మన క్రైస్తవ జీవితం
యెహోవాను సేవించాలని నిర్ణయించుకోండి
మీరు బాప్తిస్మం తీసుకోని యౌవనులా? లేదా బైబిలు విద్యార్థులా? అయితే మీకు బాప్తిస్మం తీసుకోవాలనే లక్ష్యం ఉందా? ఇంతకీ, మీరు బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు? యెహోవాతో ఒక ప్రత్యేకమైన సంబంధం కలిగి ఉండడానికి సమర్పణ, బాప్తిస్మం సహాయం చేస్తాయి. (కీర్త 91:1) అంతేకాదు, రక్షణ పొందడానికి సహాయం చేస్తాయి. (1పే 3:21) మీరు బాప్తిస్మానికి అర్హులు కావాలంటే ఏం చేయవచ్చు?
ఇదే సత్యమని నమ్మకం కుదుర్చుకోండి. మీ సందేహాలను తీర్చుకోవడానికి పరిశోధన చేయండి. (రోమా 12:2) మీరు ఏ మార్పులు చేసుకోవాలో గుర్తించండి. ఆ మార్పులు చేసుకుంటున్నప్పుడు యెహోవాను సంతోషపెట్టడం మీ లక్ష్యమై ఉండాలి. (సామె 27:11; ఎఫె 4:23, 24) సహాయం కోసం ఆయనకు ప్రార్థిస్తూ ఉండండి. యెహోవా తన శక్తివంతమైన పవిత్రశక్తిని ఇచ్చి మిమ్మల్ని బలపరుస్తాడని, మీకు మద్దతిస్తాడని నమ్మండి. (1పే 5:10, 11) మీరు చేసే కృషి వృథా కాదు. యెహోవాను సేవించడం కన్నా శ్రేష్ఠమైన జీవితం మరొకటి లేదు!—కీర్త 16:11.
బాప్తిస్మానికి నడిపించే మార్గం వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వండి:
-
బాప్తిస్మం తీసుకోవడానికి కొంతమంది ఎలాంటి సవాళ్లను అధిగమించారు?
-
యెహోవాకు సమర్పించుకోవడానికి అవసరమైన విశ్వాసాన్ని మీరెలా పెంపొందించుకోవచ్చు?
-
బాప్తిస్మానికి అర్హత సాధించేలా కొంతమంది ఏం చేశారు?
-
యెహోవాను సేవించాలని నిర్ణయించుకునేవాళ్లు ఎలాంటి దీవెనలు పొందుతారు?
-
సమర్పించుకోవడం, బాప్తిస్మం తీసుకోవడం అంటే ఏంటి?