మన క్రైస్తవ జీవితం
యౌవనులారా—మీ తల్లిదండ్రులతో మనసువిప్పి మాట్లాడండి
మీ తల్లిదండ్రులతో మనసువిప్పి మాట్లాడడానికి మీరెందుకు ప్రయత్నించాలి? (సామె 23:26) మీ మీద శ్రద్ధ చూపించడానికి, మిమ్మల్ని నడిపించడానికి యెహోవా వాళ్లకు బాధ్యతను ఇచ్చాడు. (కీర్త 127:3, 4) మీరు వేటి గురించి ఆలోచిస్తున్నారో, వేటి గురించి బాధపడుతున్నారో మీ తల్లిదండ్రులకు చెప్పకుండా దాచిపెడితే వాళ్లు మీకు సహాయం చేయడం కష్టమౌతుంది. అలాచేస్తే వాళ్ల అనుభవం నుండి ఇచ్చే సలహాలు కూడా మీరు పొందలేరు. అంటే దానర్థం కొన్ని విషయాలు మీ దగ్గరే దాచుకోవడం తప్పా? కాదు. కానీ జాగ్రత్త, మీ తల్లిదండ్రులు మీ మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోండి. వాళ్లను మోసం చేయకండి.—సామె 3:32.
మీ తల్లిదండ్రులతో ఎలా మాట్లాడవచ్చు? వాళ్లకు, మీకు అనుకూలంగా ఉన్న సమయం ఎంచుకోండి. ఒకవేళ కష్టంగా ఉంటే మీరు ఏం అనుకుంటున్నారో ఒక లెటర్‌లో రాసి ఇద్దర్లో ఎవరికైనా ఇవ్వండి. మీకు నచ్చని ఒక విషయం గురించి వాళ్లు మీతో మాట్లాడుతుంటే అప్పుడేంటి? వాళ్లు మీకు సహాయం చేయాలనుకుంటున్నారని గుర్తుంచుకోండి. వాళ్లను శత్రువులుగా కాదు స్నేహితులుగా చూడండి. మీ తల్లిదండ్రులతో మనసువిప్పి మాట్లాడడానికి ప్రయత్నిస్తే మీరు జీవితాంతం సంతోషంగా ఉంటారు, శాశ్వత జీవితాన్ని పొందుతారు!—సామె 4:10-12.
టీనేజ్‌లో నా జీవితం—అమ్మానాన్నలతో నేనెలా మాట్లాడొచ్చు? వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:
-
ఎస్తేర్, పార్థీక్ ఏం చేయాలని తెలుసుకున్నారు?
-
యేసు ఉదాహరణ నుండి మీరేం నేర్చుకోవచ్చు?
-
మీ మీద శ్రద్ధ ఉందని మీ తల్లిదండ్రులు ఎలా చూపించారు?
-
అమ్మానాన్నలతో మాట్లాడడానికి మీకు ఏ బైబిలు సూత్రాలు సహాయం చేస్తాయి?