కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన క్రైస్తవ జీవితం

ఆరోగ్యం విషయంలో అత్యవసర పరిస్థితి రాకముందే సిద్ధపడండి

ఆరోగ్యం విషయంలో అత్యవసర పరిస్థితి రాకముందే సిద్ధపడండి

ఎందుకు సిద్ధపడాలి? మన ఆరోగ్యం విషయంలో ఉన్నట్టుండి అత్యవసర పరిస్థితి వచ్చి, మనం హాస్పిటల్‌లో అడ్మిట్‌ అవ్వాల్సి రావచ్చు. కాబట్టి మీకు అందుబాటులో ఉన్న సమాచారం అంతా ముందే పరిశీలించండి. అలా సిద్ధపడితే, అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు మంచి చికిత్స పొందగలుగుతారు. ఆ విధంగా మీకు జీవం పట్ల, రక్తం విషయంలో యెహోవా పెట్టిన నియమం పట్ల గౌరవం ఉందని చూపిస్తారు.—అపొ 15:28, 29.

సిద్ధపడడానికి మీరు ఏం చేయవచ్చు?

  • అడ్వాన్స్‌ హెల్త్‌ కేర్‌ డైరెక్టివ్‌ కార్డును ప్రార్థన చేసి, జాగ్రత్తగా నింపండి. a బాప్తిస్మం తీసుకున్న ప్రచారకులు లిటరేచర్‌ సర్వెంట్‌ను అడిగి ఈ కార్డును తీసుకోవచ్చు. మైనర్‌ పిల్లల కోసం ఐడెంటిటీ కార్డు (ic) అడిగి తీసుకోవచ్చు

  • మీరు గర్భిణి స్త్రీ అయితే, మీ పెద్దల్ని అడిగి ఇన్ఫర్మేషన్‌ ఫర్‌ ఎక్స్‌పెక్టెంట్‌ మదర్స్‌ (S-401) అనే డాక్యుమెంట్‌ తీసుకోండి. కడుపుతో ఉన్నప్పుడు, అలాగే ప్రసవ సమయంలో ఎదురవ్వగల వైద్యపరమైన సమస్యలకు సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి, ఈ డాక్యుమెంట్‌లో ఉన్న విషయాలు మీకు సహాయం చేస్తాయి

  • మీరు హాస్పిటల్‌లో అడ్మిట్‌ అవ్వాల్సి వస్తే లేదా రక్తానికి సంబంధించిన చికిత్స ఇవ్వాల్సి వస్తుందని డాక్టర్లు చెప్తే, మీ పరిస్థితి గురించి పెద్దలకు ముందే చెప్పండి. అలాగే యెహోవాసాక్షుల తరఫున ఒక వ్యక్తి మీ కోసం వస్తారని హాస్పిటల్‌ సిబ్బందికి చెప్పండి

పెద్దలు ఎలా సహాయం చేస్తారు? అడ్వాన్స్‌ హెల్త్‌ కేర్‌ డైరెక్టివ్‌ కార్డును నింపడానికి వాళ్లు మీకు సహాయం చేస్తారు. అయితే మీ చికిత్సకు సంబంధించిన విషయంలో మీ బదులు వాళ్లు నిర్ణయాలు తీసుకోరు, లేదా వ్యక్తిగతంగా తీసుకునే నిర్ణయాల గురించి తమ సొంత అభిప్రాయాలు చెప్పరు. (రోమా 14:12; గల 6:5) రక్తానికి సంబంధించిన చికిత్స ఇవ్వాల్సి రావచ్చని డాక్టర్లు అన్నప్పుడు, ఆ విషయాన్ని మీరు మీ పెద్దలకు చెప్పిన వెంటనే, వాళ్లు మీ తరఫున ఆసుపత్రి అనుసంధాన కమిటీతో మాట్లాడతారు.

ఆసుపత్రి అనుసంధాన కమిటీ ఎలా సహాయం చేస్తుంది? రక్తం విషయంలో మన నమ్మకాల్ని వైద్య పరమైన, చట్ట పరమైన విభాగాల్లో పనిచేస్తున్న వాళ్లకు వివరించడానికి కావల్సిన శిక్షణను, ఈ కమిటీలో సేవచేస్తున్న సహోదరులకు సంస్థ అందిస్తుంది. రక్తం ఎక్కించకుండా చేసే చికిత్సల గురించి వాళ్లు మీ డాక్టర్‌తో మాట్లాడతారు. అవసరమైతే, మన నమ్మకాలకు తగ్గట్టు చికిత్స చేసే డాక్టర్ల గురించి మీకు చెప్తారు.

రక్తాన్ని ఉపయోగించే వైద్య విధానాలకు సంబంధించి ఎలా నిర్ణయాలు తీసుకోవచ్చు? వీడియో చూసి, ఈ ప్రశ్నకు జవాబు చెప్పండి:

  • రక్తానికి సంబంధించిన అత్యవసర వైద్య పరిస్థితులకు ముందే సిద్ధపడడం గురించి, మీరు ఈ వీడియోలో ఏం నేర్చుకున్నారు?

a రక్తానికి సంబంధించిన చికిత్సల గురించి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! పుస్తకంలో 39వ పాఠం చూడండి.