కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన క్రైస్తవ జీవితం

ప్రతీ సంవత్సరం జరిగే సమావేశాలు—ప్రేమ చూపించడానికి అవకాశాలు

ప్రతీ సంవత్సరం జరిగే సమావేశాలు—ప్రేమ చూపించడానికి అవకాశాలు

ప్రతీ సంవత్సరం జరిగే సమావేశాలు మనకు ఎందుకు అంత ఆనందాన్నిస్తాయి? ప్రాచీన ఇశ్రాయేలులో జరిగినట్టే, నేడు మనకాలంలో జరిగే సమావేశాలు వందలమంది లేదా వేలమంది తోటి విశ్వాసులతో కలిసి యెహోవాను ఆరాధించే అవకాశాన్నిస్తాయి. యెహోవాకు దగ్గరయ్యేందుకు సహాయం చేసే సమాచారాన్ని మనం అక్కడ పొందుతాం. అంతేకాదు స్నేహితులతో, కుటుంబ సభ్యులతో కలిసి చక్కని సహవాసాన్ని ఆనందిస్తాం. కాబట్టి సమావేశానికి మూడు రోజులు హాజరవ్వాలని మనం కోరుకుంటాం.

అందర్నీ కలిసే ఇలాంటి అవకాశాలు దొరికినప్పుడు, అక్కడ మనం ఏం పొందుతామనే దానిగురించి మాత్రమే కాదు, ఇతరుల మీద మనమెలా ప్రేమ చూపించాలనే దానిగురించి కూడా ఆలోచించాలి. (గల 6:10; హెబ్రీ 10:24, 25) ఒక సహోదరుని కోసం గానీ, సహోదరి కోసం గానీ తలుపు తెరచి పట్టుకున్నప్పుడు, లేదా మనకు అవసరమైనన్ని సీట్లు మాత్రమే రిజర్వ్‌ చేసుకున్నప్పుడు మనకు ఇతరుల మీద శ్రద్ధ ఉందని చూపిస్తాం. (ఫిలి 2:3, 4) కొత్త స్నేహితుల్ని సంపాదించుకోవడానికి సమావేశాలు మంచి అవకాశాన్నిస్తాయి. కాబట్టి సమావేశానికి ముందు, సమావేశం తర్వాత, విరామ సమయంలో మనకు పరిచయంలేని వాళ్లతో మాట్లాడడానికి ప్రయత్నించవచ్చు. (2కొ 6:13) అక్కడ మనకు చిరకాల స్నేహితులు దొరుకుతారు. అన్నిటికన్నా ముఖ్యంగా మన నిజమైన ప్రేమను చూసినప్పుడు, ఇతరులు మనతో కలిసి యెహోవాను ఆరాధించాలని నిర్ణయించుకోవచ్చు.—యోహా 13:35.

“ప్రేమ శాశ్వతంగా ఉంటుంది”! అంతర్జాతీయ సమావేశాలు వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:

  • 2019 అంతర్జాతీయ సమావేశాలకు వచ్చిన వాళ్లపట్ల సహోదరసహోదరీలు ఎలా ప్రేమ చూపించారు?

  • యెహోవా ప్రజల మధ్య ఉన్న ఐక్యత, ప్రేమ ఎందుకంత ప్రత్యేకమైనది?

  • క్రైస్తవ ప్రేమలోని ఏ ముఖ్యమైన విషయాల గురించి పరిపాలక సభలోని సహోదరులు వివరించారు?

  • మన సమావేశాల్లో మీరెలా ప్రేమ చూపించవచ్చు?

    జర్మనీ, దక్షిణ కొరియాలోని క్రైస్తవులను ప్రేమ ఎలా ఐక్యం చేసింది?

  • మనం ఏమని నిర్ణయించుకోవాలి?