మన క్రైస్తవ జీవితం
అందరికీ ప్రకటించేలా క్రమపద్ధతిలో నడిపించబడుతున్నాం
యెహోవా ఇశ్రాయేలీయుల్ని ఒక క్రమపద్ధతిలో నడిపించాడు. నేడు కూడా ఆయన సేవకులు తన ఇష్టాన్ని నెరవేర్చేలా వాళ్లను క్రమపద్ధతిలో నడిపిస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్రాంచి కార్యాలయాలు, సర్క్యూట్‌లు, సంఘాలు, క్షేత్రసేవా గుంపులు కలిసి పనిచేస్తూ ప్రకటనా పనిని ముందుకు తీసుకెళ్తున్నాయి. మనం మంచివార్త ప్రకటించే ప్రజల్లో వేరే భాష మాట్లాడేవాళ్లు కూడా ఉన్నారు.—ప్రక 14:6, 7.
కాబట్టి వేరే భాష నేర్చుకుని అలాంటివాళ్లకు సత్యం నేర్పించాలని మీరెప్పుడైనా అనుకున్నారా? వేరే భాష నేర్చుకునేంత సమయం మీకు లేకపోయినా, JW లాంగ్వేజ్ యాప్‌ను ఉపయోగించి ఒక చిన్న అందింపును నేర్చుకోవచ్చు. మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు “దేవుని శక్తివంతమైన కార్యాల గురించి” వేరే భాషలో ప్రకటించినప్పుడు, ఆ భాష మాట్లాడే ప్రజలు ఆశ్చర్యంలో మునిగిపోయారు. అది చూసి ఆ క్రైస్తవులు చాలా సంతోషించారు. అదేవిధంగా, మీరు నేర్చుకున్న అందింపును ఉపయోగించి పరిచర్యలో మాట్లాడినప్పుడు, మీరు కూడా చాలా సంతోషిస్తారు.—అపొ 2:7-11.
యెహోవా స్నేహితులవ్వండి—వేరే భాష మాట్లాడే వాళ్లకు ప్రీచింగ్ చేయండి వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వండి:
-
JW లాంగ్వేజ్ యాప్‌ను మీరు ఎప్పుడు ఉపయోగించవచ్చు?
-
ఆ యాప్‌లో ఏమేం ఉంటాయి?
-
మీ ప్రాంతంలోని ప్రజలు ఏయే భాషలు మాట్లాడతారు?
-
వేరే భాష మాట్లాడేవాళ్లు ఎవరైనా మంచివార్త పట్ల ఆసక్తి చూపిస్తే మీరేం చేయాలి? —od 100-101 పేజీలు, 39-41 పేరాలు