కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన క్రైస్తవ జీవితం

యెహోవా విశ్వసనీయ ప్రేమ మీద నమ్మకం ఉంచండి

యెహోవా విశ్వసనీయ ప్రేమ మీద నమ్మకం ఉంచండి

యెహోవా మిమ్మల్ని అమూల్యంగా చూస్తాడు. (యెష 43:4) ఆయన మిమ్మల్ని తన వైపు, తన సంస్థ వైపు ఆకర్షించుకున్నాడు. మీరు సమర్పించుకుని బాప్తిస్మం తీసుకున్నారు కాబట్టి యెహోవాకు చెందినవాళ్లు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా తన ప్రత్యేక సొత్తుగా యెహోవా మిమ్మల్ని పట్టించుకుంటాడు. ఆయన తన సంస్థ ద్వారా మీమీద విశ్వసనీయ ప్రేమ చూపిస్తాడు.—కీర్త 25:10.

ఈ మధ్యకాలంలో వచ్చిన ప్రకృతి విపత్తులకు తన సంస్థ స్పందించిన విధానం గురించి ఆలోచించినప్పుడు యెహోవా విశ్వసనీయ ప్రేమ మీద మన కృతజ్ఞత పెంచుకోగలుగుతాం.

2019 కో-ఆర్డినేటర్స్‌ కమిటీ రిపోర్టు వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:

  • విపత్తులు వచ్చినప్పుడు చర్య తీసుకోవడానికి కో-ఆర్డినేటర్స్‌ కమిటీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్రాంచి కార్యాలయాలు ఎలా సహాయం చేశాయి?

  • ఇండోనేషియాలో, నైజీరియాలో యెహోవా తన సంస్థ ద్వారా నిర్దేశాన్ని, విపత్తు జరిగినప్పుడు సహాయాన్ని ఎలా అందించాడు?

  • కోవిడ్‌ విషయంలో సంస్థ స్పందించిన విధానంలో మీకు నచ్చిన విషయం ఏంటి?