కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన క్రైస్తవ జీవితం

జ్ఞాపకార్థ ఆచరణ సమయం దగ్గరపడుతోంది, ఇప్పుడే లక్ష్యాలు పెట్టుకోండి

జ్ఞాపకార్థ ఆచరణ సమయం దగ్గరపడుతోంది, ఇప్పుడే లక్ష్యాలు పెట్టుకోండి

ప్రతీ సంవత్సరం, యెహోవా ప్రజలు జ్ఞాపకార్థ ఆచరణను జరుపుకోవడానికి ఎంతో ఎదురుచూస్తారు. విమోచన క్రయధనం అనే బహుమతి ఇచ్చినందుకు యెహోవాను స్తుతించాలని, ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలని మనం కోరుకుంటాం. కాబట్టి జ్ఞాపకార్థ ఆచరణ ముందు, ఆ తర్వాతి వారాల్లో మనకు అందుబాటులో ఉండే ప్రత్యేక అవకాశాల్ని చక్కగా ఉపయోగించుకుంటాం. (ఎఫె 1:3, 7) ఉదాహరణకు, జ్ఞాపకార్థ ఆచరణకు ఇతరుల్ని ఆహ్వానించడానికి మనం బాగా కృషి చేస్తాం. కొంతమంది సర్దుబాట్లు చేసుకుని మార్చి, ఏప్రిల్‌ నెలల్లో 30 లేదా 50 గంటల లక్ష్యంతో సహాయ పయినీరు సేవ చేస్తారు. జ్ఞాపకార్థ ఆచరణ సమయంలో, మీరు పరిచర్య ఇంకా ఎక్కువ చేయాలనుకుంటున్నారా? మరి అలా చేయడానికి మీకు ఏది సహాయం చేస్తుంది?

ముందే ప్రణాళిక వేసుకున్నప్పుడు మనం ఇంకా ఎక్కువ పరిచర్య చేయగలుగుతాం. (సామె 21:5) జ్ఞాపకార్థ ఆచరణ సమయం దగ్గరపడుతోంది కాబట్టి, మీరు ఇప్పుడే ప్రణాళిక వేసుకోండి. పరిచర్య విషయంలో ఏ లక్ష్యాలు పెట్టుకోవాలని అనుకుంటున్నారో ఆలోచించండి. ఆ లక్ష్యాల్ని చేరుకోవడానికి ఏం చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి. తర్వాత, మీ ప్రయత్నాల్ని దీవించమని యెహోవాను అడగండి.—1యో 5:14, 15.

జ్ఞాపకార్థ ఆచరణ సమయంలో పరిచర్యను ఇంకా ఎక్కువ చేయడానికి మీరు ఏ లక్ష్యాలు పెట్టుకోవాలని అనుకుంటున్నారు?