మన క్రైస్తవ జీవితం
దేవుని వాక్యం మీద మీ విశ్వాసాన్ని పెంచుకోండి
దేవుని వాక్యం మన జీవితాల్ని మార్చగలదు. (హెబ్రీ 4:12) అయితే అందులో ఉన్న నిర్దేశాల నుండి సలహాల నుండి ప్రయోజనం పొందాలంటే, అది నిజంగా “దేవుని వాక్యం” అని మనకు నమ్మకం కుదరాలి. (1థె 2:13) మరి బైబిలు మీద మన విశ్వాసాన్ని ఎలా పెంచుకోవచ్చు?
ప్రతీరోజు బైబిల్లోని కొంత భాగాన్ని చదవండి. అలా చదువుతున్నప్పుడు, యెహోవాయే దాన్ని రాయించాడు అనడానికి రుజువులు ఏమైనా ఉన్నాయో చూడండి. ఉదాహరణకు సామెతలు పుస్తకంలో ఉన్న సలహాల్ని పరిశీలించండి. అందులో ఉన్న తెలివైన సలహాలు ఇప్పటికీ ఎంత బాగా ఉపయోగపడుతున్నాయో ఆలోచించండి.—సామె 13:20; 14:30.
వ్యక్తిగత అధ్యయన ప్రాజెక్ట్ మొదలుపెట్టండి. బైబిల్ని దేవుడే రాయించాడు అనడానికి గల రుజువుల్ని బాగా తెలుసుకోండి. దానికోసం యెహోవాసాక్షుల పరిశోధనా పుస్తకంలో “బైబిలు” అనే అంశంలో “దైవ ప్రేరేపితం” కింద ఉన్న సమాచారాన్ని చూడండి. అలాగే బైబిల్లో ఉన్న సందేశం మారలేదనే మీ విశ్వాసం పెంచుకోవడానికి, కొత్త లోక అనువాదం బైబిల్లో అనుబంధం A3 లో ఉన్న సమాచారాన్ని పరిశీలించండి.
మనం వీటిపై ఎందుకు విశ్వాసం కలిగివున్నాం . . . దేవుని వాక్యంపై వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:
-
ఐగుప్తులో కార్నక్ దగ్గర కనుగొన్న దేవాలయ గోడ, దేవుని వాక్యం నమ్మదగినదని ఎలా రుజువు చేస్తుంది?
-
బైబిల్లో ఉన్న సందేశం మారలేదని మనం ఎలా చెప్పవచ్చు?
-
బైబిలు చెక్కుచెదరకుండా మనకాలం వరకు వచ్చింది. ఆ విషయం బైబిలు దేవుని వాక్యమని ఎలా రుజువు చేస్తుంది? —యెషయా 40:8 చదవండి