కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన క్రైస్తవ జీవితం

దేవుడు, క్రీస్తు భవిష్యత్తులో తీసుకొచ్చే విడుదల

దేవుడు, క్రీస్తు భవిష్యత్తులో తీసుకొచ్చే విడుదల

మీరు ప్రతీరోజు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఒక కుటుంబ పెద్దగా చాలా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారా? ఒంటరి తల్లిగా లేదా తండ్రిగా కుటుంబాన్ని పోషించడానికి కష్టపడుతున్నారా? మీరు స్కూలుకు వెళ్లే విద్యార్థి అయితే, తోటివాళ్లు మిమ్మల్ని ఏడిపిస్తున్నారా? వృద్ధులైతే, వయసు పెరగడం వల్ల వచ్చే సమస్యలతో లేదా అనారోగ్యంతో బాధపడుతున్నారా? ప్రతీఒక్కరికి సమస్యలు ఉన్నాయి. కొంతమంది క్రైస్తవులైతే, ఒకేసారి ఎన్నో రకాల సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. కానీ త్వరలో, ఈ సమస్యలన్నిటి నుండి యెహోవా విడుదల తీసుకొస్తాడని మనకు తెలుసు.—2కొ 4:16-18.

అప్పటివరకు, యెహోవా మన బాధలన్నిటినీ అర్థం చేసుకుంటాడని; మనం చూపించే విశ్వసనీయతను, సహనాన్ని విలువైనదిగా చూస్తాడనే విషయం నుండి ఓదార్పు పొందుదాం. భవిష్యత్తులో, ఆయన మనకు ఎన్నో దీవెనలు ఇస్తాడని గుర్తుంచుకుందాం. (యిర్మీ 29:11, 12) యేసుకు కూడా మనలో ప్రతీఒక్కరి మీద శ్రద్ధ ఉంది. క్రైస్తవులుగా మనకున్న బాధ్యతల్ని నిర్వహిస్తున్నప్పుడు, “నేను ఎప్పుడూ మీతో ఉంటాను” అని యేసు ఇచ్చిన హామీని మనసులో ఉంచుకుందాం. (మత్త 28:20) దేవుని రాజ్యంలో మనం పొందే విడుదల గురించి ధ్యానించినప్పుడు మన నిరీక్షణ బలపడుతుంది, ఇప్పుడున్న సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కొంటాం.—రోమా 8:19-21.

తుఫాను సమీపిస్తుండగా, యేసుపై మీ దృష్టిని నిలిపి ఉంచండి!—రానున్న రాజ్యాశీర్వాదాలు వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వండి:

  • మనుషులు దేవునికి ఎలా దూరమయ్యారు? దాని ఫలితం ఏంటి?

  • యెహోవాకు నమ్మకంగా ఉన్నవాళ్లు ఎలాంటి దీవెనలు పొందుతారు?

  • అలాంటి అద్భుతమైన భవిష్యత్తు ఎలా సాధ్యమైంది?

  • కొత్త లోకంలో పొందే ఏ ఆశీర్వాదాల కోసం మీరు ఎదురుచూస్తున్నారు?

మీరు కొత్త లోకంలో ఉన్నట్లు ఊహించుకోండి