మన క్రైస్తవ జీవితం
కష్టాల్లో యెహోవా మనకు సహాయం చేస్తాడు
ఈ చివరి రోజుల్లో మనకు తీవ్రమైన కష్టాలు వస్తుంటాయి. కొన్నిసార్లు, కష్టాల్ని భరించడం ఇక మనవల్ల కాదు అనిపించవచ్చు. అయితే, యెహోవాకు దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉంటే, గుండె బద్దలైపోయే లాంటి కష్టాలు వచ్చినాసరే, వాటిని సహించడానికి ఆయన మనకు సహాయం చేస్తాడు. (యెష 43:2, 4) కష్టాల్లో ఉన్నప్పుడు మనం యెహోవాకు ఇంకా ఎలా దగ్గరవ్వవచ్చు?
ప్రార్థన. యెహోవా ముందు మన హృదయాన్ని కుమ్మరించినప్పుడు, సహించడానికి కావల్సిన మనశ్శాంతిని, ధైర్యాన్ని ఆయన ఇస్తాడు.—ఫిలి 4:6, 7; 1థె 5:17.
మీటింగ్స్. మీటింగ్స్ ద్వారా యెహోవా ఇచ్చే ఆధ్యాత్మిక ఆహారం, సహోదర సహోదరీల సహవాసం ముందెప్పటికన్నా ఇప్పుడు మనకు ఇంకా ఎక్కువ అవసరం. (హెబ్రీ 10:24, 25) కాబట్టి మనం మీటింగ్స్‌కి సిద్ధపడి వెళ్లినప్పుడు, మీటింగ్స్‌లో చక్కగా పాల్గొన్నప్పుడు యెహోవా ఇచ్చే పవిత్రశక్తిని పూర్తిగా ఉపయోగించుకుంటాం.—ప్రక 2:29.
పరిచర్య. మనం పరిచర్యలో బిజీగా ఉండడానికి చేయగలిగినదంతా చేస్తే, మంచి విషయాల గురించి ఆలోచించడం తేలికౌతుంది. అలాగే మన తోటి పనివాళ్లయిన సహోదర సహోదరీలతో, యెహోవాతో మన స్నేహం ఇంకా బలపడుతుంది. —1కొ 3:5-10.
యెహోవా మిమ్మల్ని అక్కున చేర్చుకున్నాడు వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:
-
కష్టాలు ఎదురైనప్పుడు, యెహోవాకు దగ్గరగా ఉండడానికి మెలు మార్క్ అనే సహోదరికి ఏది సహాయం చేసింది?
-
కీర్తన 34:18 లో ఉన్న మాటలు, మనకు కూడా కష్టాల్లో ఎలా ఓదార్పును ఇస్తాయి?
-
కష్టాల్లో యెహోవా మనకు “అసాధారణ శక్తిని” ఇస్తాడని ఈ సహోదరి అనుభవాన్ని బట్టి ఎలా చెప్పవచ్చు?—2కొ 4:7