కారమని ప్రజలు అనుకుంటున్నారు. కానీ ఆ ఆలోచన తప్పు. భార్యాభర్తలు తమ వివాహబంధాన్ని ఎలా కాపాడుకోవచ్చు?

అందుకోసం ఐదు ముఖ్యమైన పనులు చేయాలి.

  1. వివాహబంధాన్ని బలహీనపర్చే వాటికి దూరంగా ఉండడం ద్వారా మీ హృదయాన్ని కాపాడుకోండి. ఉదాహరణకు ఇతరులతో సరసాలాడడం, అనైతిక వినోదాన్ని చూడడం వంటివి చేయకండి.—మత్త 5:28; 2పే 2:14.

  2. దేవునితో మీకున్న స్నేహాన్ని బలపర్చుకోండి, భార్యాభర్తలుగా యెహోవాను సంతోషపెట్టాలనే కోరికను పెంచుకోండి.—కీర్త 97:10.

  3. కొత్త వ్యక్తిత్వాన్ని ధరించుకుంటూ ఉండండి; దయతో చిన్నచిన్న సహాయాలు చేస్తూ మీ వివాహజత పనుల్ని తేలిక చేయండి.—కొలొ 3:8-10, 12-14.

  4. ఒకరితోఒకరు ప్రతీరోజు గౌరవంగా, దాపరికం లేకుండా మాట్లాడుకోండి.—కొలొ 4:6.

  5. ఒకరి అవసరాల్ని మరొకరు ఆప్యాయంగా, ప్రేమగా తీర్చుకోండి.—1కొ 7:3, 4; 10:24.

క్రైస్తవులు వివాహబంధాన్ని ఘనమైనదిగా ఎంచడం ద్వారా వివాహాన్ని ఏర్పాటు చేసిన యెహోవాను ఘనపరుస్తారు.

‘ఓపిగ్గా పరుగెత్తండి’—పోటీలోని నియమాల్ని పాటిస్తూ వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:

  • పెళ్లయిన కొత్తలో అంతా బాగానే ఉన్నా, కాలం గడిచేకొద్దీ ఎలాంటి సవాళ్లు ఎదురుకావచ్చు?

  • తమ మధ్య ప్రేమ లేదని అనుకునే భార్యాభర్తలకు బైబిలు సూత్రాలు ఎలా సహాయం చేయగలవు?

  • బైబిలు సూత్రాలు పాటిస్తే వివాహ జీవితం సంతోషంగా ఉంటుంది

    భార్యాభర్తల నుండి యెహోవా ఏమి కోరుకుంటున్నాడు?

  • వివాహ జీవితం సంతోషంగా ఉండాలంటే, భార్యాభర్తలిద్దరూ ఏం చేయాలి?