కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన క్రైస్తవ జీవితం

దేవుని ఆలోచనల్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి

దేవుని ఆలోచనల్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి

మనం చేసే వాటన్నిటినీ చూసి యెహోవా సంతోషించాలని మనం కోరుకుంటాం. (సామె 27:11) అందుకోసం, సూటైన నియమం లేనప్పుడు కూడా ఆయన ఆలోచనలకు తగ్గట్టు మనం నిర్ణయాలు తీసుకోవాలి. అలా చేయడానికి మనకు ఏది సహాయం చేస్తుంది?

క్రమంగా బైబిల్ని అధ్యయనం చేస్తూ ఉండండి. మనం బైబిలు చదివినప్పుడల్లా, ఒకవిధంగా యెహోవాతో సమయం గడుపుతున్నట్టే. బైబిలు చదువుతున్నప్పుడు, యెహోవా తన ప్రజలతో ఎలా ప్రవర్తించాడో గమనించండి. అలాగే ఆయన దృష్టిలో మంచిపనులు లేదా చెడ్డ పనులు చేసిన వాళ్ల ఉదాహరణల్ని పరిశీలించండి. అప్పుడు యెహోవా ఆలోచన ఏంటో మనం బాగా అర్థం చేసుకోగలుగుతాం. ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు, బైబిలు నుండి మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయాలు, సూత్రాలు గుర్తుకు వచ్చేలా పవిత్రశక్తి సహాయం చేస్తుంది.—యోహా 14:26.

పరిశోధన చేయండి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఈ ప్రశ్న వేసుకోండి: ‘ఈ విషయంలో యెహోవా ఆలోచన ఏంటో తెలుసుకోవడానికి బైబిల్లోని ఏ వచనాలు లేదా ఏ ఉదాహరణలు నాకు సహాయం చేస్తాయి?’ యెహోవా సహాయం కోసం ప్రార్థించండి. మీ భాషలో ఉన్న పరిశోధనా పనిముట్లను ఉపయోగించి, మీ పరిస్థితికి సరిపోయే బైబిలు సూత్రాల్ని వెతికి, వాటిని పాటించండి.—కీర్త 25:4.

‘ఓపిగ్గా పరుగెత్తండి’—పౌష్ఠిక ఆహారం తీసుకుంటూ వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:

  • వీడియోలో ఉన్న యౌవన సహోదరి ఏ ఒత్తిళ్లను ఎదుర్కొంది?

  • అలాంటి ఒత్తిళ్లే మీకు ఎదురైతే, పరిశోధనా పనిముట్లను ఎలా ఉపయోగిస్తారు?

  • ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు సమయం తీసుకుని పరిశోధన చేసి, అధ్యయనం చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుంది?—హెబ్రీ 5:13, 14