మన క్రైస్తవ జీవితం
తల్లిదండ్రులారా, మీ పిల్లలు తెలుసుకోవాల్సిన విషయాల్ని వాళ్లకు నేర్పించండి
మనం జీవిస్తున్న ఈ లోకం మంచిని చెడుగా, చెడును మంచిగా చూపిస్తుంది. (యెష 5:20) విచారకరంగా, కొంతమంది యెహోవా అసహ్యించుకునే పనులు చేస్తున్నారు; ఆఖరికి పురుషులు పురుషులతో, స్త్రీలు స్త్రీలతో లైంగిక సంబంధం పెట్టుకుంటున్నారు. స్కూలుకు వెళ్లే మన పిల్లల్ని, తోటి విద్యార్థులు లేదా ఇతరులు తమలా ప్రవర్తించమని బలవంతపెట్టవచ్చు. వీటిని, ఇలాంటి వేరే ఒత్తిళ్లను తట్టుకునేలా మన పిల్లల్ని ఎలా సిద్ధం చేయవచ్చు?
మీ పిల్లలకు యెహోవా ప్రమాణాల్ని నేర్పించండి. (లేవీ 18:3) సెక్స్ గురించి బైబిలు ఏం చెప్తుందో వాళ్లకు మెల్లమెల్లగా తెలియజేయండి. అయితే దానిగురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ల వయసును మనసులో ఉంచుకుని, వాళ్లు అర్థంచేసుకోగలిగే విషయాలు చెప్పండి. (ద్వితీ 6:7) తల్లిదండ్రులారా, మీరిలా ప్రశ్నించుకోండి: ‘ప్రేమను చూపించే సరైన పద్ధతి గురించి, సరైన బట్టలు వేసుకోవడం గురించి, తమతో ఇతరులు ఎంతవరకు చనువుగా ఉండవచ్చు అనే దానిగురించి నా పిల్లలకు నేర్పించానా? ఒకవేళ ఎవరైనా అశ్లీల చిత్రాలు చూపించడానికి ప్రయత్నిస్తే లేదా యెహోవా అసహ్యించుకునే పనిచేయమని అడిగితే ఏం చేయాలో నా పిల్లలకు తెలుసా?’ పిల్లలకు వీటిగురించి ముందే చెప్తే, వాళ్లు చాలా సమస్యల్ని తప్పించుకోగలుగుతారు. (సామె 27:12; ప్రస 7:12) అలా నేర్పించడం ద్వారా యెహోవా మీకు ఆస్తిగా ఇచ్చిన పిల్లల మీద మీరు ప్రేమ చూపిస్తారు.—కీర్త 127:3.
ఎప్పటికీ నిలిచివుండే ఇంటిని నిర్మించుకోండి—మీ పిల్లల్ని ‘చెడ్డవాటి నుండి’ కాపాడండి వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వండి:
-
పిల్లలతో సెక్స్ గురించి మాట్లాడడానికి కొంతమంది ఎందుకు ఇబ్బందిపడతారు?
-
తల్లిదండ్రులు తమ పిల్లలకు “యెహోవా నిర్దేశాల ప్రకారం క్రమశిక్షణను, ఉపదేశాన్ని ఇస్తూ” ఎందుకు శిక్షణ ఇవ్వాలి?—ఎఫె 6:4
-
తల్లిదండ్రులు పిల్లలతో సెక్స్ గురించి మాట్లాడడానికి యెహోవా సంస్థ ఎలా సహాయం చేస్తోంది?—w19.05 12వ పేజీలోని బాక్సు
-
మీ పిల్లలు సమస్యల్లో చిక్కుకోకముందే, మీరు వాళ్లతో ఎందుకు క్రమంగా మాట్లాడుతూ ఉండాలి?